• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

పీలేరు పంచాయతీలో నేడు వేలం

అన్నమయ్య: పీలేరు మేజర్ పంచాయతీలో నేడు వేలం నిర్వహిస్తున్నట్లు ఈవో బ్రాహ్మానందరెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం 10 గంటల నుంచి వేలం ప్రక్రియ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. వారపు సంత, దినసరి కూరగాయల మార్కెట్, షాపింగ్ కాంప్లెక్స్‌ను వేలం వేయనున్నట్లు తెలిపారు. వ్యాపారులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.

March 25, 2026 / 07:31 AM IST

సీతానగరంలో నీటి నాణ్యతపై శిక్షణ కార్యక్రమం

E.G: సీతానగరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్లు, MLHPలు, డిజిటల్ అసిస్టెంట్లకు శిక్షణ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. తాగునీటి నాణ్యత పరీక్షలు, వేసవిలో నీటి ఎద్దడి నివారణ చర్యలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ఆర్‌డబ్ల్యూఎస్ అసిస్టెంట్ ఇంజనీర్, ఉప ఎంపీడీవో (GSWS), పరిపాలన అధికారులు హాజరయ్యారు.

March 25, 2026 / 07:30 AM IST

‘అసత్య ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోండి’

ELR: తనపై అసత్య ఆరోపణలు చేస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో అధికారులు ఫిర్యాదు చేశారు. ఇటీవల కాలంలో తనపై అసత్య కథనాలను ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. తప్పుడు సమాచారం సృష్టించి ప్రజల్లో అపోహలు కలిగించే విధంగా వ్యవహరిస్తున్నారని, ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని అన్నారు.

March 25, 2026 / 07:30 AM IST

నేటి నుంచి శ్రీరామ నవమి ఉత్సవాలు

SKLM: సారవకోట మండలంలోని అలుదులో గల కోదండరామ స్వామి ఆలయంలో బుధవారం నుంచి శుక్రవారం వరకు శ్రీరామ నవమి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు ఓ ప్రకటనలో తెలిపారు. ఆలయంలో సామూహిక కుంకుమార్చనలు, అభిషేకాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. శుక్రవారం సీతారాముల కల్యాణం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు.

March 25, 2026 / 07:24 AM IST

‘చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలి’

ELR: చింతలపూడి నియోజకవర్గ అభివృద్ధికి సహకరించాలని సీఎం చంద్రబాబును MLA రోషన్ కుమార్ కోరారు. మంగళవారం సీఎం క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ముఖ్యమైన మూడు బ్రిడ్జిలు (గుండేరు, పట్టేన్నపాలెం, బైనేరు) నిర్మాణం, చింతలపూడి బస్సు డిపో ఏర్పాటు, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, గురించి చర్చించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

March 25, 2026 / 07:23 AM IST

త్రీ టౌన్ సీఐ శేషయ్యకు ఎస్పీ అభినందనలు

KRNL: జిల్లాలో నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించడంలో విశేష ప్రతిభకనబరిచిన త్రీ టౌన్ సీఐ శేషయ్యను జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ మంగళవారం అభినందించారు. లోక్ అదాలత్‌లో పెండింగ్ కేసులను వేగంగా పరిష్కరించేందుకు ప్రత్యేక చొరవ తీసుకున్న సీఐ శేషయ్య, సమన్వయంతో పని చేసి ఎక్కువ కేసులను పరిష్కరించడంలో కీలక పాత్ర పోషించారు.

March 25, 2026 / 07:20 AM IST

రేపల్లెలో వైభవంగా బూరగలమ్మ కుంభాభిషేకం

BPT: రేపల్లెలో బూరగలమ్మ పుష్కర కుంభాభిషేక మహోత్సవం భక్తిశ్రద్ధలతో, వేద మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా జరిగింది. ఈ వేడుకలో మంత్రి అనగాని సత్యప్రసాద్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు అనగాని శివప్రసాద్, కొలసాని రాముతో పాటు ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

March 25, 2026 / 07:19 AM IST

‘రూ.1000 కోట్ల దోపిడీకి పాల్పడ్డారు’

ATP: హంద్రీనీవా ద్వారా తెచ్చిన 52 టీఎంసీల నీటి వినియోగంపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. కమీషన్ల కోసం హంద్రీనీవా కాలువకు లైనింగ్ పనులు చేపట్టి రూ. 1000 కోట్ల దోపిడీకి పాల్పడ్డారని ఆరోపించారు.

March 25, 2026 / 07:17 AM IST

సైబర్ మోసాలపై పోలీసుల అవగాహన

తిరుపతి జిల్లా వ్యాప్తంగా పోలీసులు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించి, గ్రామ సభల ద్వారా సైబర్ మోసాలు, నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలు చేపట్టారు. “డిజిటల్ అరెస్ట్” వంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద కాల్స్‌కు స్పందించకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు.

March 25, 2026 / 07:13 AM IST

టీడీపీలో చేరిన సర్పంచ్, ఉపసర్పంచ్‌లు

W.G: పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామ సర్పంచ్, ఉపసర్పంచ్‌లు డిప్యూటీ స్పీకర్ కనుమూరు రఘురామకృష్ణరాజు సమక్షంలో టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు. కాళ్ల మండలం పెదఅమీరంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మంగళవారం సాయంత్రం వారితో పాటు పలువురికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

March 25, 2026 / 07:12 AM IST

ప్రజా దర్బార్‌లో పాల్గొన్న ఎమ్మెల్యే

కృష్ణా: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజా దర్బార్ సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు తెలిపారు. మంగళవారం టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజల నుంచి భూ వివాదాలు, పింఛన్లు, రేషన్, గృహాలు, రహదారులు, తాగునీరు వంటి అంశాలపై అర్జీలు స్వీకరించారు. ప్రతి ఫిర్యాదును పరిశీలించి అధికారులకు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.

March 25, 2026 / 07:12 AM IST

నగరి రెండు నియోజకవర్గాలు కానుందా.?

CTR: నియోజకవర్గాల పునర్విభజనకు కేంద్రం పచ్చ జెండా ఊపింది. ఈ క్రమంలో నగరి నియోజకవర్గాన్ని నగరి, పుత్తూరు నియోజకవర్గాలుగా విడగొడతారా అన్న చర్చ స్థానికంగా నడుస్తోంది. 2004 ఎన్నికల వరకు పుత్తూరు నియోజకవర్గంగా ఉండేది. 2009 ఎన్నికల్లో పుత్తూరు స్థానంలో నగరి నియోజకవర్గంగా మారింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మరో 7 నూతన అసెంబ్లీ స్థానాలు పెరుగుతున్నట్లు సమాచారం.

March 25, 2026 / 07:11 AM IST

సంత మార్కెట్ నిర్వహణకు వేలం

NDL: కోయిలకుంట్లలో సంత మార్కెట్ నిర్వహణకు బుధవారం వేలం పాటలు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వరప్రసాదరావు తెలిపారు. మార్కెట్ గేటు రుసుం వసూలుకు ఆసక్తి గల వారు పంచాయతీ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈవో ప్రకాష్ నాయుడు ఆధ్వర్యంలో పారదర్శకంగా ఈ వేలం నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

March 25, 2026 / 07:10 AM IST

అపరిశుభ్రత ప్రదేశాలను శుభ్రం చేసిన పోలీసులు

ప్రకాశం: సింగరాయకొండ సాయి నగర్ ప్రాంతంలో అపరిశుభ్రత ప్రదేశాలను గుర్తించి పోలీసులు శుభ్రపరిచారు. ఇలాంటి కార్యక్రమాలు నివారించేందుకు ప్రజలు ముందుకు రావాలని సింగరాయకొండ ఎస్సై మహేంద్ర కోరారు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించడం వలన ప్రజలకు అసౌకర్యం కలిగించడమే కాకుండా శాంతి భద్రతలకు ముప్పు కలిగిస్తుందని ఎస్సై తెలిపారు.

March 25, 2026 / 07:09 AM IST

సైబర్ నేరాలపై హెచ్చరికలు

అన్నమయ్య: జిల్లాలో మహిళల భద్రత లక్ష్యంగా పోలీసులు గ్రామాలు, కాలనీలు, పట్టణాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు, యువతులు, గ్రామస్థులతో ముఖాముఖి సమావేశాలు నిర్వహించి BNS చట్టాలు, హక్కులు, సైబర్ నేరాలపై అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో 112, 1091, 181, 1098, 1930 వంటి హెల్ప్‌లైన్ నంబర్లను వినియోగించాలని అధికారులు సూచించారు.

March 25, 2026 / 07:07 AM IST