GNTR: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గుంటూరు బీఆర్ స్టేడియంలో మార్చి 7న భారీ అథ్లెటిక్స్ లీగ్ నిర్వహిస్తున్నట్లు మై భారత్ జిల్లా ఉపసంచాలకులు కిరణ్మయి దేవిరెడ్డి, డీఎస్‌డీఓ పఠాన్ ఆఫ్రోజ్ ఖాన్ గురువారం తెలిపారు. అండర్-13, 13-18, 18 ఏళ్లకు పైబడిన విభాగాల్లో 100, 200, 400 మీటర్ల పరుగుపందేలు నిర్వహించనున్నామని వారు వెల్లడించారు.
VZM: కొత్తవలస మండల సమాఖ్య కార్యాలయంలో ఏపీఎం వెంకటరమణ ఆద్వర్యంలో గ్రామ సంఘ జెండర్ కమిటీల శిక్షణ గురువారం నిర్వహించారు. లింగ అసమానతలు హింస, వివక్షపై అవగాహన ఉండాలని సూచించారు. సమాజంలో మహిళ ఆర్థిక సహకారాలు, తదితర అంశాలపై వివరించారు. ఈ కార్యక్రమంలో మండల సమాఖ్య లక్ష్మీ ప్రసన్న, తదితరులు పాల్గొన్నారు.
KDP: సిద్ధవటం మండలం పి.కొత్తపల్లి PHC పరిధిలోని జంగాలపల్లి గ్రామంలో గురువారం డా. రంగ లక్ష్మీ ఆధ్వర్యంలో క్షయ వ్యాధిపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా CHO లక్ష్మీ నరసమ్మ మాట్లాడుతూ.. 2 వారాలు నుంచి,దగ్గు,జ్వరము,అలసట బరువు తగ్గడం రాత్రిపూట చెమటలు ఆకలి మందగించడం వంటి లక్షణాలు ఉన్న పేషెంట్లు స్థానిక ప్రభుత్వ వైద్యశాలలో పరీక్షలు చేయించుకోవాలన్నారు.
ASR: పెరటికోళ్ల పెంపకం ద్వారా అదనపు ఆదాయం పొందవచ్చని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి జయరాజు రైతులకు సూచించారు. గురువారం పాడేరు ఎంపీడీవో కార్యాలయంలో సమగ్ర పెరటికోళ్ల యూనిట్ పై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పెరటికోళ్ల యూనిట్లలో జీవ భద్రతా చర్యలు పాటించాలని సూచించారు. సరైన ఆహార నియమాలు అనుసరించి, కోళ్ల ఆరోగ్యం కాపాడుకోవడం ద్వారా అధిక ఆదాయం పొందవచ్చన్నారు.
W.G: ఉండి మండలంలో పలు గ్రామాల్లో కిసాన్ మోర్చా గ్రామ కమిటీలను ఏర్పాటు కోసం జిల్లా కిసాన్ మోర్చా ప్రెసిడెంట్ గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 5 గురు సభ్యులతో కమిటీలు వేశామన్నారు .మండల అధ్యక్షులు యర్రా విక్రమ్, సెక్రటరీ మడిచర్ల సూర్యప్రకాష్ ,డొక్కు వెంకటేశ్వర రావు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ELR: జిల్లాలో స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి రుణ లక్ష్యాలను ఈనెలాఖులోగా పూర్తిగా సాధించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ గౌతమీ సమావేశపు హాలులో గురువారం స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజి, స్త్రీ నిధి రుణాలు, యూనిట్ల స్థాపన పలు అంశాలపై అధికారులతో సమీక్షించారు. ఇంతవరకు 1242.48 కోట్ల రూపాయలు మంజూరు చేసారని అన్నారు.
ASR: భూ రికార్డుల ప్రక్షాళనలో భాగంగా, సాంకేతికతతో రీ-సర్వే నిర్వహించి, ఎలాంటి తప్పులు లేకుండా సరిహద్దులను ఖరారు చేసినట్లు ఆర్డీవో లోకేశ్వరరావు తెలిపారు. గురువారం పాడేరు మండలంలో రైతులకు పాసుపుస్తకాలు పంపిణీ చేశారు. గతంలో ఉన్న పుస్తకాలతో పోలిస్తే, ఇప్పుడు అందజేస్తున్న రాజముద్ర కలిగిన పాసు పుస్తకాలు రైతులకు భూమిపై పూర్తి హక్కు, భద్రతను కల్పిస్తాయన్నారు.
కృష్ణా: అవనిగడ్డలో ఆర్టీసీ డిపో వద్ధ నుంచి ఏఎస్ఆర్ కళ్యాణ మండపం వరకూ ప్రధాన రహదారి నిర్మాణం పూర్తయింది. ఉపాధి నిధులు రూ.76 లక్షలతో 1,040 మీటర్ల బీటీ రోడ్డు నిర్మించారు. ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ ప్రత్యేక శ్రద్ధతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంజూరు చేసిన నిధులతో రోడ్డు నిర్మాణం సాకారమైంది. పీఆర్ డీఈఈ సురేష్ బాబు, ఏఈ బ్రహ్మానంద బాబు పర్యవేక్షించారు.
E.G: రాజమండ్రిలోని గేదెల నూకరాజు కళ్యాణ మండపంలో నూతనంగా ఏర్పాటు చేసిన బార్‌ను వెంటనే వేరే ప్రాంతానికి తరలించాలని కోరుతూ మహిళా సంఘాలు గురువారం ఆందోళనకు దిగాయి. “బార్” పెట్టేందుకు ప్రభుత్వం అనుమతి ఇవ్వడం దారుణమన్నారు. ప్రజల నివాస స్థలంలో బార్‌కి అనుమతి ఇవ్వడం వలన ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారన్నారు.
KRNL: మంత్రాలయం పట్టణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతిని ఘనంగా నిర్వహించాలని జై భీమ్ MRPS నాయకులు గురువారం పిలుపునిచ్చారు. గర్జీ హనుమన్న మాదిగ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో రాష్ట్ర నాయకుడు చిక్కం జానయ్య మాదిగ మాట్లాడారు. ఏప్రిల్ 14న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహం వద్ద అన్ని వర్గాలు ఐక్యంగా జయంతి జరుపుదామని పేర్కొన్నారు.
సత్యసాయి: అమరావతిలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మర్యాదపూర్వకంగా కలిశారు. మడకశిర నియోజకవర్గ అభివృద్ధి పనుల పురోగతి గురించి ముఖ్యమంత్రికి వారు వివరించారు. నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసి, తాగునీటి సమస్య పరిష్కరించాలని ఈ సందర్భంగా విన్నవించారు.
అన్నమయ్య: మల్లూరు అమ్మ జాతరలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు ప్రజా చైతన్య సేవా సంఘం ఆధ్వర్యంలో హెచ్ఐవి, ఎయిడ్స్‌పై అవగాహన వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరాన్ని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ ప్రారంభించి యువతీ యువకులు ఎయిడ్స్‌పై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రూరల్ సీఐ రోషన్ మాట్లాడుతూ ఎయిడ్స్ రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
ATP: తాడిపత్రిలోని పుట్లూరు రోడ్డు రైల్వే గేట్ సమీపంలో గురువారం ఓ వ్యక్తి హల్చల్ చేశాడు. రైలు పట్టాలపై పడుకుని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు. గమనించిన గూడ్స్ రైలు పైలట్ అప్రమత్తమై వెంటనే రైలును నిలిపివేశాడు. ఆ వ్యక్తిని హెచ్చరించడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. దీంతో పుట్లూరు రోడ్డు రైల్వే గేట్ 10 నిమిషాలు ఆలస్యంగా తెరుచుకుంది.
E.G: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను కొవ్వూరు MLA ముప్పిడి వెంకటేశ్వరరావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. గోదావరి తీరప్రాంత తాగునీటి ప్రాజెక్టు కోసం జల్ జీవన్ మిషన్ కింద మంజూరైన రూ. 1400 కోట్ల నిధులలో కొవ్వూరు నియోజకవర్గ వాటర్ గ్రిడ్ దశ-1 పనులకు తగిన వాటా కేటాయించాలని ఎమ్మెల్యే కోరారు. తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.
తూ.గో: మార్చి 7వ తేదీన రాజమండ్రిలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఉన్న వికాస కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం తెలిపారు. ఈ జాబ్ మేళాలో టెన్త్, ఇంటర్, డిగ్రీ, ITI, డిప్లొమా, బీటెక్, M.B.A ఉత్తీర్ణులై 35 ఏళ్లలోపు వయస్సు గల అర్హులైన అభ్యర్థులని తెలిపారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.