నంద్యాల: ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి హైదరాబాద్లోని సింధు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆత్మకూరు మాజీ సర్పంచ్ మోమిన్ అక్తర్ బీనీ ఇవాళ పరామర్శించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు మోమిన్ షబానాతో కలిసి ఆమె ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అక్తర్ బి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. షబానాకు ధైర్యం చెప్పారు.