• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

కాణిపాకంలో వైభవంగా ఉగాది పంచాంగ శ్రావణం

CTR: కాణిపాకంలో ఉగాది సంబరాలు అంబరాన్ని తాకాయి. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయ కళ్యాణ వేదికపై సిద్ధి–బుద్ధి సమేత వరసిద్ధి వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం వైభవంగా నిర్వహించారు. పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ ముఖ్య అతిథిగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. పండితులు నూతన సంవత్సర ఫలితాలను వివరించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తరించారు.

March 19, 2026 / 05:26 PM IST

‘అకాల వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి’

SKLM: రాష్ట్రంలో రాబోయే 3-4 రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన అకాల వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో గురువారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. రైతులకు ప్రభుత్వం పూర్తి సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు.

March 19, 2026 / 05:21 PM IST

తాడిపత్రిలో 2 వేల కుటుంబాలకు పండగ కిట్ల పంపిణీ

ATP: ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డి ఆశీస్సులతో తాడిపత్రిలోని టైలర్స్ కాలనీలో పండగ కానుకల పంపిణీ గురువారం ఘనంగా జరిగింది. టీడీపీ పట్టణ అధ్యక్షుడు టాటా హజీ ఆధ్వర్యంలో ఉగాది, రంజాన్ పండగలను పురస్కరించుకుని 2 వేల కుటుంబాలకు నిత్యావసర కిట్లను అందజేశారు. ఈ కిట్లలో బియ్యం, కందిపప్పు, నెయ్యి వంటి వస్తువులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.

March 19, 2026 / 05:20 PM IST

జాబ్ క్యాలెండర్ విడుదలపై హర్షం

సత్యసాయి: కూటమి ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌పై సోమందేపల్లి మండలానికి చెందిన జనసేన నాయకుడు రంగేపల్లి నాగరాజు హర్షం వ్యక్తం చేశారు. ఉగాది సందర్భంగా యువత ఆశయాలను గౌరవిస్తూ ఎన్నికల హామీ మేరకు 10,060 ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం పట్ల గురువారం మంత్రి నారా లోకేష్‌కు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. నిరుద్యోగులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు.

March 19, 2026 / 05:20 PM IST

పులి సంచారం.. అప్రమత్తంగా ఉండాలి

ASR: పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రంపచోడవరం ఐటీడీఏ పీవో బచ్చు స్మరణరాజు అన్నారు. పోలవరం జిల్లాలో పులి సంచారం జరుగుతుందని సమాచారం ధ్రువీకరించామన్నారు. సాయంత్రం 6 తర్వాత ఉదయం ఆరులోపు ఇళ్లను విడిచి బయటకు వెళ్లవద్దు అన్నారు. పశువులను సురక్షిత ప్రాంతాల్లో ఉంచాలన్నారు. పులి సంచారం దాని సహజ గుణంలో భాగంగా జరుగుతుందన్నారు.

March 19, 2026 / 05:15 PM IST

నేలమ్మ .. నేలమ్మ.. నీకు వేలవేల వందనాలమ్మా..!

KRNL: తుగ్గలి మండలంలోని పలు గ్రామాలలో రైతులు ‘నేలమ్మ.. నేలమ్మ.. నేలమ్మా.. నీకు వేలవేల వందనాలమ్మా..’ అంటూ శ్రీ పరాభవనామ సంవత్సరం మొదటి రోజు గురువారం వ్యవసాయ పనులకు శ్రీకారం చుట్టారు. ‘పరాభవ నామ సంవత్సరమా.. రైతుల ఇంట సిరులు పండించమ్మా..’ అని రైతులు ఎన్నో ఆశలతో దుక్కిదున్ని, పొలం పనులకు బయల్దేరి వెళ్లారు. తమకున్న వృషణాలతో పాలాల్లో సేద్యం పనులను ప్రారంభించారు.

March 19, 2026 / 05:13 PM IST

కొడమంచిలిలో బీజేపీ శిక్షణ తరగతులు

W.G: కొడమంచిలిలో ఈ నెల 22, 23 తేదీల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలకు ‘పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతులు’ నిర్వహించనున్నట్లు మండల అధ్యక్షుడు శ్రీనుబాబు తెలిపారు. ఈ శిక్షణ శిబిరానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవితో పాటు పలువురు సీనియర్ నాయకులు హాజరవుతారన్నారు. ఈ కార్యక్రమం రెండు రోజుల పాటు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

March 19, 2026 / 05:12 PM IST

‘స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు తరలిరావాలి’

AKP: నక్కపల్లిలో ఈనెల 23న జరిగే ఆర్సెలాల్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ శంకుస్థాపనకు పెద్ద ఎత్తున ప్రజలు తరలిరావాలని టీడీపీ వాణిజ్య విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకర బాబ్జి పిలుపునిచ్చారు. గురువారం కోటవురట్ల మండలం గొట్టివాడ గ్రామంలో ఈ మేరకు ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించి కరపత్రాలు పంపిణీ చేశారు. సీఎం చంద్రబాబు చేతుల మీదుగా శంకుస్థాపన జరుగుతుందన్నారు.

March 19, 2026 / 05:11 PM IST

జాబ్ ఖాళీలన్నీ భర్తీ చేయాలి: డీవైఎఫ్ఏ

KRNL: ప్రభుత్వం విడుదల చేసిన జాబ్ క్యాలెండర్‌ను రద్దు చేసి రాష్ట్రంలోని అన్ని ఖాళీ పోస్టులకు వెంటనే నోటిఫికేషన్లు జారీ చేయాలని డీవైఎఫ్ఏ జిల్లా కార్యదర్శి అబ్దుల్లా డిమాండ్ చేశారు. కర్నూలులో మాట్లాడుతూ.. ప్రకటించిన పోస్టులు తక్కువగా ఉండటంతో నిరుద్యోగులు నిరాశ చెందుతున్నారని అన్నారు. ఖాళీలన్నీ భర్తీ చేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.

March 19, 2026 / 05:07 PM IST

సీఎం చేతుల మీదుగా పురస్కారం అందుకున్న వెంపటాపు

W.G: 35 ఏళ్లుగా చిత్రకళలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారం తణుకునకు చెందిన ప్రముఖ చిత్రకారుడు వెంపటాపు వెంకట సత్యనారాయణ అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని గురువారం అందుకున్నారు. ఈయన రాష్ట్ర జాతీయ, అంతర్జాతీయంగా 200 పైగా అవార్డులను అందుకున్నారు.

March 19, 2026 / 05:06 PM IST

‘దివ్యాంగుల సాధికారితకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’

కోనసీమ: రాష్ట్రంలో దివ్యాంగుల సాధికారికతకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సంక్షేమమే ధ్యేయంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. ఉగాది పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా ప్రవేశ పెట్టిన దివ్యాంగ శక్తి ‘పథకం’ను మంత్రి రామచంద్రపురంలో ప్రారంభించారు.

March 19, 2026 / 05:00 PM IST

మాజీ ఎంపీకి ఉగాది శుభాకాంక్షలు

TPT: నాయుడుపేటలో ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యంకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. గురువారం ఆయన నివాసంలో టీడీపీ నేత, ఎస్‌జె జువెలరీస్ అధినేత పోట్లపూడి రాజేష్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెలవల సుబ్రహ్మణ్యంకు శాలువా కప్పి సన్మానించి, శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.

March 19, 2026 / 05:00 PM IST

ఎస్పీకి పోలీసుల ఉగాది శుభాకాంక్షలు

KKD: ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌ను గురువారం జగ్గంపేట సర్కిల్ పోలీసులు మర్యాదపూర్వకంగా కలిశారు. జగ్గంపేట సీఐ తిరుపతిరావు, ఎస్సైలు రఘునాథరావు, శివ నాగబాబు, సతీష్ కుమార్ గురువారం ఎస్పీ కార్యాలయంలో ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.

March 19, 2026 / 05:00 PM IST

రంజాన్ సందర్భంగా నిరుపేద ముస్లింలకు సహాయం

ప్రకాశం: రంజాన్ సందర్భంగా నిరుపేద ముస్లింలకు సహాయం అభినందనీయమని చల్లపల్లి సీఐ కే. ఈశ్వరరావు అన్నారు. గురువారం చల్లపల్లి పడమర వీధి జెండా చెట్టు వద్ధ విశ్రాంత ఉపాధ్యాయుడు అడపా గురవయ్య, అడపా రాంబాబు సహకారంతో నిరుపేద ముస్లింలకు రూ.15 వేలు వ్యయంతో నిత్యావసర సరుకులు అందచేశారు. పఠాన్ కరీముల్లా ఖాన్, పఠాన్ చాన్ ఖాన్, జన్ను అయ్యప్ప, షేక్ కర్ణం, నజీర్ పాల్గొన్నారు.

March 19, 2026 / 05:00 PM IST

ధర్మవరంలో పండగ రోజు తాగునీటి కష్టాలు

సత్యసాయి: ధర్మవరం పట్టణంలోని పార్థసారధి నగర్‌లోని ఎంఈవో ఆఫీస్‌ దగ్గర ఉన్న కాలనీలో నాలుగు రోజులుగా నీటి సరఫరా బంద్ కావడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గురువారం ఉగాది పండగ రోజున కూడా నీళ్లు రాకపోవడంతో కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి నీటి సరఫరా చేయాలని కోరుతున్నారు.

March 19, 2026 / 05:00 PM IST