VZM: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాలని శాసన మండలిలో ఎమ్మెల్సీ డాక్టర్ పి.వి.వి. సూర్యనారాయణ రాజు గురువారం డిమాండ్ చేశారు. జాబ్ క్యాలెండర్ పేరుతో ప్రకటించిన నియామకాలు ఆశించిన స్థాయిలో లేవని, అది జాబ్ క్యాలెండర్ కాకుండా జాబ్ లెస్ క్యాలెండర్‌గా మారిందని విమర్శించారు.