ప్రకాశం: పెద్ద చెర్లోపల్లి మండలం వెంగలాయపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు స్వర్ణ వెంకటరమణయ్య చండీగర్లో ఈనెల 17 నుంచి జరిగిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్ యోగాసన ఛాంపియన్షిప్లో ప్రతిభ కనబరిచారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగుల మధ్య జరిగిన యోగ పోటీల్లో పాల్గొని తన ప్రతిభను చాటుకున్నారు. ఉపాధ్యాయుడు స్వర్ణ రమణాలను పలువురు అభినందించారు.