• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

నేడు ఒంటిమిట్టలో పసుపు దంచే కార్యక్రమం

KDP: ఒంటిమిట్ట కోదండ రాముని బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ఆలయంలో పసుపు దంచే కార్యక్రమం చేపట్టనున్నారు. దీనితో కళ్యాణ ఘట్టానికి ఏర్పాట్లు ప్రారంభం కానున్నాయని టీటీడీ అధికారులు వెల్లడించారు. ఉద‌యం గర్భాలయం లోపల పసుపు కొమ్ములకు, రోళ్ళు, రోకళ్లను స్వామి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం ఆలయంలో పసుపును దంచుతారు.

March 25, 2026 / 08:10 AM IST

రెండు కేజీల వెండితో గంగమ్మకు పూర్ణ హారతి

CTR: కుప్పం శ్రీ ప్రసన్న తిరుపతి గంగమ్మకు 2.48 కేజీల కొత్త వెండితో పూర్ణ హారతి చేయించినట్లు ఆలయ ఛైర్మన్ BMK రవి చంద్రబాబు తెలిపారు. తమిళనాడులోని హోసూరు GRTలో రూ.5,44,800 విలువచేసే పూర్ణ హారతిని చేయించి అమ్మవారి జాతరకు తీసుకురావడం జరుగుతుందన్నారు. గంగమ్మ ఆలయ అభివృద్ధికి భక్తులు ఎంతగానో సహకరిస్తున్నారని వారి సహకారంతోనే పూర్ణ హారతి చేయించడం జరిగిందని ఆలయ అధికారులు తెలిపారు.

March 25, 2026 / 08:09 AM IST

22-A నుంచి 256 ఎకరాల భూమి తొలగింపు

E.G: రాజానగరం నియోజకవర్గంలో MLA బత్తుల బలరామకృష్ణ కృషితో 256 ఎకరాల భూమిని 22-A నిషేధిత జాబితా నుంచి తొలగించారు. ఈ మేరకు మంగళవారం ఆయన వివరాలు వెల్లడించారు. ఏళ్లుగా రిజిస్ట్రేషన్లు, రుణాలకు ఇబ్బందులు పడుతున్న రైతులకు ఇది పెద్ద ఊరటనిచ్చిందన్నారు. భూములపై పూర్తి హక్కులు లభించాయని, మిగిలిన సమస్యలను కూడా దశలవారీగా పరిష్కరిస్తామని MLA ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

March 25, 2026 / 08:03 AM IST

‘నమ్మించి ఆస్తి కాజేశారు చేశారు’

కోనసీమ: పెంచుకున్న చెల్లెలు కూతురు ఆదరిస్తానని నమ్మించి రూ. 35 లక్షల ఆస్తి కాజేసిందని గొందికి చెందిన ఒడుగు సుభద్రమ్మ (80) మంగళవారం వాపోయారు. కరోనాలో జ్వరంతో ఉన్న తనకు వైద్యం చేయిస్తానని మలికిపురం రిజిస్టర్ ఆఫీసులో ఎకరం పొలం, 14 సెంట్లు భూమి తన చెల్లెలు కూతురు రాజ్యలక్ష్మి, ఆమె కొడుకు గణేష్‌కు అమ్మేసినట్లు రిజిస్ట్రేషన్ చేయించుకుందన్నారు.

March 25, 2026 / 08:01 AM IST

తాడిగడపలో మిల్లెట్ చాక్లెట్లకు ప్రోత్సాహం..

కృష్ణా: తాడిగడప పురపాలక సంఘ పరిధిలోని పోరంకి సర్కిల్ మూడవ సచివాలయంలో డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్, మున్సిపల్ కమిషనర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. కలెక్టర్ ఆదేశాల మేరకు మిల్లెట్స్‌తో చాక్లెట్లు తయారు చేస్తున్న దంపతులకు ప్రోత్సాహంగా, స్థానిక స్వీట్, బేకరీ దుకాణాల్లో వాటిని విక్రయించాలని యజమానులను కోరారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ కమిషనర్, సిబ్బంది పాల్గొన్నారు.

March 25, 2026 / 08:00 AM IST

బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం

KKD: జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో దివ్యాంగుల బ్యాక్ లాగ్ పోస్టుల భర్తీకి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ షాన్మో హన్ తెలిపారు. గ్రూప్-4 కేటగిరీలో 11 పోస్టులు, గ్రూప్-4 పరిధిలోకి రాని వాటిలో 13 పోస్టులు ఖాళీలున్నాయన్నారు. ఏప్రిల్ 18లోగ అర్హులు https:///kakinada.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు.

March 25, 2026 / 07:44 AM IST

నేటి నుంచి శ్రీరామనవమి వేడుకలు

ATP: ఆత్మకూరు మండలం వడ్డుపల్లిలో బుధవారం నుంచి శ్రీరామనవమి వేడుకలు నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. 3 రోజుల పాటు నిర్విరామంగా ఆలయంలో భజనలు ఉంటాయని తెలిపారు. 27న విజయనగరం నుంచి భజన బృందం వస్తున్నట్లు తెలిపారు. రథంలో స్వామి వారి ఉత్సవ విగ్రహాలు గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 28న గోపూజ, జమ్మిపూజ కార్యక్రమంతో పాటు అన్నదానం ఉంటుందన్నారు.

March 25, 2026 / 07:44 AM IST

విద్యార్థిని చితకబాదిన ట్యూటర్

కర్నూలు జిల్లా కోయనగర్ కాలనీలో యూకేజీ విద్యార్థి ప్రవీణ్‌ను ట్యూటర్ రజిని విచక్షణారహితంగా చితకబాదారని తల్లిదండ్రులు ఎల్లప్ప, ఈరమ్మ తెలిపారు. మంగళవారం స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ప్రవీణ్‌ను ట్యూషన్‌కు పంపామన్నారు. ట్యూటర్ పుస్తకంలో పెన్సిల్‌తో రాశాడని, అది చెరిపే క్రమంలో చిరిగిపోయిందని, దాంతో ఆమె తీవ్రంగా కొట్టిందని తల్లిదండ్రులు వెల్లడించారు.

March 25, 2026 / 07:38 AM IST

సదరం సర్టిఫికెట్ స్లాట్ బుకింగ్ ప్రారంభం

KRNL: చిప్పగిరి మండలంలో వికలాంగులు సదరం సర్టిఫికెట్ పొందేందుకు అవసరమైన స్లాట్ బుకింగ్ ఇవాళ్టి నుంచి అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రారంభం కానుందని ఎంపీడీవో అల్లా బకాష్ తెలిపారు. అర్హులైన దివ్యాంగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని, అవసరమైన ధ్రువపత్రాలతో సచివాలయాలను సంప్రదించాలని ఆయన సూచించారు. ప్రజలకు సులభంగా సేవలు అందించడమే లక్ష్యం అని పేర్కొన్నారు.

March 25, 2026 / 07:36 AM IST

పీలేరు పంచాయతీలో నేడు వేలం

అన్నమయ్య: పీలేరు మేజర్ పంచాయతీలో నేడు వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో బ్రాహ్మానందరెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్‌ను వేలం వేయనున్నట్లు తెలిపారు. వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

March 25, 2026 / 07:31 AM IST

సీతానగరంలో నీటి నాణ్యతపై శిక్షణ కార్యక్రమం

E.G: సీతానగరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, MLHPలు, డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. తాగునీటి నాణ్యత పరీక్షలు, వేసవిలో నీటి ఎద్దడి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆర్‌డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్, ఉప ఎంపీడీవో (GSWS), పరిపాలన అధికారులు హాజరయ్యారు.

March 25, 2026 / 07:30 AM IST

‘అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి’

ELR: తనపై అసత్య ఆరోపణలు చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో అధికారులు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో తనపై అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం సృష్టించి ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.

March 25, 2026 / 07:30 AM IST

నేటి నుంచి శ్రీరామ నవమి ఉత్సవాలు

SKLM: సారవకోట మండలంలోని అలుదులో గల కోదండరామ స్వామి ఆలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం సీతారాముల కల్యాణం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

March 25, 2026 / 07:24 AM IST

‘చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి’

ELR: చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని సీఎం చంద్రబాబును MLA రోషన్ కుమార్ కోరారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ముఖ్యమైన మూడు బ్రిడ్జిలు (గుండేరు, పట్టేన్నపాలెం, బైనేరు) నిర్మాణం, చింతలపూడి బస్సు డిపో ఏర్పాటు, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, గురించి చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

March 25, 2026 / 07:23 AM IST

త్రీ టౌన్ సీఐ శేషయ్యకు ఎస్పీ అభినందనలు

KRNL: జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించడంలో విశేష ప్రతిభకనబరిచిన త్రీ టౌన్ సీఐ శేషయ్యను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం అభినందించారు. లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న సీఐ శేషయ్య, సమన్వయంతో పని చేసి ఎక్కువ కేసులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు.

March 25, 2026 / 07:20 AM IST