AKP: ఎలమంచిలి మండలం కొత్తలి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉన్న మందు గుండు సామగ్రిని గురువారం స్వాధీనం చేసుకున్నట్లు రూరల్ ఎస్సై ఉపేంద్ర తెలిపారు. స్వాధీనం చేసుకున్న మందు గుండు సామగ్రి విలువ రూ.4,000 వరకు ఉంటుందన్నారు. మందు గుండు సామగ్రి నిల్వ చేసిన నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. అక్రమంగా మందు గుండు సామగ్రి నిలువ చేస్తే చర్యలు తప్పవన్నారు.
E.G: గోకవరం మండలంలోని సూదికొండ గ్రామ శివారు చెరువు వద్ద కోడి పందేల శిబిరంపై పోలీసులు గురువారం దాడి చేశారు. ఈ ఘటనలో పది మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి ఐదు కోడిపుంజులు, రూ.1,820 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై బి.నాగమణి తెలిపారు. జాతరల సాకుతో గ్రామాల్లో కోడిపందేలు నిర్వహిస్తే సహించేది లేదని, కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
VZM: ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని ఒక పవర్ ఫుల్ మాస్ ఎంటర్ టైనర్‌గా ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు అభివర్ణించారు. గురువారం ఎచ్చెర్ల జనసేన ఇంఛార్జ్ విశ్వక్సేన్‌తో కలసి ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను తిలకించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. సామాజిక అంశాలను స్పటిస్తూ Dy.CM కళ్యాణ్ ఆలోచనలకు దగ్గరగా ఉంటూ సినిమా చాలా బాగుందని ప్రసంశించారు.
ASR: ఎన్నికల ముందు ప్రతిపక్ష నాయకుడిగా సీఎం చంద్రబాబు గ్రామ, వార్డు వాలంటీర్లకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అరకులోయ గ్రామ, వార్డు వాలంటీర్ల యూనియన్ డిమాండ్ చేసింది. యూనియన్ నాయకులు ఆనంద్, బుచ్చన్నలు గురువారం అరకులోయలో మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చి 2ఏళ్ళు గడిచిన వాలంటీర్లుకు ఇచ్చిన హామీ నెరవేర్చలేదని, తమను నిర్లక్ష్యం చేస్తే పోరాటాలు చేస్తామన్నారు.
SKLM: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం జిల్లాలో విస్తృతంగా పర్యటిస్తారు. ఈ మేరకు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. శుక్రవారం ఉదయం హరిశ్చంద్ర పురం, మందస, పాతపట్నం రైల్వే స్టేషన్లలో పలు రైలు హాల్ట్‌లను ప్రారంభిస్తారు. సాయంత్రం అలికాంలోని రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొంటారని కేంద్రమంత్రి కార్యాలయం గురువారం ప్రకటనలో తెలిపారు.
అన్నమయ్య: మదనపల్లె టౌన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సిద్ధవరం గ్రామానికి చెందిన శ్రీకాంత్ (27) అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా, సిద్ధవరం మలుపు వద్ద ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైక్ అదుపుతప్పి కిందపడటంతో ఈ ప్రమాదం జరిగింది. కుటుంబసభ్యులు అతడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
KRNL: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని తెలుగు యువత పార్లమెంట్ అధ్యక్షుడు ఎస్.అబ్బాస్ అన్నారు. ఉగాది సందర్భంగా 10 వేలకుపైగా ఉద్యోగాల భర్తీ ప్రకటన యువతకు కానుకగా నిలిచిందన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్‌కు ధన్యవాదాలు తెలిపారు. యువత ఈ అవకాశాలను వినియోగించుకోవాలని ఇవాళ సూచించారు.
CTR: చిత్తూరు(M) తుమ్మిందపాళ్యం ధనకోటి గంగమ్మ ఆలయంలో ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తండ్రి, జిజేఎం ఫౌండేషన్ డైరెక్టర్ గురజాల చెన్నకేశవుల నాయుడు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక కూటమి నాయకులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు.
అన్నమయ్య: మదనపల్లిలోని నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరి నగర్‌కు చెందిన చేనేత కార్మికుడు రఘునాధ్ మునగ కాయలు కోయడానికి ఇంటి ఆవరణలోని చెట్టు ఎక్కాడు. కొమ్మ విరిగి విద్యుత్ వైర్లపై పడి కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు అతడిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, సకాలంలో వైద్యులు వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పిందని తెలిపారు.
TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానంలో ఉగాది వేడుకల సందర్భంగా బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, పాలకమండలి సభ్యురాలు కోలా వైశాలి దంపతులను ఘనంగా సన్మానించారు. జిల్లా ఉపాధ్యక్షులు మేళాగారం సుబ్రమణ్యం రెడ్డి, ఇతర బీజేపీ నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కోలా ఆనంద్ మాట్లాడుతూ.. ఈ నూతన సంవత్సరం ప్రజలందరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, విజయాలను చేకూర్చాలని ఆకాంక్షించారు.
కోనసీమ: అయినవిల్లి సిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో గురువారం భక్తులు చేసిన వివిధ సేవల ద్వారా రూ. 5,28,320 ఆదాయం లభించిందని ఆలయ ఈవో సత్యనారాయణ తెలిపారు. ప్రత్యేక దర్శనం ద్వారా 1231 మంది స్వామివారిని దర్శించుకున్నారని, అత్యధికంగా 117 ద్విచక్ర వాహనాలకు పూజలు నిర్వహించారని, 8900 మంది అన్న ప్రసాదం స్వీకరించారన్నారు.
ప్రకాశం: కనిగిరి ఆదర్శ పాఠశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం కొరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ పద్మావతి తెలిపారు. నెల 18 నుంచి ఏప్రిల్ 30 వరకు దరఖాస్తుల స్వీకరణ, మే 3న ఎంపిక జాబితా ప్రదర్శన, 6న ధ్రువ పత్రాల పరిశీలన జరుగుతుందన్నారు. నిబంధనల మేరకు పదవ తరగతి మార్కుల ఆధారంగా సీట్లు కేటాయించడం జరుగుతుందని తెలిపారు.
KDP: ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడం తమ బాధ్యతని వేంపల్లి అగ్నిమాపక కేంద్రాధికారి బి.శివరామిరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ సేవా పథకం అవార్డు ఆయనకు లభించింది. ఈ గురువారం అగ్నిమాపక కేంద్రంలో సిబ్బంది శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఆయన మాట్లాడుతూ.. ఈ అవార్డు మొత్తం విభాగానికి దక్కిన గౌరవమని, భవిష్యత్తులో మరింత సేవలు అందిస్తామని తెలిపారు.
VZM: జిల్లాలో డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సరఫరా సక్రమంగా కొనసాగుతున్నదని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌర సరఫరాల అధికారి మురళినాథ్ గురువారం తెలిపారు. సరఫరాపై కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. అనధికార నిల్వలపై చేపట్టిన తనిఖీల్లో ఈ వారం 55 సిలిండర్లు స్వాధీనం చేసుకొని, 19 మందిపై కేసులు నమోదయ్యాయన్నారు.
సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది వేడుకలు గురువారం వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా డాక్టర్ కె. వందన బృందం నిర్వహించిన భక్తి సంగీత కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. సాయి కుల్వంత్ హాల్‌లో జరిగిన ఈ వేడుకలో పండితులు శాస్త్రోక్తంగా పంచాంగ శ్రవణం నిర్వహించి నూతన సంవత్సర రాశిఫలాలను వివరించారు.