GNTR: పెదనందిపాడులో ఏపీ మార్క్‌ఫెడ్ ద్వారా గురువారం 20 టన్నుల శనగలను కొనుగోలు చేశారు. మద్దతు ధర కింద క్వింటాల్‌కు రూ. 5,875 చెల్లిస్తున్నట్లు ఏవో ఐ. సుబ్రహ్మణ్యం తెలిపారు. రైతులు తమ పంటలో 14% కంటే ఎక్కువ తేమ లేకుండా చూసుకోవాలని, సీఎం యాప్ ద్వారా నమోదు చేసుకుని పంటను విక్రయించాలని ఆయన సూచించారు.