• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నీటిలో పడి గొర్రెల మృతి..!

NDL: బేతంచర్ల మండలం బుగ్గనపల్లె గ్రామానికి చెందిన 80 గొర్రెలు బనగానపల్లె మండలం చెరువుపల్లె సమీపంలో మేతకు వెళ్లి నీటిలో ఒకదానిపై ఒకటి పడి ఇవాళ మృతి చెందాయి. విషయం తెలుసుకున్న డోన్ మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ సంఘటన స్థలానికి చేరుకుని రైతులను ఓదార్చారు. గొర్రెల మృతితో నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందించాలని సంబంధిత అధికారులను ఆమె కోరారు.

March 5, 2026 / 08:07 PM IST

“నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు”

కోనసీమ: జిల్లా ఎస్పీ రాహుల్ మీనా ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గురువారం అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ముమ్మర వాహన తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని SHOలు, పోలీస్ సిబ్బంది అమలాపురం ప్రధాన కూడళ్లలో తనిఖీలు చేపట్టి, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా అతి వేగంగా వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకున్నారు.

March 5, 2026 / 08:07 PM IST

జమ్మలమడుగులో స్కానింగ్ సెంటర్లలో తనిఖీలు

KDP: జమ్మలమడుగులో గురువారం వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్కానింగ్ సెంటర్లలో తనిఖీ చేశారు. DY DMHO డాక్టర్ గీత ఆధ్వర్యంలో హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి వెంకటేశ్వర్లు, సీవో శ్రీనివాసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ గీత మాట్లాడుతూ.. గర్భస్థ పిండ లింగ నిర్ధారణ పరీక్షలు చట్టరీత్యా నేరమన్నారు.చట్టాన్ని అతిక్రమించి నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

March 5, 2026 / 08:04 PM IST

‘బ్రూణ హత్యలు చట్టరీత్యా నేరం’

W.G: గర్భస్థ దశలో పిండాన్ని విచ్ఛిన్నం చేయడం చట్టరీత్యా నేరమని పీహెచ్సీ డాక్టర్ హర్షవర్ధన్ హెచ్చరించారు. గురువారం తాడేపల్లిగూడెం (M) వెంకటరామన్న గూడెం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యార్థినిలు, మహిళలకు PCPNDT, లైంగిక విద్యపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అపరిచిత వ్యక్తుల పట్ల బాలికలు అప్రమత్తంగా ఉండాలన్నారు. గుడ్ టచ్, బ్యాడ్ టచ్‌పై అవగాహన ఉండాలన్నారు.

March 5, 2026 / 08:02 PM IST

వరదయ్యపాలెంలో గృహనిర్మాణంపై విచారణ

TPT: కలెక్టర్ ఆదేశాలతో గృహనిర్మాణ సంస్థపై గురువారం ప్రత్యేక విచారణ జరిగింది. అర్హులు కాకుండా కొందరికి ఇళ్లు మంజూరు చేశారన్న ఆరోపణలు, నిర్మాణం పూర్తి కాకుండానే బిల్లులు చెల్లించారన్న ప్రస్తావనకు వచ్చాయి. 10 నెలలుగా విచారణ కొనసాగుతున్నప్పటికీ తుది నిర్ణయం రాకపోవడంతో అర్జీదారు అసహనం వ్యక్తం చేశారు. అర్హులకే ఇళ్లు మంజూరు చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు.

March 5, 2026 / 08:01 PM IST

పేదలకు అండగా CM సహాయనిధి: మాజీ ఎమ్మెల్యే

KKD: పేద ప్రజల ఆరోగ్య భద్రత కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉదారంగా నిధులు మంజూరు చేస్తున్నారని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే SVSS వర్మ అన్నారు. గురువారం గోర్స, కొమరగిరి, అమీనాబాద్ గ్రామాల్లో పర్యటించి, పలువురు లబ్ధిదారులకు CMRF చెక్కులను అందజేశారు. కష్టకాలంలో ప్రభుత్వం ఆదుకోవడంపై లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎంకు కృతజ్ఞతలు తెలిపారు.

March 5, 2026 / 07:58 PM IST

కార్మికుల సమస్యను పరిష్కరించిన MLA

PLD: గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు జోక్యంతో దాచేపల్లి మండలం సాగర్ సిమెంట్స్ కాంట్రాక్టు కార్మికుల సమ్మె ముగిసింది. ఎమ్మెల్యే యాజమాన్యంతో జరిపిన చర్చలు సఫలమవ్వడంతో, కార్మికులకు నెలకు రూ. 3,000 అదనపు వేతనం ఇచ్చేందుకు, తొలగించిన కార్మికులను తిరిగి విధుల్లోకి తీసుకునేందుకు కంపెనీ అంగీకరించింది. దీంతో కార్మికులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.

March 5, 2026 / 07:55 PM IST

యాప్‌ను రూపొందించిన తాడిపత్రి విద్యార్థి

ATP: తాడిపత్రికి చెందిన ఇంజనీరింగ్ విద్యార్థి చాంద్ హాపీజ్ నవాజ్ రూపొందించిన జిల్లా సైన్స్ సెంటర్ వెబ్ సైట్, ఆండ్రాయిడ్ యాప్‌ను అనంతపురం జేఎన్టీయూలో గురువారం ప్రారంభించారు. DEO ప్రసాద్ బాబు, అగస్టా ఫౌండేషన్ సీఈవో పుష్ప వీటిని ఆవిష్కరించి విద్యార్థిని అభినందించారు. విద్యార్థులు మేధస్సుకు పదును పెడితే అద్భుత ఆవిష్కరణలు చేయవచ్చని తెలిపారు.

March 5, 2026 / 07:54 PM IST

భక్తుల సందడిలో వైభవంగా స్వామివారి రథోత్సవం

KDP: లక్ష్మిపాలెం గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం ఘనంగా నిర్వహించగా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని రథాన్ని లాగారు. గోవిందా నామస్మరణతో లక్ష్మిపాలెం మాడవీధులు మారుమోగాయి.భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు.

March 5, 2026 / 07:49 PM IST

మహిళా దినోత్సవ నిర్వహణపై జేసీ సమీక్ష

W.G: ఈనెల 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరం విష్ణు కళాశాలలో వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జేసీ రాహుల్ కుమార్ రెడ్డి తెలిపారు. గురువారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వేడుకల నిర్వహణకు ప్రత్యేక అధికారులు సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

March 5, 2026 / 07:46 PM IST

‘వారం రోజుల్లోగా ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేయాలి’

ASR: వారం రోజుల్లోగా కొయ్యూరు మండలంలో ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేయాలని ఏవో పీ.శివరామ్ ప్రసాద్ వ్యవసాయ సిబ్బందిని ఆదేశించారు. గురువారం చీడిపాలెం రైతు సేవా కేంద్రంలో వారితో సమావేశం నిర్వహించారు. మండలంలో 10,114 మంది రైతులకు గాను 5,808 మంది రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి అయిందని తెలిపారు. మిగిలిన 4,000 మంది రైతులకు ఫార్మర్ రిజిస్ట్రీ పూర్తి చేయాలన్నారు.

March 5, 2026 / 07:46 PM IST

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

GNTR: ఫిరంగిపురం మండల పరిధిలోని అమీనాబాద్, వేములూరిపాడు గ్రామాల్లో రేపు శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఫిరంగిపురం విద్యుత్ ఏ ఈ దుర్గాప్రసాద్ ప్రకటనలో తెలిపారు. విద్యుత్ మరమ్మతు పనుల కారణంగా ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని, వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.

March 5, 2026 / 07:44 PM IST

పది పరీక్షల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలి: DEO

కోనసీమ: ఈ నెల 16 నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణలో అధికారులు నిబద్ధతతో వ్యవహరించాలని DEO పి.నాగేశ్వరరావు ఆదేశించారు. ముమ్మిడివరం AIMS కళాశాలలో గురువారం నిర్వహించిన సమావేశంలో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంటల్ అధికారులకు ఆయన దిశానిర్దేశం చేశారు. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థులకు అవసరమైన కనీస వసతులు కల్పించాలన్నారు.

March 5, 2026 / 07:44 PM IST

‘మహా కుంభాభిషేకానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం’

ఎన్టీఆర్: విజయవాడలో జరిగే మహా కుంభాభిషేకం కార్యక్రమానికి నగరపాలక సంస్థ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. భక్తులకు ఇబ్బందులు లేకుండా త్రాగునీరు, పారిశుధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేసినట్లు కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. 5 స్టాక్ పాయింట్ల ద్వారా 44 కేంద్రాల్లో 12 లక్షల నీటి బాటిళ్లు అందుబాటులో ఉంచారు.

March 5, 2026 / 07:42 PM IST

కర్నూలు DCCB సీఈవోగా శివలీల

KRNL: కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకు(DCCB) నూతన ముఖ్య కార్య నిర్వహణాధికారి(CEO)గా కొమ్మ శివలీల నియమితులయ్యారు. ఆమె గురువారం బాధ్యతలు స్వీకరించారు. తన నియామకానికి సహకరించిన వారికి ధన్య వాదాలు తెలిపారు. బ్యాంకును అభివృద్ధి పథంలో నడిపించడమే లక్ష్యమని పేర్కొన్నారు. బ్యాంకులో బకాయిల వసూళ్లను వేగవంతం చేసి, ఆర్థిక స్థితిని బలోపేతం చేస్తామన్నారు.

March 5, 2026 / 07:42 PM IST