KDP: బద్వేల్‌లో ఓ యువకుడు మద్యం మత్తులో మూడు రోజులుగా హల్‌చల్ సృష్టించాడు. దర్గావీధిలో చిన్న పిల్లలపై కత్తితో దాడికి యత్నించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పిల్లలు ఇళ్లలో నుంచే బయటకు రాకుండా ఉండే పరిస్థితి నెలకొంది. దీంతో ఆగ్రహించిన స్థానిక యువకులు అతడిని పట్టుకుని దేహశుద్ధి చేసి, కాళ్లు కట్టేసి మత్తు దిగే వరకు నీళ్లు పోశారు.
NTR: నందిగామ బార్ అసోసియేషన్ 2026-27 సంవత్సరానికి సంబంధించి న్యాయవాదుల ఎన్నిక సందర్భంగా అభ్యర్థులు నామినేషన్లు గురువారం దాఖలు చేశారు. ఈ సందర్భంగా వారు ర్యాలీగా బయలుదేరి కోర్టు ఆవరణలో కమిషనర్ వద్దకు చేరుకొని నామినేషన్ దాఖలు చేశారు. అధ్యక్ష పదవికి కరిముల్లా, ఉపాధ్యక్ష పదవికి రామకృష్ణ, కార్యదర్శిగా రామారావు నామినేషన్లు సమర్పించారు.
పార్వతీపురంలో 24 గంటలు షాపులు తెరిచి ఉంచే జీవో నంబరు-5ని రద్దు చేయాలని సీఐటీయూ డిమాండ్ చేసింది. ఈ జీవో కార్మిక హక్కులకు విరుద్ధమని పేర్కొంది. గురువారం సుందరయ్య భవనం నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించి నిరసన తెలిపారు. కార్మికులపై పని భారం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ, వెంటనే జీవోను ఉపసంహరించుకోవాలని హెచ్చరించారు.
ASR: ఢిల్లీలో కేంద్ర గిరిజన శాఖ మంత్రిని కలిసి గిరిజన ప్రాంత సమస్యలను వివరించామని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అరకు ఎంపీ తనూజరాణి తెలిపారు. అల్లూరి జిల్లాలో బాక్సైట్ తవ్వకాల చర్యలను ఆపాలని కేంద్రమంత్రిని కోరినట్లు చెప్పారు. గురువారం ఆమె మాజీ సీఎంని కలిసి ఉగాది శుభాకాంక్షలు తెలిపారు.
KRNL: ఆదోని జిల్లా సాధన జేఏసీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు 124వ రోజుకు చేరాయి. ఈరోజు క్రైస్తవ సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు. నాయకులు మాట్లాడుతూ.. ఇప్పటివరకు పాలక, ప్రతిపక్ష నేతలు స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రజాప్రతినిధులు స్పందించి ఆదోని జిల్లాగా ప్రకటించేందుకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
CTR: పుంగనూరు SS పేటలోని ఈద్గా మైదానాన్ని అంజుమన్ కమిటీ సభ్యులతో కలిసి సీఐ సుబ్బరాయుడు పరిశీలించారు. శనివారం రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు నిర్వహించే ప్రత్యేక నమాజుల ఏర్పాట్లపై ఆయన చర్చించారు. ప్రార్థనల సమయంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్ మళ్లింపు చర్యలు చేపడుతున్నట్లు సీఐ వెల్లడించారు. శాంతియుత వాతావరణంలో పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.
VSP: ఆంధ్ర విశ్వవిద్యాలయం దూర, ఆన్‌లైన్ విద్యా కేంద్రంలో ఉగాది సంబరాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ ఆచార్య నాయుడు మాట్లాడుతూ.. ఉద్యోగులందరూ కలిసి తెలుగు సంస్కృతిని ప్రతిబింబించేలా వేడుకలు జరుపుకోవడం ఎంతో ఆనందదాయకమని తెలిపారు. మహిళా సిబ్బంది వేసిన ముగ్గులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
PLD: శావల్యాపురం మండలం బొందిలిపాలెం గ్రామంలోని శ్రీ అడివి పేరంటాలమ్మ అమ్మవారి తిరుణాల మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వినుకొండ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, తీర్థప్రసాదాలు అందజేశారు.
NDL: జర్నలిస్టుల సంక్షేమంపై సీఎం చంద్రబాబు ప్రత్యేక దృష్టి సారించాలని డోన్‌లో జర్నలిస్ట్ నాగరాజు గురువారం విజ్ఞప్తి చేశారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో సుమారు 25 వేల మంది జర్నలిస్టులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. వారికి పెన్షన్ పథకం అమలు చేయాలని, తమిళనాడు తరహాలో మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు సహాయం అందించాలని కోరారు.
VZM: జాబ్ కేలండర్ ఒక ప్రకటన మాత్రమే కాదు.. నిరుద్యోగులకు ఒక భరోసా అని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు..గురువారం పరాభవనామ ఉగాది పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ ప్రకటించడం పట్ల మంత్రి శ్రీనివాస్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చే నాలుగేళ్లలో...
W.G: డ్రగ్స్ సేవించి పట్టుబడ్డ ఏలూరు ఎంపీ పుట్టా మహేష్‌ను పదవి నుంచి బర్తరఫ్ చేయాలని, డ్రగ్స్‌లో అధికార టీడీపీ నేతలే పట్టుబడటం ప్రజలకు ముఖ్యమంత్రి సంజాయిషీ చెప్పాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి.బలరాం డిమాండ్ చేశారు. సీపీఎం చేపట్టిన జిల్లా ప్రజా చైతన్య పాదయాత్ర గురువారం 22వ రోజు పాలకోడేరు మండలంలో మోగల్లు గ్రామంలో ఘనంగా ప్రారంభమైంది.
NLR: గిరిజన సామాజిక వర్గాల సర్వతోముఖాభివృద్ధికి పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ ఛైర్మన్ అంతర్ సింగ్ ఆర్య నెల్లూరు పర్యటన సందర్భంగా జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో గిరిజనుల స్థితిగతులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనను ఎమ్మెల్యే కలిసి గిరిజన సమస్యలపై ప్రత్యేక మెమొరాండం సమర్పించారు.
ATP: జిల్లాలో LPG సిలిండర్ల కొరత లేదని, వినియోగదారులు వదంతులను నమ్మవద్దని జాయింట్ కలెక్టర్ విష్ణుచరణ్ వెల్లడించారు. జిల్లాలో గ్యాస్ సరఫరా సాధారణంగానే సాగుతోందని స్పష్టం చేశారు. విదేశీ యుద్ధాల వల్ల సరఫరా ఆగుతుందనే ప్రచారంలో నిజం లేదని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్‌ను నిరోధించేందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు.
PPM: ప్రత్యేక అధికారి పాలనలోనైనా పార్వతీపురం పురపాలన గాడిలో పడాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. గురువారం కాంగ్రెస్ పార్టీ డిసిసి జిల్లా అధ్యక్షులు వంగల దాలినాయుడు పార్వతీపురంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైసీపీ, టీడీపీ పాలనలో పురపాలన గాడి తప్పిందని ఆరోపించారు.
BPT: ఒంగోలుకు చెందిన పూనూరు పవన్ కుమార్‌కు చెందిన AP40CA3200 నంబరు గల కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి, అతనిని చంపుతామని బెదిరించారని బాధితుడు తెలిపాడు. బుధవారం అర్ధరాత్రి 1 గంటల సమయంలో చిన్నగంజాం మండలం కడవకుదురు రైల్వే గేటు సమీపంలో ఈ ఘటన జరిగింది. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు.