• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

బైరాపురంలో ఎద్దుల బండ్ల పోటీలు

సత్యసాయి: కొత్తచెరువు మండలం బైరాపురం పంచాయతీలో ఉగాది పర్వదినం సందర్భంగా గ్రామస్తులు గురువారం ఎద్దుల బండ్ల పోటీలు నిర్వహించారు. ఈ వేడుకకు మాజీ మంత్రి డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు.

March 19, 2026 / 06:41 PM IST

ప్రారంభమైన ‘మన్యం లీగ్స్-2026’ పోటీలు

PPM: జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘మన్యం లీగ్స్-2026’ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ గురువారం స్థానిక జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ మైదానంలో అత్యంత ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమైంది. జిల్లాలోని వివిధ మండలాల నుండి వచ్చిన జట్లు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. మొదటి రోజు మొత్తం నాలుగు ఉత్కంఠభరిత మ్యాచ్‌లు జరిగాయి.

March 19, 2026 / 06:38 PM IST

కృష్ణాపురంలో వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభం

CTR: పూతలపట్టులోని తవణంపల్లి(M) కృష్ణాపురంలో వాలీబాల్ టోర్నమెంట్ ఘనంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా విచ్చేసిన సి.పి. హరి రెడ్డి క్రీడలను ప్రారంభించి, యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే ఈ టోర్నమెంట్ లక్ష్యమని పేర్కొన్నారు. స్థానిక యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీల్లో పరిసర ప్రాంతాల జట్లు ఉత్సాహంగా పాల్గొన్నాయి. క్రీడలు శారీరక దృఢత్వానికే కాక క్రమశిక్షణకు తోడ్పడతాయన్నారు.

March 19, 2026 / 06:36 PM IST

పంచాంగ శ్రవణంలో పాల్గొన్న మంత్రి

VZM : గజపతినగరంలోని ఉమా రామలింగేశ్వర ఆలయం ప్రాంగణంలో గురువారం సాయంత్రం నిర్వహించిన పంచాంగ శ్రవణంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు. పంచాంగాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు వేదుల భువనేశ్వర ప్రసాద శర్మ చదివి వినిపించారు. పరాభనామ సంవత్సర విశిష్టతను తెలియజేయడంతో పాటు ఏడాదిలో జరిగే అంశాల గురించి వివరించారు.

March 19, 2026 / 06:34 PM IST

అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన కారు

E.G: పెరవలిలో ఓ ఫంక్షన్ హాల్ సమీపంలో గురువారం ఓ కారు అదుపుతప్పి వేగంగా పంట పొలాల్లోకి దూసుకెళ్లింది. అతివేగమే ప్రమాదానికి కారణమని, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగినట్లు స్థానికులు తెలిపారు. కారులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

March 19, 2026 / 06:30 PM IST

రంజాన్ తోఫాను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ కార్మిక నగర్లో షేక్ నాగూర్ భాషా ఏర్పాటు చేసిన రంజాన్ తోఫా కిట్లను ముస్లిం సోదరులకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము గురువారం పంపిణీ చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రంజాన్ పండుగ సేవా భావానికి ప్రతిక అని, పేద కుటుంబాలకు ఈ రంజాన్ తోఫా ఎంతగానో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన ఇంఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, టీడీపీ నేత బాబ్జి పాల్గొన్నారు.

March 19, 2026 / 06:30 PM IST

ముండ్లమూరు పరిసర ప్రాంతాలలో వర్షం

ప్రకాశం: రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ క్రమంలో ముండ్లమూరు పరిసర ప్రాంతాలలో గురువారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి వర్షం పడింది. వాహనదారులకు ఆతరాయం కలిగింది. సాధారణంగా ఈ కాలంలో ఎండలు ఎక్కువగా ఉంటాయి. కానీ వర్షం పడటం వలన ప్రజలకు ఎండల నుంచి కొంత ఉపశమనం దొరికింది.

March 19, 2026 / 06:30 PM IST

సీఎం చేతుల మీదుగా పురస్కారం

KRNL: ముఖ్యమంత్రి చంద్రబాబు చేతులు మీదుగా శ్రీ లక్ష్మీనరసింహ ఉరుకుంద ఈరన్న స్వామి ప్రధాన అర్చకులు జె.ఈరప్ప స్వామి ఉగాది పురస్కారం గురువారం అందుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉగాది పురస్కారాల కార్యక్రమంకు ప్రధాన అర్చకుడు ఈరప్ప స్వామి ఎంపిక అయ్యారు. ఇందులో భాగంగా విజయవాడలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

March 19, 2026 / 06:29 PM IST

ఉపాధి హామీ యాత్ర విజయవంతం: దామోదరం రెడ్డి

TPT: ఆంధ్రప్రదేశ్ PCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర విజయవంతంగా ముగిసిందని శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 2న ప్రారంభమైన ఈ యాత్ర విశాఖపట్నంలో ముగిసిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 29 జిల్లాల్లో 48 సభలు నిర్వహించగా, ప్రజల నుంచి మంచి స్పందన లభించిందని చెప్పారు.

March 19, 2026 / 06:28 PM IST

‘రూ.4 కోట్లతో ఇంద్ర పుష్కరిని అభివృద్ధి’

SKLM: అరసవల్లిలోని ఆదిత్యని ఆలయ పరిధిలోని ఇంద్ర పుష్కరిని అభివృద్ధికి మంత్రి అచ్చెన్నాయుడు చొరవతో ప్రభుత్వం రూ.4 కోట్లు మంజూరు చేసింది. ఈ నెల 21న ఇంద్ర పుష్కరిని ఆధునీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేయనున్నారు. గురువారం నిమ్మాడలోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆలయ ఈవో ప్రసాద్ మంత్రిని కలిసి ఆహ్వాన పత్రిక అందజేశారు.

March 19, 2026 / 06:24 PM IST

పోస్టుల భర్తీకి ప్రభుత్వం శ్రీకారం

AKP: వివిధ ప్రభుత్వ శాఖలో 10,060 పోస్టుల భర్తీకి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి లోకేష్ శ్రీకారం చుట్టినట్లు హోంమంత్రి వంగలపూడి అనిత గురువారం ‘X’లో పేర్కొన్నారు. ఏటా ఉగాదికి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న మంత్రిని అభినందించారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు.

March 19, 2026 / 06:22 PM IST

‘పారిశుద్ధ్యంపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు’

AKP: పారిశుధ్య పనులపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని పంచాయతీ కార్యదర్శులను జిల్లా పంచాయతీ అధికారి సందీప్ హెచ్చరించారు. ఈనెల 23న సీఎం చంద్రబాబు నక్కపల్లి పర్యటనకు వస్తున్న నేపథ్యంలో ఎస్ రాయవరం మండలం నుంచి నక్కపల్లి మండలం వరకు పారిశుధ్య పరిస్థితిని పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు.

March 19, 2026 / 06:22 PM IST

కానిస్టేబుల్ భార్యకు కారుణ్య ఉద్యోగం

VZM: గజపతినగరం పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ టి. తిరుపతిరావు సతీమణి డి. దమయంతికి ఎస్పీ ఎ.ఆర్. దామోదర్ కారుణ్య నియామక ఉత్తర్వులను గురువారం అందజేశారు. ఆమెను టైపిస్టు (జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్)గా నియమిస్తూ, విధుల్లో నిజాయితీతో పనిచేయాలని ఎస్పీ సూచించారు. ాా కార్యక్రమంలో అదనపు ఎస్పీ సౌమ్యలత తదితరులు పాల్గొన్నారు.

March 19, 2026 / 06:19 PM IST

కోదండ రామయ్యకు రాగి కిరీటాలు సమర్పణ

KDP: ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామికి ఉగాది పర్వదినాన గురువారం హైదరాబాద్ వాస్తవ్యులు క్రాంతి కుమార్ బంగారు పొదిగిన రెండు రాగి కిరీటాలను కుటుంబ సభ్యులతో కలిసి సమర్పించారు. ఈ సందర్భంగా సీతారాముల కోసం తెచ్చిన కిరీటాలను టీటీడీ ఆలయ ఇన్‌స్పెక్టర్ నవీన్ కుమార్, అర్చకులు మనోజ్ కుమార్‌కు అందజేశారు. వీటి విలువ రూ.65 వేలు ఉంటుందని ఆలయ అధికారులు స్పష్టం చేశారు.

March 19, 2026 / 06:16 PM IST

పోలీసుల కార్డెన్ సెర్చ్

ASR: ఆపరేషన్ వజ్ర ప్రహార్లో భాగంగా గురువారం జీ.మాడుగుల మండలం గడ్డిబంద గ్రామంలో కార్డెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించామని ఎస్సై సాయిరామ్ పడాల్ తెలిపారు. తమ సిబ్బందితో కలిసి ఆయా గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి తనిఖీలు నిర్వహించామన్నారు. ద్విచక్ర వాహనదారులు ఖచ్చితంగా రికార్డులను కలిగి ఉండాలన్నారు. గంజాయి, నాటుసారా నిర్మూలనకు కార్డెన్ సెర్చ్ నిర్వహించామన్నారు.

March 19, 2026 / 06:15 PM IST