• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పెట్రోల్ కష్టాలు తీరాయి.. వదంతులు నమ్మొద్దు

పల్నాడు జిల్లా పిడుగురాళ్లలోని అన్ని పెట్రోల్ బంకుల్లో బుధవారం నాటికి ఇంధన నిల్వలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాయి. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ సరఫరా సజావుగా సాగుతోందని, సోషల్ మీడియాలో వచ్చే తప్పుడు వార్తలను నమ్మి ఆందోళన చెందవద్దని స్థానిక అధికారులు స్పష్టం చేశారు.

March 25, 2026 / 12:53 PM IST

తాగునీటి సమస్యపై కమీషనర్‌కు వినతి

VZM: రాజాంలోని స్థానిక అంతకాపల్లి, మొగిలివలసలో తాగునీటి సమస్యపై రహదారిని నిర్బంధించి గ్రామస్థులు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ మేరకు బుధవారం మున్సిపల్ కమీషనర్ రామచంద్రరావును గ్రామస్థులు కలిసి వినతిపత్రం సమర్పించారు. తాగునీరు సరఫరా కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని, తక్షణమే తాగునీటి సరఫరా పునరుద్ధరించాలని, సమస్యకు శాశ్వత పరిష్కారించాలని కోరారు.

March 25, 2026 / 12:48 PM IST

‘మున్సిపాలిటీపై కూటమి జెండానే ఎగురుతుంది’

​కోనసీమ: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అమలాపురం అన్ని వార్డుల్లోను విజయం సాధించి, కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని MLA అయితాబత్తుల ఆనందరావు ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల పదవీ బాధ్యతలు ముగిసిన కూటమి కౌన్సిలర్ల ఘన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. అమలాపురాన్ని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మార్చేందుకు కృషి చేస్తానన్నారు.

March 25, 2026 / 12:47 PM IST

కేంద్ర జల శక్తి కార్యదర్శికి కలెక్టర్ ఘన స్వాగతం

E.G: పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న ప్రాజెక్టు పనులను పరిశీలించేందుకు కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శి వీఎల్. కాంతారావు బుధవారం రాజమండ్రికి విచ్చేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆమె పూల మొక్కను అందజేసి ఆత్మీయ స్వాగతం పలికారు. కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

March 25, 2026 / 12:44 PM IST

ఎల్లమ్మ ఆలయంలో పూర్ణాహుతి మహోత్సవం

TPT: చంద్రగిరి మూలస్థాన ఎల్లమ్మ తల్లి ఆలయంలో పూర్ణాహుతి కలశాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులతో కలిసి హాజరయ్యారు. దంపతులకు ఆలయ ఛైర్మన్, ఈవో, కమిటీ సభ్యులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రత్యేక పూజా కార్యక్రమాలలో పాల్గొని పూర్ణాహుతి కలశాభిషేక వేడుకల్లో పాల్గొన్నారు.

March 25, 2026 / 12:44 PM IST

కుంభాభిషేకంలో మాజీ ఎమ్మెల్యే

CTR: పలమనేరు అర్బన్ బోడిరెడ్డిపల్లిలో శ్రీ సీతారాముల దేవాలయ విగ్రహ ప్రతిష్ఠ, మహా కుంభాభిషేక కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఇందులో మాజీ ఎమ్మెల్యే వెంకట గౌడ పాల్గొన్నారు. గ్రామ ప్రజలందరి సహకారంతో నిర్మించిన ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రంగా వర్ధిల్లాలని కోరారు. మహా పూర్ణాహుతి, కుంభాభిషేక కార్యక్రమాల్లో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నట్టు చెప్పారు.

March 25, 2026 / 12:42 PM IST

‘అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం’

KRNL: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి ప్రభుత్వం పేదలకు ఇవ్వాల్సిన ఇంటి స్థలాలను తక్షణమే ఇవ్వాలని సీపీఐ మండల కార్యదర్శి వీరేష్, AIKS జిల్లా ఉపాధ్యక్షుడు ఆంజనేయ డిమాండ్ చేశారు. ఇవాళ పెద్దకడబూరు తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. గ్రామీణ ప్రాంతంలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లను అందజేయాలన్నారు.

March 25, 2026 / 12:41 PM IST

రొంపిచర్లలో గాలికుంటు వ్యాధి నివారణకు వ్యాక్సిన్ పంపిణీ

PLD: రొంపిచర్ల మండలంలోని కొనకంచివారి పాలెం గ్రామంలో జాతీయ పశు వ్యాధి నియంత్రణ కార్యక్రమం నిర్వహించారు. పశువులకు గాలికుంటు వ్యాధి రాకుండా వ్యాక్సిన్ మందులను నర్సరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు పంపిణీ చేశారు. పశువుల ఆరోగ్యం రైతుల ఆర్థికాభివృద్ధికి కీలకమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

March 25, 2026 / 12:41 PM IST

‘విద్యార్థుల ప్ర‌తిభ దేశాభివృద్ధికి వినియోగించాలి’

విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ స్నాతకోత్సవం బుధవారం ఘనంగా జరిగింది. గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యఅతిథిగా పాల్గొని, విద్యార్థులు తమ ప్రతిభను దేశాభివృద్ధికి వినియోగించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పూర్ణచంద్రరావు సగ్గుర్తి, తల్లావజ్ఝల పతంజలి శాస్త్రి విశిష్ట అతిథులుగా హాజరయ్యారు.

March 25, 2026 / 12:41 PM IST

శక్తి యాప్ అవగాహన కార్యక్రమం

SKLM: మీ మొబైల్ ఫోన్‌లో శక్తి యాప్ ఉంటే పోలీస్ రక్షణ ఉన్నట్లే అని టెక్కలి డివిజన్‌కు చెందిన శక్తి టీం కానిస్టేబుల్ ఎం. గిరిధర్ అన్నారు. కోటబొమ్మాళి(మం) హట్కో కాలనీ బ్రాడ్‌లా స్కూల్లో యాప్‌పై అవగాహన కార్యక్రమం బుధవారం నిర్వహించారు. హెల్మెట్ లేకుండా వాహన చోధకులు ప్రయాణం చేయరాదని తెలిపారు. ప్రతి ఒక్కరూ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు.

March 25, 2026 / 12:41 PM IST

RSKలను తనిఖీ చేసిన డివిజన్ డిప్యూటీ డైరెక్టర్

ATP: నార్పల మండలంలోని పప్పూరు, దుగుమర్రి గ్రామపంచాయతీలలోని RSKలను అనంతపురం డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ రమేష్ రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. RSKలలోని రికార్డులను వారు పరిశీలించారు. RSKల పరిధిలో వారు చేపడుతున్న కార్యక్రమాలను సిబ్బందిని అడిగి ఆయన తెలుసుకున్నారు. వేసవి సమయంలో పాడి రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు.

March 25, 2026 / 12:37 PM IST

నూతన పోలీస్ స్టేషన్ భవనానికి భూమి పూజ

సత్యసాయి: లేపాక్షిలో నూతన పోలీస్ స్టేషన్ భవన నిర్మాణానికి ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ బుధవారం భూమి పూజ చేశారు. సీఎస్ఆర్ నిధుల సహకారంతో ఆధునిక సౌకర్యాలతో ఈ భవనాన్ని నిర్మిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రజలకు పోలీస్ సేవలు మరింత చేరువ చేసేందుకు పై అంతస్తులో సర్కిల్ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.

March 25, 2026 / 12:36 PM IST

ఒంటిమిట్టలో హరిద్ర ఘటనం ప్రారంభం

కడప జిల్లా ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు బుధవారం హరిద్ర ఘటనం కార్యక్రమంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి శుభారంభంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మహిళా భక్తులు, టీటీడీ అధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

March 25, 2026 / 12:36 PM IST

తేనెటీగల దాడి.. కానిస్టేబుల్ మృతి

NDL: శ్రీశైలం డ్యాం వద్ద తేనెటీగల దాడి విషాదం సృష్టించింది. విధి నిర్వహణలో ఉన్న ఎస్పీఎఫ్ కానిస్టేబుల్ పిల్లి వీరస్వామి (52)పై తేనెటీగలు దాడి చేశాయి. లిఫ్ట్ వద్ద పెట్రోలింగ్ చేస్తుండగా ఘటన చోటుచేసుకుంది. భయంతో కిందపడిన ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే గుండెపోటుతో బుధవారం మృతి చెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

March 25, 2026 / 12:36 PM IST

రేపు మార్కెట్ బహిరంగ వేలం పాట

PPM: సీతంపేట గ్రామ పంచాయతీ వారపు సంత, రోజువారీ మార్కెట్ బహిరంగ వేలం పాటను ఈనెల 26న నిర్వహించనున్నట్లు పంచాయతీ కార్యదర్శి బీ. రామకృష్ణ తెలిపారు. ఈ నెల 25న జరగాల్సినప్పటికీ ఎస్టీ కమిషన్ ఛైర్మన్ పర్యటన నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. ఆశీలు వసూళ్లకు సంబంధించి ఆసక్తి ఉన్నవారు వేలంలో పాల్గొనవచ్చునని కోరారు.

March 25, 2026 / 12:35 PM IST