• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా

అన్నమయ్య: పరిశ్రమల పేరుతో దళితుల భూములు సేకరించడాన్ని వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు పేదల భూముల జోలికి వస్తే తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరించారు. గ్రామసభ తీర్మానం లేకుండా భూసేకరణ నోటీసులు ఇవ్వడం చట్టవిరుద్ధమని ఆగ్రహం వ్యక్తం చేశారు.

March 5, 2026 / 08:43 PM IST

కేవీకే శాస్త్రీయ సలహా సంఘం సమావేశం

PPM: కురుపాం మండలం రస్తాకుంటుబాయిలో కృషి విజ్ఞాన కేంద్రంలో 42వ శాస్త్రీయ సలహా సంఘం సమావేశం నిర్వహించారు. 2025-26లో చేపట్టిన కార్యక్రమాల సమీక్షతో పాటు 2026-27 కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. ఈ సమావేశానికి ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని పరిశోధనా సంచాలకులు డా. ఏ.అప్పలస్వామి అధ్యక్షత వహించగా, డా.బి.ముకుందరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

March 5, 2026 / 08:31 PM IST

ఏలూరులో ఇన్‌ఫ్లుయెన్సర్లతో ఎస్పీ స్పెషల్ మీటింగ్

ఏలూరు: జిల్లా ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ జిల్లాలోని సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. మీకు ఉన్న ఫాలోయింగ్ ఒక బాధ్యత అని, దానిని ప్రజల భద్రత, సమాజ ప్రయోజనాల కోసం ఉపయోగిస్తే మీరు నిజమైన “డిజిటల్ వారియర్స్” అవుతారన్నారు. ముఖ్యంగా సైబర్ క్రైమ్, ఆన్‌లైన్ మోసాలు, మహిళలు, బాలికల భద్రత, వాటిపై అవగాహన కల్పించాలన్నారు.

March 5, 2026 / 08:30 PM IST

సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం

కృష్ణా: గుడ్లవల్లేరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కౌతవరం గ్రామంలో రోడ్డు భద్రత, మహిళల భద్రత, పోక్సో కేసులు, సైబర్ మోసాలు, డిజిటల్ అరెస్టులపై ప్రత్యేక అవగాహన సమావేశం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఎన్‌వి‌వి సత్యనారాయణ నిర్వహించారు. అపరిచిత కాల్స్, మెసేజ్‌లను నమ్మవద్దని, ఆన్‌లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

March 5, 2026 / 08:28 PM IST

చేనేతల సమస్యలు పరిష్కరించాలి: ఎమ్మెల్యే

E.G: అమరావతిలో బీ.సీ సంక్షేమం, చేనేత జౌళి శాఖా మంత్రి ఎస్.సవితను గురువారం రాష్ట్ర అంచనాల కమిటీ ఛైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. మండపేట నియోజకవర్గంలో చేనేతలు ఎదుర్కొంటున్న సమస్యలను వారికి వివరించారు. వీలైనంత త్వరగా చేనేతలకు రావలసిన బకాయిలను అందించి, వారిని ఆదుకోవాలని మంత్రికి ఎమ్మెల్యే వినతి పత్రం అందజేశారు.

March 5, 2026 / 08:28 PM IST

‘ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో వార్షిక క్రీడలు ముగింపు కార్యక్రమం’

నెల్లూరు: విడవలూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం వార్షిక క్రీడా పోటీలు ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థులు ఈ క్రీడల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విద్యార్థుల ప్రతిభ, జట్టు భావన, క్రీడా స్ఫూర్తిని ప్రోత్సహించేందుకు ఈ పోటీలను నిర్వహిస్తున్నట్టు ప్రిన్సిపాల్ సుజాత తెలియజేశారు. ఈ కార్యక్రమం చాలా ఆనందభరిత వాతావరణంలో ముగిసినట్లు తెలిపారు.

March 5, 2026 / 08:28 PM IST

చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యే

కడప: నగర 5వ డివిజన్ కార్పొరేటర్ బండి జయమ్మ ఇటీవల వైసీపీ పార్టీ నుంచి టీడీపీ పార్టీలో చేరిన నేపథ్యంలో ఆమెను కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి పరిచయం చేశారు. ఈ సందర్భంగా నగర అభివృద్ధికి సహకరించాలని సీఎం సూచించారు.

March 5, 2026 / 08:27 PM IST

జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో పదోన్నతులు

కర్నూలు : కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయ పరిధిలో పనిచేస్తున్న జూనియర్ సహాయకులు, టైపిస్టులకు పదోన్నతులు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. గురువారం నలుగురు ఉద్యోగులను సీనియర్ సహాయకులుగా పదోన్నతి కల్పించినట్లు ప్రజా పరిషత్ అధ్యక్షుడు ఎర్రబోతుల పాపిరెడ్డి వెల్లడించారు.

March 5, 2026 / 08:23 PM IST

పమిడిముక్కలలో వాహన తనిఖీలు

కృష్ణా: పమిడిముక్కల పోలీస్ స్టేషన్ పరిధిలోని వీరంకిలాకులు సెంటర్ వద్ద సీఐ వై. చిట్టిబాబు, ఎస్‌ఐ బి. శ్రీను కలిసి వాహనాల తనిఖీలు గురువారం నిర్వహించారు. వాహనాల పత్రాలు, హెల్మెట్ వినియోగం, ట్రాఫిక్ నిబంధనల అమలును పరిశీలించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నియమాలు పాటించాలని పోలీసులు సూచించారు.

March 5, 2026 / 08:20 PM IST

‘టవర్ల నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలి’

ASR: జిల్లాలో మొబైల్ కనెక్టివిటీ లేని ప్రాంతాల్లో సిగ్నల్ వ్యవస్థను మెరుగుపరిచేందుకు, టవర్స్‌ను నిర్దేశించిన గడువులోగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ గురువారం అధికారులను ఆదేశించారు. బిఎస్ఎన్ఎల్, జియో నెట్వర్క్ సంస్థలకు సంబంధించిన అధికారులతో సమన్వయంతో పని చేయాలన్నారు. ఇబ్బందులు పరిష్కరించి, టవర్ల నిర్మాణాలను పూర్తి చేయాలన్నారు.

March 5, 2026 / 08:17 PM IST

గ్రంథాలయంలో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు

CTR: పుంగనూరు పట్టణంలోని గ్రంథాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ ముందస్తు వేడుకలను గ్రంథాలయ అధికారి తులసి నాయక్ గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సీఐ సుబ్బరాయుడు హాజరయ్యారు. పురుషులతో సమానంగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని చెప్పారు. ఆ తర్వాత విద్యార్థినిలకు గుడ్ టచ్-బాడ్ టచ్ గురించి వివరించారు.

March 5, 2026 / 08:13 PM IST

‘మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలి’

ASR: మహిళలు అన్ని రంగాల్లో ఎదగాలని పాడేరు డీఎస్పీ అభిషేక్ అన్నారు. గురువారం అరకులోయ ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాలలో ఎస్సై గోపాలరావు ఆధ్వర్యంలో నిర్వహించిన స్లాస్ మాప్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ మేరకు విద్యార్ధినీలకు మహిళా హక్కులు, చట్టాలు గురించి వివరించారు. మహిళలకు సమస్యలు ఉంటే సంబంధిత అధికారులకు తెలపాలని ప్రిన్సిపాల్ చలపతిరావు సూచించారు.

March 5, 2026 / 08:13 PM IST

కర్నూలు జిల్లాకు అవార్డు రావాలి: కలెక్టర్

KRNL: స్వచ్ఛ సర్వేక్షణ్ మార్గదర్శకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై కర్నూలు కలెక్టర్ డా.ఏ.సిరి మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గతేడాది వచ్చిన ర్యాంక్ కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలని చెప్పారు. కచ్చితంగా జిల్లాకు అవార్డులు వచ్చేలా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు.

March 5, 2026 / 08:12 PM IST

విశాఖ జూపార్క్క కొత్త జంతువులు

విశాఖలోని ఇందిరా గాంధీ జూ పార్క్ ఇక నుంచి కొత్త జంతువులను చూడవచ్చు. అస్సాం స్టేట్ జూ కమ్ బొటానికల్ గార్డెన్ నుంచి జంతు మార్పిడి జరగడంతో గురువారం పలు జంతువును తీసుకువచ్చారు. అక్కడి నుంచి హిమాలయన్ బ్లాక్ టేర్, బ్లాక్ పాంథర్, కామన్ చిరుతపులి, ఆసియాటిక్ సింహం, ఏషియస్ పామ్ సివెట్ ఇక్కడకు చేరుకున్నాయి.

March 5, 2026 / 08:12 PM IST

వాహన తనిఖీలు నిర్వహించిన పోలీసులు

VZM: తెర్లాం పోలీసు స్టేషన్ కూడలిలో గురువారం సాయంత్రం ఎస్సై సాగర్ బాబు సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహించారు. శిరస్త్రాణం విధిగా ధరించాలని సూచించారు. మద్యం తాగి వాహనాలు నడపకూడదని కోరారు. ప్రయాణ సమయాల్లో వాహన పత్రాలు వెంట ఉండాలన్నారు. ట్రిబుల్ రైడింగ్ చేయకూడదన్నారు. ట్రాఫిక్ పోలీసు నిబంధనలు పాటించాలని కోరారు.

March 5, 2026 / 08:08 PM IST