• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ముఖదారమ్మకు బంగారు మంగళసూత్రాల బహుకరణ

W.G: పాలకొల్లు అచ్చుగట్లపాలెంలో కొలువైన శ్రీ ముఖదారమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. అడబాల వెంకటరమణ 2.50 గ్రాములతో చేయించిన బంగారు మంగళసూత్రాలను ముఖధారమ్మ ఆలయ సేవా సంఘం సభ్యులకు అందజేశారు. ఈ మేరకు కమిటీ సభ్యులు వెంకటరమణను సత్కరించారు.

March 19, 2026 / 06:14 PM IST

డాక్టరేట్ అందుకున్న బూర్జ వాసి

SKLM: బూర్జ మండలం వెంకంపేట గ్రామానికి చెందిన డాక్టర్ బి. ప్రకాష్ రావుకి గౌరవ డాక్టరేట్ లభించింది. చేయూత సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో డేస్ప్రింగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఈ డాక్టరేట్‌‌ను గురువారం ప్రదానం చేసింది. వ్యవసాయ కుటుంబానికి చెందిన ప్రకాష్ రావు గత 43 ఏళ్ళుగా ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా రంగాల్లో సేవలు గాను డాక్టరేట్ అందిస్తున్నారు.

March 19, 2026 / 06:14 PM IST

జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన మంత్రి

W.G: ఈ నెల 26న పాలకొల్లు ఛాంబర్స్ కళాశాలలో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో జరిగే జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్‌ను మంత్రి నిమ్మల రామానాయుడు పాలకొల్లులోని ఆయన క్యాంప్ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జాబ్ మేళాలను నిర్వహిస్తున్నామని తెలిపారు.

March 19, 2026 / 06:12 PM IST

అర్చకుడు విజయకుమార్ శర్మకు ఉగాది పురస్కారం

TPT: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ పరశురామ స్వామి దేవస్థానంలో పనిచేస్తున్న అర్చకుడు విజయకుమార్ శర్మకు “ఉగాది పురస్కారం” ప్రదానం చేశారు. జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ఈ అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఆయనను శాలువాతో సన్మానించి, రూ.10,000 నగదు బహుమతిని అందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎమ్మెల్యే, తుడా ఛైర్మన్ పాల్గొన్నారు.

March 19, 2026 / 06:10 PM IST

మహానంది అర్చకుడికి ఉగాది పురస్కారం

NDL: మహానంది క్షేత్రానికి చెందిన అర్చకుడు రెంట చింతల వెంకట శేషయ్య శర్మకు ఉగాది పురస్కారం లభించింది. విజయవాడలో జరిగిన ఒక కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఆయన ఈ పురస్కారాన్ని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు, వేద పండితులు ఆయనకు అభినందనలు తెలియజేశారు.

March 19, 2026 / 06:10 PM IST

దేవనకొండలో జియో నెట్వర్క్ సిగ్నల్ కట్

KRNL: దేవనకొండ మండల వ్యాప్తంగా జియో నెట్వర్క్ సంబంధించి సేవలు పూర్తిగా రావడంలేదని పలువురు జియో కస్టమర్లు వాపోతున్నారు. దీనికి సంబంధించి జియో కేర్‌‌ను వివరణ అడగగా సెల్ టవర్ దగ్గర కోతులు కేబుల్ పూర్తిగా నాశనం చేశాయని, దానికి సంబంధించి రిపేరు జరుగుతుందన్నారు. ఎంత సమయం పడుతుందో తెలియదని జియో సంబంధిత వర్కర్స్ పేర్కొన్నట్లు సమాచారం.

March 19, 2026 / 06:09 PM IST

గేట్లో 5వ ర్యాంక్ సాధించిన జిల్లా వాసి

KRNL: తుగ్గలి మండలం జొన్నగిరి గ్రామానికి చెందిన షేక్ మునీర్ ఆల్ ఇండియా ఇంజనీరింగ్ గేట్ పరీక్షలో 5వ ర్యాంకు సాధించాడు. పంచర్ షాప్ నడిపే తండ్రి షేక్ అల్లా బకాష్-తల్లి షేక్ హమీదా ప్రోత్సాహంతో గుత్తిలో విద్యనభ్యసించి, ఇడుపులపాయలో బీటెక్ పూర్తి చేసిన మునీర్ ఈ విజయం సాధించాడు. గురువారం విడుదలైన ఫలితాల్లో ఆయన ప్రతిభ కనబరిచారు.

March 19, 2026 / 06:08 PM IST

బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే.

పార్వతీపురం మండలం, డోకిశీల పంచాయతీ ప్రజలను హనుమంతుడిలా కాపాడుతానని ఎమ్మెల్యే బోనెల విజయ్ చంద్ర స్పష్టం చేశారు. డోకిశీల పంచాయతీ తేలునాయుడువలస నుంచి గంజిగడ్డ వరకు తలపెట్టిన బీటీ రోడ్డుకు ఎమ్మెల్యే గురువారం శంకుస్థాపన చేశారు. ప్రత్యేక పూజలు చేసి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే స్వయంగా జెసిబి నడిపి పనులు ప్రారంభించారు.

March 19, 2026 / 06:06 PM IST

ఏఆర్ ఎస్సై మహేశ్వర్ రెడ్డి మృతి

సత్యసాయి: పుట్టపర్తిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏఆర్ ఎస్సైగా విధులు నిర్వహిస్తున్న మహేశ్వర్ రెడ్డి గుండెపోటుతో బుధవారం రాత్రి మృతి చెందారు. ఆయన భౌతికకాయానికి గురువారం అనంతపురంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు మృతుడి కుటుంబానికి తక్షణ సాయంగా రూ. లక్ష అందజేశారు. ఎస్పీ తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

March 19, 2026 / 06:05 PM IST

ఉగాది సందర్భంగా పెద్దలకు పూజలు

CTR: కుప్పంలో ఉగాది వేడుకలు విలక్షణమైన ఆధ్యాత్మికతతో సాగాయి. తమిళ సంస్కృతీ సంప్రదాయాల కలయికతో ఇక్కడి ప్రజలు తమ పితృదేవతలకు ఘనంగా నివాళులర్పించారు. మరణించిన తమ పూర్వీకులను స్మరిస్తూ, కుటుంబ సభ్యులందరూ శ్మశానాలకు వెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించడం ఇక్కడి ఆనవాయితీ. ముఖ్యంగా ఉగాది పచ్చడిని వారికి నైవేద్యంగా సమర్పించి భక్తిని చాటుకున్నారు. పండుగ రోజు పెద్దల ఆశీస్సులు తీసుకోవడం విశేషం.

March 19, 2026 / 06:03 PM IST

అర్చకులకు ఉగాది ప్రత్యేక పారితోషికం

కృష్ణా: ఉగాది సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దేవదాయ శాఖ అర్చకులకు ప్రత్యేక పారితోషికం మంజూరు చేసింది. గురువారం జిల్లా కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం అవనిగడ్డలోని శ్రీ రాజశేఖరస్వామి వారి దేవస్థాన అర్చకులు జి.పవన్ శాస్త్రికి ఉగాది పారితోషకం రూ.5,116లను దేవస్థానం ఛైర్మన్ ఘంటసాల రాజమోహనరావు అందచేశారు. దేవదాయ శాఖ ఈవో యార్లగడ్డ వాసు, సిబ్బంది పాల్గొన్నారు.

March 19, 2026 / 06:00 PM IST

యోగా ఛాంపియన్‌షిప్‌లో ఉపాధ్యాయుడి ప్రతిభ

ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి మండలం వెంగలాయపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు స్వర్ణ వెంకటరమణయ్య చండీగర్‌లో ఈనెల 17 నుంచి జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ యోగాసన ఛాంపియన్‌షిప్‌లో ప్రతిభ కనబరిచారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల మధ్య జరిగిన యోగ పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నారు. ఉపాధ్యాయుడు స్వర్ణ రమణాలను పలువురు అభినందించారు.

March 19, 2026 / 06:00 PM IST

జాబ్ క్యాలెండర్ విడుదలపై సంబరాలు

ATP: కూటమి ప్రభుత్వం 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల చేయడంపై అనంతపురం జేఎన్టీయూ వద్ద తెలుగు యువత, టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో సంబరాలు జరిగాయి. విద్యార్థులతో కలిసి నాయకులు కేక్ కట్ చేసి సంతోషం పంచుకున్నారు. యువగళం పాదయాత్రలో మంత్రి నారా లోకేష్ ఇచ్చిన హామీని నిలబెట్టుకోవడం హర్షనీయమని సాకే లక్ష్మీనరసింహ పేర్కొన్నారు.

March 19, 2026 / 06:00 PM IST

దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే తాతయ్య

NTR: పెనుగంచిప్రోలు నిన్న కురిసిన భారీ వర్షాలకు దెబ్బతిన్న పంట పొలాలను ఎమ్మెల్యే శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గురువారం పరిశీలించారు. అనంతరం బాధిత రైతులకు మాట్లాడి పంట నష్ట తీవ్రతను అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం తరఫున సరైన నష్టపరిహారం అందేలా కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

March 19, 2026 / 06:00 PM IST

కళ్యాణ మహోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే

కోనసీమ: ర్యాలి దేవస్థానంలో శ్రీ జగన్మోహిని కేశవ స్వామి దివ్య కళ్యాణ మహోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ కార్యక్రమం గురువారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ మెర్ల నాగేశ్వరరావు, ధర్మకర్తల మండలి సభ్యులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.

March 19, 2026 / 06:00 PM IST