• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

జి్ల్లాలో ఇద్దరు మైనర్ బాలికల అదృశ్యం

CTR: గుడిపాల (M)నికి చెందిన ఓ మైనర్ బాలిక చిత్తూరులో అదృశ్యమైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల మేరకు.. బాలిక 23వ తేదీ కాలేజీకి వెళ్లొస్తానంటూ ఇంటి నుంచి బయలుదేరి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు 1 టౌన్ పోలీస్ స్టేషన్‌లో  ఫిర్యాదు చేశారు. పలమనేరు మండలానికి చెందిన మరో బాలిక సైతం ఆదివారం చిత్తూరులో మిస్సయిన ఘటనపై కేసు నమోదు అయింది.

March 25, 2026 / 12:33 PM IST

నీటి కుంటలో పడి వృద్ధురాలు మృతి

ప్రకాశం: గిద్దలూరు మండలం నరవ గ్రామ సమీపంలోని నీటి కుంటలో పడి ఓ గుర్తుతెలియని వృద్ధురాలు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 25, 2026 / 12:30 PM IST

సామాజిక భవనానికి మరమ్మతులు ప్రారంభం

AKP: గొలుగొండ(మం) కృష్ణదేవిపేటలో శిధిలావస్థలో ఉన్న సామాజిక భవనం మరమ్మతులు, ప్రహరీ గోడ, సీసీ రోడ్డు పనులను ఎంపీపీ గజ్జల మణికుమారి, సర్పంచ్ పందిరి సత్యనారాయణ బుధవారం ప్రారంభించారు. ఎంపీపీ నిధులలో భవనం మరమ్మతులకు రూ.5 లక్షలు, సీసీ రోడ్డు పనులకు రూ.2.5 లక్షలు కేటాయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.

March 25, 2026 / 12:29 PM IST

ఈ నెల 31న మెగా జాబ్ మేళా

శ్రీకాకుళంలోని అభ్యుదయ డిగ్రీ కళాశాలలో మార్చి 31న రాష్ట్ర నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. 15 ప్రైవేట్ కంపెనీలు పాల్గొని 500పైగా ఖాళీలకు నియామకాలు చేపట్టనున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ ఉద్యోగాలకు 18-30 ఏళ్ల మధ్య వయసున్న నిరుద్యోగులు అర్హులని పేర్కొన్నారు.

March 25, 2026 / 12:28 PM IST

పొన్నలూరులో ఉచిత పశు వైద్య శిబిరం

ప్రకాశం: పొన్నలూరు మండలం మాలపాడులో మార్కెట్ కమిటీ యార్డ్ వారి ఆధ్వర్యంలో ఉచిత పశువైద్య శిబిరం నిర్వహించారు. బుధవారం డాక్టర్ శివరామకృష్ణ పశువులకు గాలికుంట వ్యాధులు రాకుండా టీకాలు వేశారు. పశువులకు సీజనల్ వ్యాధులు సోకకుండా గ్రామస్తులకు జాగ్రత్తలు వివరించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ యార్డ్ కమిటీ ఛైర్మన్ కర్నా తిరుపతమ్మ, తదితరులు పాల్గొన్నారు.

March 25, 2026 / 12:25 PM IST

ఈ నెల 27న సీతారామ కళ్యాణం

VZM: శ్రీ రామనారాయణంలో ఈ నెల 27న సాయంత్రం 5 గంటలకు శ్రీ సీతారామ కళ్యాణం అంగరంగ వైభవంగా జరగనుందని భక్తులందరూ పాల్గొనవలసిందిగా ఎన్‌సీ‌ఎస్ ట్రస్ట్ సభ్యులు నారాయణం శ్రీనివాస్ కోరారు. బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీరామనవమి వేడుకల ఉత్సవ ప్రతులను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో చాణక్య, శ్రీనివాసరాజు, పీఆర్వో రమణ పాల్గొన్నారు.

March 25, 2026 / 12:25 PM IST

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన ఎమ్మార్వో

NLR: బుచ్చి (M) పెనుబల్లి గ్రామంలో తాహాసీల్దార్ అంబటి వెంకటేశ్వర్లు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. అనంతరం ధాన్యం మద్దతు ధరలను గురించి ఆయన రైతులను పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కేంద్రాలలో అమ్ముకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

March 25, 2026 / 12:25 PM IST

మహిళ తాళిబొట్టు లాక్కెళ్లిన దుండగులు

అన్నమయ్య: వాల్మీకిపురం సమీపంలోని మంచూరు గ్రామంలో చోరీ ఘటన చోటుచేసుకుంది. చంద్రమ్మ అనే మహిళ పొలంలో పని చేస్తుండగా చింతకాయలు కొనుగోలు చేస్తామని చెప్పి వచ్చిన వ్యక్తి ఆమెను మోసం చేశాడు. అనంతరం మెడలో ఉన్న తాళిబొట్టును లాక్కొని, మరో వ్యక్తితో కలిసి బైక్‌పై పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

March 25, 2026 / 12:25 PM IST

‘ఆయన రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారు’

KRNL: తల్లికి, సొంత చెల్లికి న్యాయం చేయలేని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు ఎలా న్యాయం చేస్తారని కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు విమర్శించారు. ఇవాళ కర్నూలులో మాట్లాడుతూ.. కుటుంబ వ్యవహారాల్లోనే న్యాయం చేయలేని నాయకుడు ప్రజల సమస్యలను ఎలా పరిష్కరిస్తాడో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రజల సమస్యలపై దృష్టి పెట్టాలని సూచించారు.

March 25, 2026 / 12:22 PM IST

దహన సంస్కారాలకు బల్లా పల్లవి ఆర్థిక సాయం

అనంతపురం హమాలి కాలనీకి చెందిన చిన్న అంకలమ్మ మృతి చెందడంతో ఆమె కుటుంబానికి మార్కెట్ యార్డ్ ఛైర్‌పర్సన్ బల్లా పల్లవి అండగా నిలిచారు. మానవతా దృక్పథంతో దహన సంస్కారాల ఖర్చుల నిమిత్తం రూ. 10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. మృతురాలి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ.. కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.

March 25, 2026 / 12:20 PM IST

వేటపాలెంలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన

BPT: వేటపాలెం మండలం చల్లారెడ్డి పాలెం గ్రామ పంచాయతీ పరిధిలోని పొట్టి సుబ్బయ్య పాలెంలో బుధవారం 14 లక్షలతో CC రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీరాజ్ DE రామచంద్రుడు, గ్రామ TDP అధ్యక్షులు కీర్తి పూర్ణ, పంచాయతీ సెక్రటరీ సంపత్ కుమార్‌లు పాల్గొని అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు.

March 25, 2026 / 12:20 PM IST

విఘ్నేశ్వరుని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా

కోనసీమ: ప్రముఖ సినీ నటి, మాజీమంత్రి ఆర్కే రోజా బుధవారం ఉదయం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం అందజేసి, శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.

March 25, 2026 / 12:06 PM IST

విఘ్నేశ్వరుడిని దర్శించుకున్న మాజీ మంత్రి రోజా

కోనసీమ: ప్రముఖ సినీ నటి, మాజీమంత్రి ఆర్కే రోజా బుధవారం ఉదయం అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు ఆమెకు వేద ఆశీర్వచనం అందజేసి, శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు.

March 25, 2026 / 12:06 PM IST

మారనున్న ఉమ్మడి జిల్లా రాజకీయ ముఖచిత్రం.!

ఉమ్మడి చిత్తూరు జిల్లా రాజకీయాల్లో ఇప్పటి వరకు పురుషులదే హవా. ప్రస్తుతం ఒక్క మహిళ కూడా MP, MLAగా లేరు. చట్ట సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలైతే ఈ లెక్క మారనుంది. కొత్తగా ఏర్పడనున్న అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిపి ఏడుగురు మహిళలు MLAలు కానున్నారు. చంద్రగిరి నియోజకవర్గం మహిళకు రిజర్వ్ అయితే తాను MLAగా బరిలో ఉంటానని సుధారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

March 25, 2026 / 12:04 PM IST

ఎస్సీ కాలనీలో అంబేద్కర్ భవనానికి శంకుస్థాపన

AKP: గొలుగొండ ఎస్సీ కాలనీలో డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ పేరుతో సామాజిక భవనం నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. జిల్లా పరిషత్ ఛైర్మన్ స్పెషల్ నిధుల నుంచి రూ.10 లక్షలతో చేపట్టనున్న ఈ పనులను ఎంపీపీ గజ్జలపు మణికుమారి, సర్పంచ్ కసిపల్లి అప్పారావు ప్రారంభించారు. భవనం నిర్మాణంతో కాలనీ ప్రజలకు సౌకర్యాలు మెరుగుపడతాయని వారు తెలిపారు.

March 25, 2026 / 12:03 PM IST