KRNL: సి.బెళగల్ గ్రామాలలో రైతులు, ప్రజలు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని సి.బెళగల్ మండల వ్యవసాయ అధికారి మల్లేష్ కుమార్ అన్నారు. గురువారం మండల పరిధిలోని పీఎం శ్రీ, మోడల్ స్కూల్ విద్యార్థులకు భూసార పరీక్షల నమూనాల సేకరణ, మట్టి పరీక్షలపై అవగాహన కల్పించారు. నేల ఆరోగ్యంగా ఉన్నప్పుడే రైతులకు సమృద్ధిగా పంటలు పండుతాయని విద్యార్థులకు తెలియజేశారు.
TPT: శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో ఫిబ్రవరి 15 నుంచి 23 వరకు జరిగిన మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ అందించిన సేవలు ప్రశంసనీయమని ఆలయ ధర్మకర్తల మండలి ఛైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ తెలిపారు. దేవస్థానం పరిపాలన భవనంలోని ఛైర్మన్ కార్యాలయంలో ఆయన స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులకు ప్రశంసా పత్రాలను అందజేశారు.
CTR: పేకాడుతున్న పదిమందిని అరెస్టు చేసినట్లు పలమనేరు సీఐ మోహన్ రెడ్డి తెలిపారు. పలమనేరు మున్సిపాలిటీ గొబ్బిళ్ల కోటూరు సమీపంలోని కొత్తచెరువు వద్ద పేకాడుతున్నారన్న సమాచారంతో దాడులు చేయగా, పదిమంది పట్టుబడ్డారని CI తెలిపారు. వీరి నుంచి రూ.13200 స్వాధీనం చేసుకుని, అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు.
NDL: బనగానపల్లె మండలం నందవరం చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో ఇవాళ తిరుపతి పట్టణానికి చెందిన రాధా కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. చౌడేశ్వరి దేవి అమ్మవారి ఆలయ అభివృద్ధి కొరకు రూ. 1,00,000 విరాళాన్ని వారు ఆలయ అధికారులకు అందజేశారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి తీర్థప్రసాదాలను ఇచ్చారు.
KDP: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై సమీక్ష కోసం ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌కు టిటిడి జేఈఓ వీరబ్రహ్మంతో కలిసి మేళతాళాలతో స్వాగతం పలికారు. అనంతరం జాయింట్ కలెక్టర్ మీనాతో కలిసి స్వామివారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వాదంతో తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
PLD: నరసరావుపేట సమీపంలోని సాతులూరు రైల్వే స్టేషన్ వద్ద గురువారం జరిగిన ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించారు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడటంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుందని పోలీసులు తెలిపారు. మృతుడు కాషాయం రంగు దుస్తులు ధరించి ఉన్నారని, ఆయన భిక్షాటన చేసే వ్యక్తిగా అనుమానిస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
VSP: రాష్ట్రంలో పెరుగుతున్న పట్టణీకరణను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్ తరాలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు తెలిపారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. 2050 నాటికి పట్టణ జనాభా 50%కు చేరే అవకాశముందని అన్నారు.
ASR: ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియంను త్వరితగతిన పూర్తి చేయాలని ఐటీడీఏ పీవో శ్రీపూజ అధికారులను ఆదేశించారు. గురువారం చింతపల్లి మండలం లంబసింగిలో నిర్మాణంలో ఉన్న ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్ మ్యూజియంను సందర్శించారు. మ్యూజియం నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలన్నారు. నిర్మాణ పనులు వేగవంతం చేయడానికి కార్మికుల సంఖ్య పెంచాలన్నారు.
ELR: దెందులూరు మండలం కొవ్వలికి చెందిన భగవాన్ సత్తుపల్లి వెళ్లేందుకు గురువారం బస్ ఎక్కే సమయంలో జేబులో ఉన్న రూ.50,000 పోగొట్టుకున్నారు. వెంటనే ఏలూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, సిఐ అశోక్ కుమార్, ఎస్‌ఐ మధు వెంకట రాజా వెంటనే స్పందించి సీసీటీవీ ఫుటేజీలు పరిశీలించారు. పోలీసుల వేగవంతమైన చర్యలతో కేవలం గంటలోనే నగదు తిరిగి అందజేశారు.
NTR: దేశీయ గోవుల నుంచి ఉత్పత్తి అయ్యే A2 పాలు, నెయ్యి ద్వారా పాడి రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. గురువారం వత్సవాయి మండలం, కంభంపాడులోని చేకూరి రమేష్‌బాబుకు చెందిన సాయిశ్రీనివాస గోశాలను సందర్శించారు. దేశీ జాతి ఆవుల నుంచి వచ్చే A2 పాలు, వాటితో తయారు చేసే నెయ్యి, పెరుగు వంటి పాల ఉత్పత్తులకు మార్కెట్లో మంచి డిమాం...
VZM: మహిళా సాధికారితకు సమానత్వమే పునాది అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. 2026 సంవత్సరానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారాన్ని స్వప్న హైందవికి ఏపీ గ్రంథాలయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్, పెనుగొండ కామరాజుతో కలిసి ఓ స్కూల్లో ప్రదానం చేశారు. జననియే జగతికి ఆధారం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
VZM: మహిళా సాధికారితకు సమానత్వమే పునాది అని ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ పెన్నేటి స్వప్న హైందవి పేర్కొన్నారు. 2026 సంవత్సరానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ పురస్కారాన్ని స్వప్న హైందవికి ఏపీ గ్రంథాలయ సంఘం జిల్లా శాఖ అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్, పెనుగొండ కామరాజుతో కలిసి ఓ స్కూల్లో ప్రదానం చేశారు. జననియే జగతికి ఆధారం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు.
VZM: మహిళా సాధికారత వారోత్సవాల సందర్భంగా జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో మహిళల భద్రత, హక్కులపై ప్రత్యేక వీడియోలు ప్రదర్శించి అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. మహిళలపై జరిగే నేరాలను అరికట్టడంలో సమాజంలోని ప్రతి ఒక్కరి పాత్ర కీలకమన్నారు. అలాగే, విద్యార్థుల్లో చిన్నప్పటి నుంచే మహిళల పట్ల గౌరవ భావన పెంపొందించాలన్నారు.
AKP: సంపద కేంద్రాలను సక్రమంగా నిర్వహిస్తే పంచాయతీలకు ఆదాయం సమకూర్తుందని ఎస్ రాయవరం డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ అన్నారు. గురువారం కర్రివానిపాలెంలో సంపద కేంద్రాన్ని సందర్శించారు. ప్రతి గ్రామానికి స్వచ్ఛ రథం షెడ్యూల్ ప్రకారం వస్తుందన్నారు. స్వచ్చ రథం పై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.
కృష్ణా: ప్రసిద్ధ నాట్యకేంద్రంగా గుర్తింపు పొందిన కూచిపూడి గ్రామంను సాంస్కృతిక వారసత్వ సంపద కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేయాలని కలెక్టర్ డి.కే. బాలాజీ అధికారులను ఆదేశించారు. గురువారం శ్రీ అమరజీవి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి మునిరత్నం నాయుడుతో కలిసి సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.