కోనసీమ: రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో అమలాపురం అన్ని వార్డుల్లోను విజయం సాధించి, కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంటుందని MLA అయితాబత్తుల ఆనందరావు ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల పదవీ బాధ్యతలు ముగిసిన కూటమి కౌన్సిలర్ల ఘన సన్మాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. MLA మాట్లాడుతూ.. అమలాపురాన్ని మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్‌గా మార్చేందుకు కృషి చేస్తానన్నారు.