• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

ఆదిత్యని సేవలో హైకోర్టు న్యాయమూర్తి

SKLM: అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని హైకోర్టు న్యాయమూర్త సి.డి.శేఖర్ బుధవారం స్వామి వారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ, కార్యనిర్వహణాధికారి ప్రసాద్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి, వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వదించారు.

March 25, 2026 / 01:35 PM IST

కంపు కొడుతున్న మురుగునీటి కాలువలు

VZM: బొబ్బిలి పట్టణంలోని మురుగునీటి కాలువలు కంపు కొడుతున్నాయి. కాలువలలో పూడికలు పేరుకుపోయి మురుగునీరు సక్రమంగా ప్రవహించకపోవడంతో కాలువలు దుర్గంధం వెదజల్లుతున్నాయి. జంగాల శివాలయం వీధి సమీపంలోని కాలువలు కంపు కొట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. స్వచ్ఛ బొబ్బిలిని చెత్త బొబ్బిలిగా మారుస్తున్నారని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

March 25, 2026 / 01:33 PM IST

ఇరుగుళంలో ఉచిత వైద్య శిబిరం

TPT: శ్రీ సిటీ పరిధిలోని ఇరుగుళం గ్రామంలో ఎస్సై ప్రియాంక ఆధ్వర్యంలో ఉచిత కంటి, దంత వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ సంస్థల సహకారంతో జరిగిన ఈ శిబిరంలో గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరీక్షలు, చికిత్సలు పొందారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి శిబిరాలు ప్రజల్లో ఆరోగ్య అవగాహన పెంచుతాయని తెలిపారు.

March 25, 2026 / 01:32 PM IST

ఉప్పలగుప్తం ఎస్సైగా షేక్ జానీ భాషా

కోనసీమ: ఉప్పలగుప్తం ఎస్సైగా షేక్ జానీ భాషా నియమితులయ్యారు. ఆయన గతంలో అయినవిల్లి, నగరం, పామర్రు స్టేషన్‌లలో పని చేశారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఎస్సై సెలవుపై వెళ్లడంతో ఇప్పటి వరకు అమలాపురం ఎస్సై కిషోర్ ఇంఛార్జ్‌గా వ్యవహరించారు. త్వరలోనే జానీ భాషా బాధ్యతలు స్వీకరించనున్నారు.

March 25, 2026 / 01:29 PM IST

ఉప్పలగుప్తం ఎస్‌ఐగా షేక్ జానీ భాషా

కోనసీమ: ఉప్పలగుప్తం ఎస్సైగా షేక్ జానీ భాషా నియమితులయ్యారు. ఆయన గతంలో అయినవిల్లి, నగరం, పామర్రు స్టేషన్‌లలో పని చేశారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన ఎస్సై సెలవుపై వెళ్లడంతో ఇప్పటి వరకు అమలాపురం ఎస్సై కిషోర్ ఇంఛార్జ్‌గా వ్యవహరించారు. త్వరలోనే జానీ భాషా బాధ్యతలు స్వీకరించనున్నారు.

March 25, 2026 / 01:29 PM IST

డోన్‌లో అక్రమ గ్యాస్ గోదాం సీజ్..!

NDL: డోన్ మండలం కొచ్చెరువు గ్రామంలో అక్రమంగా నడుస్తున్న గ్యాస్ గోదాంపై అధికారులు దాడి చేసి సీజ్ చేశారు. సిలిండర్లను బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లు ఇవాళ గుర్తించారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్ రెడ్డి ఆదేశాలతో అధికారులు వెంటనే స్పందించి గోదాంను సీజ్ చేసి సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

March 25, 2026 / 01:25 PM IST

జీవీఎంసీ బృందం సింగల్ యూజ్ ప్లాస్టిక్ తనిఖీలు

VSP: మాదవధారలో జీవీఎంసీ బృందం సింగల్ యూజ్ ప్లాస్టిక్ తనిఖీలు చేపట్టింది. 16 షాపుల్లో తనిఖీ చేసి కేజీ ప్లాస్టిక్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన వర్తకులకు రూ.3000 జరిమానా విధించారు. ఇదే విధంగా తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని జోన్ శానిటేషన్ సూపర్వైజర్ రామారావు హెచ్చరించారు.

March 25, 2026 / 01:21 PM IST

గ్యాస్ కోసం గుమ్మలక్ష్మీపురంలో రద్దీ

PPM: గుమ్మలక్ష్మీపురం మండలంలోని జీసీసీ గోడౌన్ వద్ద ఎల్పీజీ గ్యాస్ కోసం వినియోగదారులు భారీగా తరలివచ్చారు. గ్యాస్ సరఫరాకు సంబంధించిన నిబంధనలు, బుకింగ్ సమయంలో OTP సమస్యలు తలెత్తడంతో వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. పరిసర గ్రామాల ప్రజలు కూడా గ్యాస్ కోసం గోడౌన్ వద్దకు చేరుకోవడంతో రద్దీ పెరిగింది. గ్యాస్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు లేవని అధికారులు తెలిపారు.

March 25, 2026 / 01:21 PM IST

ప్రజలకు మెరుగైన వైద్య సేవలు

ELR: ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడానికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చింతలపూడి ఎమ్మెల్యే రోషన్ కుమార్ అన్నారు. బుధవారం కామవరపుకోట మండలం రావికంపాడు గ్రామంలో హెల్త్ క్లినిక్ సెంటర్ ఆయన ప్రారంభించి మాట్లాడారు. గ్రామస్తులకు ప్రసూతి, శిశు ఆరోగ్యం, నాన్ కమ్యూనికేబుల్ వ్యాధుల స్క్రీనింగ్, అవసరమైన మందులు ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు.

March 25, 2026 / 01:13 PM IST

పార్లమెంటులో వైసీపీ కార్యాలయం ప్రారంభం

CTR: నూతన పార్లమెంటు భవనంలో వైసీపీ పార్టీ కార్యాలయాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఎంపీలు పలువురు పాల్గొన్నారు. వారు నూతన కార్యాలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వైసీపీ ఎంపీల విజ్ఞప్తితో స్పీకర్ 12వ గదిని పార్టీకి కేటాయించిన సంగతి తెలిసిందే.

March 25, 2026 / 01:13 PM IST

అనంతలో టీడీపీ నాయకులు సంబరాలు

అనంతపురం నగరంలో ఆర్డీటీ సంస్థ రెన్యువల్ అయిన సందర్భంగా బుధవారం టీడీపీ నాయకులు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు పూల నాగరాజు, ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి ఆర్డీటీ వ్యవస్థాపకుడు మంచు ఫెర్రర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ఆర్డీటీకీ రెన్యువల్ కూటమి ప్రభుత్వంతోనే సాధ్యమన్నారు.

March 25, 2026 / 01:12 PM IST

తిరుపతిలో గ్యాస్ కొరతతో హోటళ్లపై ప్రభావం

తిరుపతి నగరంలో కొన్నిచోట్ల గ్యాస్ సమస్య కొనసాగుతోంది. కమర్షియల్ సిలిండర్ల సరఫరాలో అంతరాయం కారణంగా కొన్ని హోటళ్లు మూతపడ్డాయి. కొందరు బ్లాక్ మార్కెట్‌లో డొమెస్టిక్ సిలిండర్లను కొనుగోలు చేసి హోటళ్లలో వినియోగిస్తున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపమే దీనికి కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

March 25, 2026 / 01:09 PM IST

కామ్రేడ్ బాపనయ్యకు ఘన నివాళులు

NTR: కామ్రేడ్ గుంటూరు బాపనయ్య 49వ వర్ధంతిని విస్సన్నపేటలో బుధవారం నిర్వహించారు. ఆయన చిత్రపటానికి వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, కెవీపీఎస్ జిల్లా నాయకుడు జ్ఞాన రత్నం నివాళులర్పించారు. గుంటూరు బాపనయ్య కృష్ణాజిల్లా దివిసీమ ప్రాంతంలో కష్టజీవుల కోసం విద్యార్థి దశ నుంచి అనేక పోరాటాలు చేశారు. దున్నే వాడికే భూమి కావాలని జమీందారులను ఎదిరించారన్నారు.

March 25, 2026 / 01:06 PM IST

వైద్యులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే

కృష్ణా: గుడివాడ ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో వైద్య అధికారులు, వైద్యులు, టెక్నీషియన్లు ఇతర సిబ్బందితో ఎమ్మెల్యే రాము బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో అందిస్తున్న చికిత్సల వివరాలు, అందుబాటులో ఉన్న వసతులు, సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రి వోపీ, ఐపీ, సర్జికల్ రికార్డులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు.

March 25, 2026 / 01:04 PM IST

గుత్తిలో వివాహానికి వేడుకకు హాజరైన ఎమ్మెల్యే

KRNL: గుత్తి పట్టణంలోని ఆర్‌కే ఫంక్షన్ హాల్‌లో చిప్పగిరి గ్రామానికి చెందిన బర్మే పెద్ద రామాంజినేయులు కుమారుడు రాజశేఖర్ వివాహం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలూరు ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి హాజరై వధూవరులను ఆశీర్వదించారు. ఈ వేడుకలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

March 25, 2026 / 01:02 PM IST