W.G: ఉగాది పురస్కరించుకుని తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ-కృష్ణ తులసి దంపతులు గురువారం తణుకులో పలు దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేశారు. తొలుత వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించి, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ముత్యాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. నియోజకవర్గ ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.
తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామివారిని హాథీరాంజీ మఠం మహంతు అర్జున్ దాస్ దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు తీర్పు అనంతరం మహంతుగా నియమితులైన అర్జున్ దాస్‌కు మఠం ప్రాంగణంలో ఘన స్వాగతం పలికి సత్కరించారు. ఈ కార్యక్రమంలో కార్యాలయ ఎంటీవో కృష్ణారెడ్డి, సూపరింటెండెంట్ కేశవులు, లా ఆఫీసర్ లక్ష్మీ స్వాములు సనక్ దాస్, కృష్ణ దాస్, మాధవ దాస్ తదితరులు పాల్గొన్నారు.
KRNL: ఆదోని మండలం పెద్దతుంబలంలో గురువారం విద్యుత్ ప్రమాదం జరిగింది. బీసీ కాలనీలో తలారి నాగరాజు ఇంటి వద్ద లైట్ పోల్ జంపర్ మరమ్మతులు చేస్తుండగా షార్ట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ కార్మికుడు హెచ్.ఉసేని గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా.. తమ అనుమతి లేకుండా పని చేసినట్లు లైన్‌మెన్, సబ్‌స్టేషన్ సిబ్బంది తెలిపారు.
KDP: ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరగనున్న సీతారాముల కళ్యాణానికి రాష్ట్ర గవర్నర్ S.అబ్దుల్ నజీర్‌ను టీటీడీ AEO వెంకయ్య చౌదరి ఆహ్వానించారు. ఆలయ అర్చకుల మంత్రోచ్చారణల నడుమ గవర్నర్‌కు ఆహ్వానం పలికారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇంఛార్జ్ DEO శివప్రసాద్, అర్చకులు పాల్గొన్నారు.
అన్నమయ్య: శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి-శ్రీమతి భారతి రెడ్డి దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పంచాంగ శ్రవణం నిర్వహించగా, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి పాల్గొని అధినేతకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
కృష్ణా: గుడివాడ టిడ్కో గృహ లబ్ధిదారులకు మున్సిపల్ కమిషనర్ మనోహర్ ఈరోజు ఆదేశాలు జారీ చేశారు. మొత్తం 8,904 మందికి ఇళ్లు కేటాయించగా, 950 మందికి ఇళ్ల కేటాయింపు పూర్తయినా రుణాల మంజూరులో జాప్యం జరుగుతోందన్నారు. వీరిలో ఇప్పటివరకు కేవలం 228 మంది మాత్రమే రుణ సౌకర్యం పొందారున్నారు. మిగిలిన లబ్ధిదారులు ఈ నెల 31 లోపు రుణాలు మంజూరు చేయించుకోవాలన్నారు.
PLD: ఈపూరు మండలం ముప్పాళ్ళ గ్రామంలోని శిరిడీ సాయిబాబా దేవాలయంలో వార్షికోత్సవ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు అర్చకులు, గ్రామస్తులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
KRNL: క్రిష్ణగిరి మండలం కటారుకొండలో శ్రీ గుంటి రంగస్వామి తిరునాల సందర్భంగా గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఈ.శ్యామ్ కుమార్ ఆదేశాల మేరకు టీడీపీ కార్యకర్తలు గ్రామ ప్రజలకు ఉచిత మజ్జిగ పంపిణీ చేశారు. వేసవి వేడిని దృష్టిలో ఉంచుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై సేవలను వినియోగించుకున్నారు.
NTR: తాడేపల్లిలో నివాసముంటున్న మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డిని, ఎన్టీఆర్ జిల్లా వైసీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్, మాజీ మంత్రులు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మాజీ సీఎంకి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. కాసేపు ఆయనతో ముచ్చటించారు.
GNTR: ఉగాది పర్వదినం సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ ప్రతి ఇంటికి ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నింపాలని కోరుకున్నారు. కొత్త సంవత్సరం కొత్త ఆశయాలతో ముందుకు సాగాలని, రాష్ట్రం అభివృద్ధి దిశగా మరింత పురోగతి సాధించాలని ఆకాంక్షించారు. ప్రజల సహకారంతో నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
కోనసీమ: ఆలమూరు మండలం చింతలూరు శ్రీ నూకాంబికా అమ్మవారిని ఉగాది పర్వదినం సందర్భంగా గురువారం కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం పాలకమండలి ఛైర్మన్ వీరి అప్పారావు, ఈవో ఉండవల్లి వీర్రాజు చౌదరి ఆలయ సాంప్రదాయాలతో సాదర స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతపురంలోని BJP కార్యాలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఉత్సవాలు గురువారం వైభవంగా నిర్వహించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాల ప్రతిబింబంగా పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఈ వేడుకల్లో పాల్గొన్నాయి. జిల్లా ప్రజలందరికీ బీజేపీ నేతలు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన సంవత్సరం అందరి జీవితాల్లో ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం, సుఖశాంతులు నింపాలని ఆకాంక్షించారు.
NLR: బుచ్చిరెడ్డి పాళెం మండలం దామరమడుగు గ్రామంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది సంబరాలు తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టేలా ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తనయులు డాక్టర్ అర్జున్ రెడ్డి పాల్గొన్నారు. మామిడి తోరణాలు, ముగ్గుల హరివిల్లుల మధ్య గ్రామీణ వాతావరణంలో కోలాహలం మధ్య ఉగాది వేడుకలను నిర్వహించారు.
NDL: జిల్లా స్థాయి బాక్సింగ్ టోర్నమెంట్ కమ్ సెలక్షన్స్‌లో జూనియర్ యూత్ విభాగంలో ఆత్మకూరు క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. మోహన్, నారాయణ, చిరు, శేఖర్, ఆలీబాషా విజయాలు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు గురువారం ఎంపికయ్యారు. ఈ నెల 22, 23వ తేదీల్లో విశాఖపట్నంలో జరిగే పోటీలలో నంద్యాల జిల్లా తరఫున పాల్గొననున్నట్లు వారు తెలిపారు.
TPT: హైదరాబాద్‌కు చెందిన మధుశేషు టీటీడీ వేంకటేశ్వర గో- సంరక్షణ ట్రస్టుకు గురువారం రూ.12.55 లక్షలు విరాళంగా అందించారు. అదేవిధంగా హైదరాబాద్‌కు చెందిన మరోదాత టీటీడీ బోర్డ్ ట్రస్టుకు రూ.5 లక్షలు విరాళంగా అందించారు. ఈ మేరకు దాతల తరఫున టీటీడీ బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు శ్రీవారి ఆలయంలో ఈవో ముద్దాడ రవి చంద్రకు విరాళం డీడీలను అందజేశారు.