• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

తెనాలి కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వ ‘ఉగాది పురస్కారాలు’

GNTR: విజయవాడలో జరిగిన ఉగాది వేడుకల్లో తెనాలికి చెందిన ప్రముఖులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఘనంగా సత్కరించారు. శిల్పి కాటూరి రవిచంద్ర, సాహితీవేత్త సాయి లక్కరాజు, కవి అయినాల మల్లేశ్వరరావు సీఎం చేతుల మీదుగా ఉగాది పురస్కారాలను అందుకున్నారు. ఆయా రంగాల్లో వారు చేస్తున్న విశేష సేవలను అభినందించిన ముఖ్యమంత్రి, వారికి తెలుగుతల్లి ప్రతిమలను అందజేశారు.

March 19, 2026 / 07:12 PM IST

విద్యార్థులకు సైకిళ్ళు పంపిణీ

కృష్ణా: గుడివాడ బీసీ సెల్ అధ్యక్షుడు దారం నరసింహారావు మొదటి వర్ధంతి సందర్భంగా ఆయన సతీమణి బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నాగమణి విద్యార్థులకు సైకిళ్ళు, మహిళలకు కుట్టు మిషన్లు, ఇస్త్రీ పెట్టెలను గురువారం పంపిణీ చేశారు. గుడివాడలో బీసీలకు కమ్యూనిటీ హాల్ నిర్మాణం చేయాలనే సంకల్పంతో కృషి చేసిన దారం నరసింహారావు ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తామని నాగమణి తెలిపారు.

March 19, 2026 / 07:08 PM IST

మిట్టపాలెం నారాయణస్వామి ఆలయంలో పంచాంగ శ్రవణం

ప్రకాశం: సి.యస్.పురం మండలం మిట్టపాలెంలోని నారాయణ స్వామి దేవస్థానంలో ఉగాది పరాభవనామ సంవత్సరం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు శివప్రసాదు శర్మని ఈవో శ్రీగిరిరాజు నర్సింహబాబు సత్కరించారు. సుబ్రమణ్యం పంచాంగ శ్రవణం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత విష్ణుమూర్తి స్వామివారి గ్రామోత్సవం మాడవీధుల్లో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

March 19, 2026 / 07:04 PM IST

గ్రామాభివృద్ధే లక్ష్యం: ఎమ్మెల్యే

SKLM: ఉగాది సందర్భంగా ఎమ్మెల్యే గొండు శంకర్ శ్రీకూర్మం పంచాయతీ తండ్యాలపేట గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. తాగునీరు, రహదారులు, డ్రైనేజీ, విద్యుత్ సమస్యలపై అధికారులతో మాట్లాడి వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామాభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.

March 19, 2026 / 07:04 PM IST

కరియామాణిక స్వామి ఆలయంలో ఉగాది వేడుకలు

CTR: నగరిలోని శ్రీ కరియామాణిక్య స్వామి ఆలయంలో ఉగాది పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారికి విశేష అభిషేకాలు, అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో పండితులు పంచాంగ శ్రవణం చేసి, నూతన సంవత్సర ఫలితాలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, అర్చకులు, స్థానిక భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు.

March 19, 2026 / 07:03 PM IST

ఉగాది పచ్చడిని భక్తులకు అందించిన కోలా ఆనంద కుమార్

TPT: శ్రీకాళహస్తి గాలి గోపురం వద్ద ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ ఇంఛార్జ్ కోలా ఆనంద్ కుమార్ తన మిత్రబృందంతో కలిసి భక్తులకు ఉగాది పచ్చడి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఉగాది పండుగ మన భారతీయ సంస్కృతి సంప్రదాయాలను, ప్రజలందరినీ ఒకే తాటిపైకి తీసుకువస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొని భక్తులకు సేవలందించారు.

March 19, 2026 / 07:02 PM IST

తిరుమలలో ఉగాది ఆస్థాన వేడుకలు

TPT: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది ఆస్థానం నిర్వహించారు. సుప్రభాతం అనంతరం శుద్ధి చేసి శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారికి విశేష పూజలు చేశారు. అనంతరం ఆలయంలో ఊరేగింపుగా ప్రవేశించి మూలవిరాట్టు, ఉత్సవమూర్తులకు నూతన వస్త్రాలు సమర్పించారు. పంచాంగ శ్రవణం నిర్వహించారు. బంగారు వాకిలి వద్ద శాస్తోక్తంగా ఆస్థానం జరిగింది.

March 19, 2026 / 07:00 PM IST

మాధవరంలో కర్ణాటక మద్యం పట్టివేత

KRNL: మంత్రాలయం మండలం మాధవరంలో ఆంధ్ర కర్ణాటక సరిహద్దు చెక్‌పోస్ట్ వద్ద కర్ణాటక నుంచి ఆంధ్రాకు రవాణా చేస్తున్న కర్ణాటక మధ్యాన్ని పట్టుకున్నట్లు ఎక్సైజ్ సీఐ ప్రసాద్ రావు తెలిపారు. కోడుమూరుకు చెందిన సురేశ్ అనే వ్యక్తి కర్ణాటక ప్రాంతం గిలికే సుగుర్ నుంచి 96 విస్కీ టెట్రా ప్యాకెట్లను తీసుకెళ్తుండగా గుర్తించామన్నారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు.

March 19, 2026 / 07:00 PM IST

కసాపురం ఆలయంలో ఉగాది పంచాంగ శ్రవణం

ATP: గుంతకల్లు కసాపురం శ్రీ నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం ఉగాది ఉత్సవాలలో భాగంగా ఆలయ ఈవో విజయరాజు, ఆలయ ధర్మకర్త సుగుణమ్మ ఆధ్వర్యంలో వేద పండితులు, అర్చకులు పరాభవ నామ సంవత్సరం ఉగాది పంచాంగ శ్రావణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు.

March 19, 2026 / 07:00 PM IST

పద సంచాలనమునకు బయలుదేరిన ఆర్ఎస్ఎస్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఏర్పడి 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా విజయవాడలో ఏ వన్ కన్వెన్షన్ హాల్ వద్ద పద సంచలనం ఆర్ఎస్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తిరువూరు నుంచి ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు గురువారం బయలుదేరి వెళ్లారు. అదేవిధంగా ప్రతి ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఈ కార్యక్రమానికి హాజరుకావాలని పిలుపునిచ్చారు.

March 19, 2026 / 07:00 PM IST

శ్రీవారి సేవలో ఎమ్మెల్యే

SKLM: కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని కుటుంబ సభ్యులతో కలిసి గురువారం ఎమ్మెల్యే రమణమూర్తి దర్శించుకున్నారు. ఈ మేరకు స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో ఆలయ అర్చకుల వేద ఆశీర్వచనం పొందినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఉగాది రోజు స్వామిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు.

March 19, 2026 / 07:00 PM IST

ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతలు

VZM: మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ ఉత్తర్వుల మేరకు కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి విజయనగరం నగరపాలక సంస్థ ప్రత్యేక అధికారిగా గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. నగర ప్రజలకు మౌలిక సదుపాయాలు సమగ్రంగా అందించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

March 19, 2026 / 07:00 PM IST

‘తహసీల్దార్‌ను సస్పెండ్ చేయాలి’

PPM: బామిని మండలం తహసీల్దార్ శివన్నారాయణను తక్షణమే సస్పెండ్ చేయాలని గిరిజన సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ప్రధాన కార్యదర్శి పాలక రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. వీఆర్ఏలను తహసీల్దార్ తన ఇంటీ, సొంత పనులకు వాడు కోవడం, దూషణలు చేయడం సరైంది కాదని అన్నారు. ఇప్పటికే తహసీల్దార్‌ పై అనేక ఫిర్యాదులు నమోదు అయ్యాయని అన్నారు.

March 19, 2026 / 07:00 PM IST

ఉగాది పురస్కారం అందుకున్న రామశాస్త్రి

W.G: చిత్రకళలో చేసిన విశేష కృషికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ఉగాది పురస్కారం తణుకునకు చెందిన ప్రముఖ చిత్రకారుడు ఎస్.వి.రామశాస్త్రి అందుకున్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని గురువారం అందుకున్నారు. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయంగా పలు అవార్డులను రామశాస్త్రి అందుకున్నారు.

March 19, 2026 / 06:50 PM IST

ఉగాది పండుగ జరుపుకున్న మాజీ మంత్రి

CTR: మాజీ మంత్రి రోజా నగరిలోని తన నివాసంలో తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలను భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆమె గోపూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆమె ఆకాంక్షించారు. అనంతరం నూతన సంవత్సర శుభ ఫలితాలు కలగాలని కోరుకుంటూ ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు తెలియజేశారు.

March 19, 2026 / 06:47 PM IST