GNTR: అమరావతిలో ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల నిర్వహణపై మంత్రి సవిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో సహచర మంత్రి గుమ్మడి సంధ్యారాణి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని తెలిపారు.
ప్రకాశం: అర్ధవీడులోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినీలకు ఆర్థిక అక్షరాస్యతపై గురువారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఆధ్వర్యంలో కళాజాత రూపంలో ఈ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బ్యాంకు మేనేజర్ గురువారెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థినీలు చదువుతో పాటు బ్యాంకులో పొదుపు అలవాటు పెంపొందించుకోవాలని సూచించారు.
NTR: కంచికచర్ల మండల వీఆర్ఏలు గురువారం తహసీల్దార్ నరసింహారావుకు మెమొరాండం అందజేశారు. ఏళ్ల తరబడి గ్రామ రెవెన్యూ సహాయకులుగా పనిచేస్తున్నప్పటికీ చాలీచాలని జీతాలతో జీవనం సాగిస్తున్నామని తెలిపారు. తమకు పే స్కేల్ జీతాలు పెంచాలని డిమాండ్ చేశారు. అర్హత ఉన్న వీఆర్ఏలను వీఆర్వోలుగా, రికార్డు అసిస్టెంట్లుగా వన్ టైం సెటిల్మెంట్ ద్వారా ప్రమోట్ చేయాలని కోరారు.
BPT: మిషన్ శక్తి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 20 రోజుల ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా గురువారం చీరాల అర్బన్‌లో సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పరిషత్ పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సై చంద్రశేఖర్ విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. సోషల్ మీడియా వినియోగంలో జాగ్రత్తలు పాటించాలని, అనుమానాస్పద లింక్‌లపై క్లిక్ చేయకూడదన్నారు.
AKP: ఎస్ రాయవరం మండలంలో ఇంటి పన్నుల వసూళ్లపై స్పెషల్ డ్రైవ్ కొనసాగుతున్నట్లు డిప్యూటీ ఎంపీడీవో బంగారు సత్యనారాయణ తెలిపారు. గురువారం లింగరాజుపాలెం, తిమ్మాపురం, దార్లపూడి తదితర పంచాయతీల్లో ఇంటింటికి వెళ్లి ఇంటి పన్నులు వసూలు చేసి రసీదులు అందజేశామన్నారు. ఈనెల 15వ తేదీ నాటికి శత శాతం ఇంటి పన్నులు వసూలు చేయాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు.
విశాఖ ద్వారక ప్రాంతంలో గురువారం లారా ఆటిజం చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్, బ్రైట్ లైఫ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వృద్ధులు, నిరుపేదలకు రేషన్ కిట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ హాజరై కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన నిరుపేదలు, నిరాశ్రయులను ఆదుకోవడం ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు.
ASR: స్వయం సహాయక సంఘాల గిరిజన మహిళలు, హస్తకళలు విక్రయించే మహిళలకు ఈనెల 9, 10వ తేదీల్లో ఆధునిక 3D ప్రింటింగ్ సాంకేతికతపై 2రోజులు శిక్షణ ఇవ్వనున్నట్లు ఐటీడీఏ పీవో శ్రీపూజ గురువారం తెలిపారు. పాడేరు కాఫీ హౌస్లో జరిగే శిక్షణకు 10వ తరగతి కనీస అర్హత కలిగిన మహిళలు ధరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆసక్తిగల మహిళలు ధృవపత్రాలు జతచేసి 7లోగా ధరఖాస్తు చేసుకోవాలన్నారు.
SKLM: ప్రకృతి వైపరీత్యాల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గురువారం మంత్రి శాసనమండలిలో మాట్లాడారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ రూపంలో ప్రభుత్వం సహాయం అందిస్తుందని అన్నారు. రైతులకు సహాయాన్ని త్వరితగతిన అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు.
TPT: పిచ్చటూరులోని కేజీ గంగాధరం రెడ్డి పంచాయతీ కాంప్లెక్స్ 23 గదులకు మార్చి 6న ఉదయం 10 గంటలకు బహిరంగ వేలం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు జంతువధశాల, మార్కెట్, బస్టాండ్‌లకు కూడా వేలం ఉంటుంది. పాల్గొనేవారు ముందస్తు డిపాజిట్ చెల్లించి పంచాయతీ కార్యాలయాన్ని సంప్రదించాలని సర్పంచ్ కేజీ రోస్ రెడ్డి తెలిపారు.
KRNL: గ్రామ సర్వేయర్ల సమస్యలను పరిష్కరించాలని గురువారం పెద్దకడబూరులోని మండల తహసీల్దార్ గీతా ప్రియదర్శిని, మండల సర్వేయర్ తేజస్వినిలకు గ్రామ సర్వేయర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేశారు. గ్రామ సర్వేయర్లు ఓంకార్, తిమ్మేష్, పరుశురాం, లలిత, మౌనిక మాట్లాడుతూ రూ. 30 వేలు బేసిక్ పేతో పాటు పదోన్నతులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ATP: పామిడి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో గురువారం ACB అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ ఇంటి రిజిస్ట్రేషన్ కోసం రూ.25 వేలు లంచం తీసుకుంటున్న ప్రైవేటు వ్యక్తి వడ్డే వెంకటేశ్వర్లను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. సబ్ రిజిస్టర్ అధికారి రాధా రమణ లంచం తీసుకోమని చెప్పినట్లు వడ్డే వెంకటేశ్వర్లు ఏసీబీ అధికారులకు తెలిపారు.
VSP: పరువు హత్యతో మరణించిన పోలిపల్లి సూర్యప్రకాశ్‌కి న్యాయం జరగాలని కోరుతూ గురువారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద అఖిల గాండ్ల, తెలికుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. సంఘ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ దాడి సత్యనారాయణ మాట్లాడుతూ.. హత్యకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే, బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం ప్రభుత్వ ఉద్యోగం కల్పించలని డిమాండ్ చేశారు.
VZM: ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి దివస్ వారోత్సవాల సందర్భంగా పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించినట్లు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా సెక్రటరీ కె. సత్యం గురువారం తెలిపారు. సుమారు 30 మంది వృద్ధులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, బీపీ, షుగర్, కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి జన ఔషధి కేంద్రం ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
ELR: ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులు ప్రత్యేక చొరవ చూపి ప్రజలకు అండగా నిలవాలని దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ గారు తెలిపారు. పెదవేగి మండలం దుగ్గిరాలలోని క్యాంపు కార్యాలయంలో పలువురు కూటమి నాయకులు, ప్రజలు ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు.
VZM: ప్రజారోగ్య రక్షణ కోసం నగరంలోని పలు హోటల్, రెస్టారెంట్ యాజమాన్యం, సిబ్బందికి ఆహార భద్రతపై గురువారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించినట్లు ఆహార భద్రత నియంత్రణాధికారిణి ఎస్. ఈశ్వరి తెలిపారు. శుభ్రత ప్రమాణాలు, ప్యాకింగ్‌లపై గుర్తుల ప్రాముఖ్యతపై ఆమె అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆహార భద్రత అధికారి వెంకటరమణ పాల్గొన్నారు.