• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

సముద్రంలోకి తాబేలు పిల్లలను వదిలిన MLA

కృష్ణా: ఆలీవ్ రిడ్లే తాబేలు పిల్లలు సముద్రంలోకి ప్రవేశించాయి. కృష్ణాజిల్లా అవనిగడ్డ నియోజకవర్గం కోడూరు మండలం పాలకాయతిప్పలో బుధవారం ఉదయం అటవీ శాఖ అధికారులు ఏర్పాటు చేసిన సముద్రపు తాబేళ్ల పునరుత్పత్తి కేంద్రాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. అటవీ శాఖ ఏలూరు డివిజన్ అధికారులతో కలిసి ఆయన ఆలీవ్ రిడ్లే సముద్రపు తాబేలు పిల్లలను సముద్రంలో వదిలారు.

March 25, 2026 / 10:12 AM IST

‘ఈనెల 28 నుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు మూత’

కాకినాడ జిల్లాలో ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఈనెల 28 నుంచి మూసివేస్తున్నట్లు సంయుక్త కలెక్టర్ అపూర్వభరత్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. రైతుల వద్ద ఖరీఫ్ ధాన్యం ఉంటే వెంటనే సమీపంలో రైతు సేవా కేంద్రంలో సంప్రదించి, విక్రయించాలని సూచించారు.

March 25, 2026 / 10:11 AM IST

భీమిలిలో రిసార్ట్‌ సీజ్

VSP: భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ తిరుమల్ రావు హెచ్చరించారు. తరచూ పేకాట, వ్యభిచారం, పార్టీల పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఓ రిసార్ట్‌ను మంగళవారం సీజ్ చేశారు. ఇలాంటి ఘటనలు గమనిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించారు.

March 25, 2026 / 10:11 AM IST

రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ‘స్లాట్’ దందా..!

W.G: జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద బుధవారం ‘స్లాట్ బుకింగ్’ దందా యథేచ్ఛగా సాగుతోందని రిజిస్ట్రేషన్ దారులు ఆరోపిస్తున్నారు. ఉచితంగా జరగాల్సిన బుకింగ్‌లను ముందే నకిలీ పేర్లతో బ్లాక్ చేసి, అవసరమైన వారి నుంచి రూ.1500 నుంచి రూ.2000 వసూలు చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. ఈ అక్రమ దందాకు అడ్డుకట్ట వేయాలని అధికారులను కోరుతున్నారు.

March 25, 2026 / 10:10 AM IST

మున్సిపాలిటీలలో పెరగనున్న వార్డులు

CTR: మున్సిపాలిటీలో వార్డు సభ్యులను సంఖ్యను పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. వార్డుల సంఖ్యల మార్పు ఎన్నికల తర్వాతనే అమలులో వస్తుందని పేర్కొంది. చిత్తూరులో 50 నుంచి 52 కు, నగరిలో 29 నుంచి 40కి, కుప్పంలో 26 నుంచి 32కు, పలమనేరులో 26 నుంచి 36కు వార్డుల సంఖ్య పెరగనుంది.

March 25, 2026 / 10:03 AM IST

నకరికల్లు ప్రజలకు MRO కీలక సూచనలు

PLD: యుద్ధ పరిస్థితులు ముగిసే వరకు గ్యాస్‌ను పొదుపుగా వినియోగించాలని నకరికల్లు తహసీల్దార్ పుల్లారావు ప్రజలకు సూచించారు. గ్యాస్ కొరతపై ఆందోళన చెందవద్దని, బుకింగ్ ప్రాధాన్యతను బట్టే సిలిండర్ల పంపిణీ సజావుగా జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు ఎలాంటి అపోహలను నమ్మవద్దని కోరారు. గ్యాస్ సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలించి కృత్రిమ కొరత సృష్టించవద్దని ఆయన హెచ్చరించారు.

March 25, 2026 / 10:02 AM IST

‘సీసీ పుటేజ్ బయటపెట్టే ధైర్యం ఉందా’

నెల్లూరు ఒకటో పట్టణ పరిధిలో పోలీసులు లాడ్జిలలో తనిఖీలు నిర్వహించిన సీసీ పుటేజ్ బయటపెట్టే ధైర్యం ఉందా..? అని మాజీమంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రశ్నించారు. నెల్లూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ నాయకుడిని వదిలేయాలని ఒత్తిడి రావడంతో పోలీసులు వదిలేశారన్నారు. హాస్పటల్ అంటూ పోలీసులు చెబుతున్నది నిజమైతే సీసీ ఫుటేజ్ మొత్తం విడుదల చేయాలన్నారు.

March 25, 2026 / 10:02 AM IST

ఇళ్ల కూల్చివేతపై ఎమ్మెల్సీ ఫైర్

NLR: నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలోని పేదల ఇళ్లను అక్రమంగా తొలగించడంపై ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. నగర అభివృద్ధి పేరుతో అర్ధరాత్రి వేళల్లో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, సామాన్యుల ఇళ్లను కూల్చివేయడం అత్యంత దారుణమని ఆయన మండిపడ్డారు. అభివృద్ధి ముసుగులో పేదల పొట్ట కొట్టడం తగదని, బాధిత కుటుంబాలకు తక్షణమే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు

March 25, 2026 / 10:00 AM IST

రాజంపేట MP తల్లికి సుప్రీం కోర్టులో చుక్కెదురు

అన్నమయ్య: MP మిథున్ రెడ్డి తల్లికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తాము PLR ప్రాజెక్ట్ Pvt.Ltd సంస్థ తరఫున మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల పరిధిలో గ్రామీణ రహదారుల ప్రాజెక్ట్ కింద 6 ప్యాకేజీల పనులు చేశామని, రూ.64.18 కోట్ల బిల్లులు రావాలన్నారు. తన భర్త, కుమారుడు ప్రతి పక్షంలో ఉన్నారని, అందుకే ప్రభుత్వం బిల్లులను విడుదల చేయలేదని కోర్టు తీర్పునిచ్చింది.

March 25, 2026 / 09:58 AM IST

రెవెన్యూ అధికారులతో కలెక్టర్ సమీక్ష

కృష్ణా: మచిలీపట్నంలోని కలెక్టరేట్లో కలెక్టర్ బాలాజీ రెవెన్యూ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న 430 రెవెన్యూ క్లినిక్ అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు తగిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బాలాజీ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఏదైనా సమస్య తలెత్తితే తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు.

March 25, 2026 / 09:56 AM IST

రేపటి నుంచి శ్రీరామ నవమి మహోత్సవాలు

అన్నమయ్య: రామాపురంలోని సాయి నగర్‌లోని సమర్థ సద్గురు దర్గా స్వామిజీ, సమర్థ సద్గురు మాతాజీ ఆశ్రమంలో రేపటి నుంచి శ్రీరామ నవమి మహోత్సవాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఆశ్రమ మందిరంలో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. భక్తులందరూ పెద్ద సంఖ్యలో హాజరై వేడుకలను విజయవంతం చేయాలని కోరారు.

March 25, 2026 / 09:53 AM IST

‘ఇకపై ఆటంకాలు లేకుండా సేవా కార్యక్రమాలు’

ATP: CM చంద్రబాబు, మంత్రి లోకేష్ కృషి వల్లనే ఆర్డీటీ సంస్థకు ఎఫ్‌సీఆర్ఏ రెన్యూవల్ లభించిందని ఎమ్మెల్యే పరిటాల సునీత హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాం నుంచి ఎదురవుతున్న ఆటంకాలను అధిగమించేందుకు లోకేష్ కేంద్ర మంత్రులను కలిసి ప్రత్యేక చొరవ చూపారని కొనియాడారు. ఇకపై ఎటువంటి ఆటంకాలు లేకుండా సేవా కార్యక్రమాలు కొనసాగుతాయని ఆమె పేర్కొన్నారు.

March 25, 2026 / 09:46 AM IST

గోదావరిలో వ్యక్తి గల్లంతు

కోనసీమ: ముంజవరం వద్ద వైనతేయ గోదావరి నదిలో త్రిమూర్తులు(55) అనే వ్యక్తి గల్లంతైనట్టు వీఆర్వో కే. దొరబాబు మంగళవారం రాత్రి రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. అంబాజీపేట మండలం కొర్లపాటివారిపాలే నికి చెందిన వ్యక్తిగా స్థానికులు చెబుతున్నారని, స్థానిక రామాలయం వద్ద ఉన్న పుష్కర ఘాట్ చెంతన సైకిల్, చెప్పులు, చరవాణి విడిచి పెట్టి గోదావరిలో గల్లంతైనట్టు ఆయన తెలిపారు.

March 25, 2026 / 09:42 AM IST

ఉరేసుకుని మహిళ ఆత్మహత్య

NLR: బుచ్చి మండలం కట్టుబడి పాలెం గ్రామం అల్లూరు కాలువ వద్ద అదే గ్రామానికి చెందిన నాగభూషణమ్మ (60)అనే మహిళ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న ఎస్సై సంతోష్ రెడ్డి ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించి ఘటనపై ఆరా తీశారు. మహిళకు మతిస్థిమితం లేదని భర్త కృష్ణారెడ్డి పోలీసులకు తెలిపారు. ఎవరికి ఎటువంటి అనుమానాలు లేవని భర్త పేర్కొన్నారు.

March 25, 2026 / 09:38 AM IST

3 కాలేజీలకు అనుమతినిచ్చిన ఇంటర్మీడియట్ బోర్డ్

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మూడు ప్రైవేటు జూనియర్ కళాశాలల ఏర్పాటుకు ఇంటర్మీడియట్ బోర్డ్ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఈనెల 18న నోటిఫికేషన్ జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 12 కళాశాలలకు అనుమతి ఇస్తే అందులో ప్రకాశం జిల్లాలోని కురిచేడు, పెద్దారవీడు, పుల్లలచెరువు ఉన్నాయి. ఆసక్తి ఉన్నవారు ఏప్రిల్ ఆరవ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలి.

March 25, 2026 / 09:37 AM IST