• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

మాజీ సర్పంచ్‌ను పరామర్శించిన ఎంపీ

నంద్యాల: ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హైదరాబాద్‌లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆత్మకూరు మాజీ సర్పంచ్ మోమిన్ అక్తర్ బీనీ ఇవాళ పరామర్శించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షబానాతో కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అక్తర్ బి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. షబానాకు ధైర్యం చెప్పారు.

March 5, 2026 / 06:20 PM IST

పిచ్చాటూరు ఆరనియార్ ప్రాజెక్టులో యువకుడు మృతి

TPT: పిచ్చాటూరు ఆరనియార్ ప్రాజెక్టు వద్ద కేవీబీపురం మండలం మిద్ది కండిగ గ్రామానికి చెందిన నవీన్(23) శవమై కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని వెలికి తీశారు. బెంగళూరులో ఫార్మసిస్టుగా పనిచేస్తున్న నవీన్ మూడు రోజుల క్రితం ఇల్లు వదిలి వెళ్లినట్లు బంధువులు పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

March 5, 2026 / 06:18 PM IST

కంభంలో ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమం

ప్రకాశం: కంభం మండలంలోని చిన్న కంభం, హజరత్ గూడెంలో పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి దేవేంద్ర గౌడ్ మాట్లాడుతూ.. కంభం ప్రాంతంలో పప్పు శనగ, కందుల కొనుగోల కేంద్రం మార్కెట్ యార్డ్ వద్ద ప్రారంభించారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అగ్రికల్చర్ అసిస్టెంట్, స్థానిక రైతులు పాల్గొన్నారు.

March 5, 2026 / 06:17 PM IST

ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంట్‌కు భూమి పూజ

W.G: రాష్ట్ర పారిశ్రామిక రూపురేఖలు మారుతున్నాయని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. భీమవరంలో గురువారం ఆయన మాట్లాడారు. ఈనెల 23న సాయంత్రం 4 గంటలకు ఆర్సెలార్ మిత్తల్, నిప్పన్ స్టీల్ ఆధ్వర్యంలో రూ.1.5 లక్షల కోట్ల భారీ ఇంటిగ్రేటెడ్ స్టీల్ ప్లాంటు భూమిపూజ నిర్వహించనున్నట్లు తెలిపారు. మోదీ, చంద్రబాబు, కుమారస్వామిల సమష్టి కృషితో ఇది సాధ్యమైందన్నారు.

March 5, 2026 / 06:15 PM IST

‘అగౌరవంగా మాట్లాడటం తగదు’

SKLM: రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న మండలి ఛైర్మన్ మోషేను మతం, పార్టీ ఆపాదిస్తూ మాట్లాడిన మంత్రి అచ్చెన్నాయుడు తక్షణం తన పదవికి రాజీనామా చేయాలని టెక్కలి వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ పేరాడ తిలక్ అన్నారు. గురువారం టెక్కలి పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. సభలో అడుగుపెట్ట కుండా సీఎం చంద్రబాబు మంత్రి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

March 5, 2026 / 06:14 PM IST

బాలుర వసతి గృహంలో తనిఖీ చేసిన అధికారులు

KRNL: తుగ్గలి మండలంలోని జొన్నగిరి బాలుర వసతి గృహాన్ని జిల్లా ఎండోమెంట్ స్పెషల్ ఆఫీసర్ సుధాకర్ రెడ్డి, ఎంపీడీవో విశ్వమోహన్ గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అందుతున్న డొక్కా సీతమ్మ మెనూ భోజనం, వంటగది, గదులు మరియు పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. వసతి గృహాన్ని శుభ్రంగా నిర్వహించి బాలురకు అవసరమైన సౌకర్యాలు అందేలా చూడాలని సిబ్బందికి సూచించారు.

March 5, 2026 / 06:12 PM IST

‘భూసేకరణ, పరిహార ప్రక్రియ వేగవంతం చేయాలి’

KDP: జాతీయ రహదారుల విస్తరణ, సోలార్ పార్కుల ఏర్పాటుకు చేపట్టిన భూసేకరణ మరియు పరిహార పంపిణీ ప్రక్రియలను పెండింగ్ లేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. రాష్ట్ర రెవెన్యూ ప్రత్యేక ముఖ్య కార్యదర్శులు సాయిప్రసాద్, జయలక్ష్మితో కలిసి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో భూసేకరణ పనుల పురోగతిపై సమీక్షించారు.

March 5, 2026 / 06:12 PM IST

చంద్రబాబుతో కలిసి పనిచేయడం అదృష్టం

AKP: హుద్ హుద్ తుఫాన్ ప్రభావంతో అస్తవ్యస్తమైన విశాఖలో పరిస్థితిని వారం రోజుల్లో చక్కదిద్దిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుందని ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ అన్నారు. గురువారం శాసనసభలో మాట్లాడుతూ.. సంక్షోభాల నుంచే అవకాశాలను వెతుక్కోవాలని చంద్రబాబు నాయుడు చేసిన సూచనతో తాను ఎమ్మెల్యే అయ్యానని అన్నారు. ఆయనతో పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు.

March 5, 2026 / 06:10 PM IST

‘నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించాలి’

VZM: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని శాసన మండలిలో ఎమ్మెల్సీ డాక్టర్ పి.వి.వి. సూర్యనారాయణ రాజు గురువారం డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రకటించిన నియామకాలు ఆశించిన స్థాయిలో లేవని, అది జాబ్ క్యాలెండర్ కాకుండా జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారిందని విమర్శించారు.

March 5, 2026 / 06:05 PM IST

అసెంబ్లీని సందర్శించిన నరసరావుపేట విద్యార్థులు

PLD: ప్రజాస్వామ్య విలువలపై అవగాహన కోసం నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఈశ్వర్ కాలేజ్ విద్యార్థులను గురువారం ఏపీ అసెంబ్లీకి తీసుకువచ్చారు. శాసనసభ కార్యకలాపాలు, సభ నిర్వహణ, ప్రజాస్వామ్యంలో చట్టసభల ప్రాధాన్యతను ఆయన విద్యార్థులకు వివరించారు. అసెంబ్లీని నేరుగా వీక్షించే అవకాశం లభించడం పట్ల విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు.

March 5, 2026 / 06:05 PM IST

రేపు ఇందుకూరుపేట మండల సాధారణ సమావేశం

నెల్లూరు: ఇందుకూరుపేట మండల ప్రజా పరిషత్ సాధారణ సమావేశాన్ని ఈనెల ఆరవ తేదీ శుక్రవారం నిర్వహిస్తున్నట్లు మండల ప్రజాపరిషత్ అభివృద్ధి అధికారి నాగేంద్రబాబు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సమావేశంలో వ్యవసాయం, త్రాగునీరు, పారిశుద్ధ్యం, రెవెన్యూ, తదితర విషయాలను చర్చించడం జరుగుతుందన్నారు. ప్రజా ప్రతినిధులు అధికారులు అందరూ హాజరు కావాలన్నారు.

March 5, 2026 / 06:00 PM IST

‘ఫామెక్స్ కార్య‌క్ర‌మాలతో భద్రతా చైతన్యం పెరుగుతుంది’

NTR: విపత్తులపై సరైన అవగాహన, ముందస్తు స‌న్న‌ద్ధతతోనే వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనగలమని కలెక్టర్ లక్ష్మిశా పేర్కొన్నారు. గురువారం క‌లెక్ట‌రేట్లో ఎన్‌డీఆర్ఎఫ్ ఫామెక్స్‌-2026పై స‌మ‌న్వ‌య శాఖ‌ల జిల్లాస్థాయి అధికారుల స‌మావేశం జ‌రిగింది. 20 స‌భ్యుల ఎన్‌డీఆర్ఎఫ్ బృందం ఆధ్వ‌ర్యంలో ఫామెక్స్ కార్య‌క్ర‌మాల ద్వారా ప్రజల్లో ...

March 5, 2026 / 05:59 PM IST

పెదనందిపాడులో శనగల కొనుగోలు ప్రారంభం

GNTR: పెదనందిపాడులో ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా గురువారం 20 టన్నుల శనగలను కొనుగోలు చేశారు. మద్దతు ధర కింద క్వింటాల్‌కు రూ. 5,875 చెల్లిస్తున్నట్లు ఏవో ఐ. సుబ్రహ్మణ్యం తెలిపారు. రైతులు తమ పంటలో 14% కంటే ఎక్కువ తేమ లేకుండా చూసుకోవాలని, సీఎం యాప్ ద్వారా నమోదు చేసుకుని పంటను విక్రయించాలని ఆయన సూచించారు.

March 5, 2026 / 05:56 PM IST

కల్వర్టులో డెడ్ బాడీ కలకలం.!

చిత్తూరులోని స్థానిక కట్టమంచి మార్కెట్ యార్డ్ సమీపంలో కల్వర్టులో ఓ వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు. సమాచారాన్ని పోలీసులకు ఇచ్చారు. టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతుడిని చిత్తూరు సమీపంలోని దొడ్డిపల్లి సీసీఎస్ కాలనీకి చెందిన హమీద్‌గా గుర్తించారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

March 5, 2026 / 05:53 PM IST

‘స్వర్ణ గ్రామంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తాం’

ప్రకాశం: స్వర్ణ గ్రామంలో ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోరా బాల వీరాంజనేయ స్వామి అన్నారు. స్వర్ణ గ్రామాల ద్వారా స్వర్ణాంధ్ర సాధనకు కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యాలయంలో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులకు ప్రమోషన్లు కల్పిస్తామని చెప్పారు. స్వర్ణ గ్రామం వార్డు కార్యాలయాల పర్యవేక్షణకు మూడంచెల వ్యవస్థ తీసుకొచ్చామని వెల్లడించారు.

March 5, 2026 / 05:53 PM IST