• hittv facebook
  • hittv youtube
  • hittv twitter
  • hittv instagram
Sowrya consultancy
  • Home
  • »ఆంధ్రప్రదేశ్

దువ్వాడ రైల్వే స్టేషన్‌లో టెండర్లు..!

VSP: దువ్వాడ రైల్వే స్టేషన్‌లో దుకాణాలు ఏర్పాటు చేయడానికి తూర్పు కోస్తా రైల్వే టెండర్లు ఆహ్వానించినట్లు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ తెలిపారు. ఐస్‌క్రీమ్‌లు, శీతలపానీయాలు, అల్పాహారం, తినుబండారాలు, ఫాస్ట్‌ఫుడ్, పిజ్జా, బర్గర్, ఫ్రైడ్ చికెన్, న్యూడిల్స్ వంటి స్టాల్‌లు ఏర్పాటు చేయనున్నారు. మార్చి 30లోగా టెండర్లు దాఖలు చేయాలన్నారు.

March 23, 2026 / 06:38 AM IST

‘తరచుగా దత్తత గ్రామాలను సందర్శించాలి’

VZM: పోలీసు సిబ్బంది తరుచూ తమకు కేటాయించిన దత్తత గ్రామాలను సందర్శించాలని జిల్లా ఎస్పీ ఏఆర్.దామోదర్ సూచించారు. ఆదివారం ఆయన ఎస్.కోట, కొత్తవలస పోలీసు స్టేషన్‌లను ఆకస్మికంగా సందర్శించారు. ఆయన మాట్లాడుతూ.. దత్తత గ్రామాలలో శాంతిభద్రతల పరిస్ధితులను తెలుసుకుని, ఎప్పటికప్పుడు ఆ సమాచారాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి ఆదేశించారు.

March 23, 2026 / 06:36 AM IST

నేడు సైదాపురానికి ఎమ్మెల్యే రాక..!

NLR: సైదాపురంలో సోమవారం పాలూరులో జరిగే రైతన్నా మీకోసం కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొంటారని టీడీపీ మండల అధ్యక్షుడు సుబ్రహ్మణ్యరాజు తెలిపారు. కూటమి ప్రభుత్వం రైతులకు అందించే వివిధ పథకాలపై తెలియచెప్పేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. రైతులకు కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడు అండగా ఉంటుందన్నారు. 

March 23, 2026 / 06:35 AM IST

కుందూ నదిలో ఈతకు వెళ్లి వ్యక్తి మృతి

KDP: కుందూ నది వంతెన కింద ఈతకు వెళ్లిన గొడుగు సురేశ్ అనే వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాలు మేరకు.. మృతుడు ఆళ్లగడ్డ టౌన్ పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇతను పెద్దముడియంలో ఎద్దుల బండలాగుడు పోటీలను వీక్షించడానికి శనివారం వచ్చినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే నిన్న నీటిలో మునిగి కనిపించలేదని, తిరిగి ఆదివారం వెతకగా.. మృతదేహం కనపడిందని పేర్కొన్నారు.

March 23, 2026 / 06:34 AM IST

నేడు జేసీ గ్రీవెన్స్ సమావేశం

ASR: రంపచోడవరంలో నేడు గ్రీవెన్స్ జరుగుతుందని జేసీ స్మరణ్ రాజ్ ఆదివారం సాయంత్రం మీడియా ప్రకటనలో తెలిపారు. రంపచోడవరం ITDA కార్యాలయం సమీపంలో ఉన్న మీటింగ్ హల్‌లో ఉదయం 10.30లకు ప్రారంభం అవుతుందన్నారు. పోలవరం జిల్లా వాసులు గమనించాలన్నారు. సమస్యలు పరిష్కారం కానివారు తప్పనిసరిగా హాజరు కావాలని కోరారు.

March 23, 2026 / 06:32 AM IST

ఈ నెల 25న ఎంపీడీవో కార్యాలయంలో సర్వసభ్య సమావేశం

PPM: బలిజిపేట మండల పరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 25న ఉదయం 11 గంటలకు నిర్వహించనున్నట్లు ఎంపీడీవో వాణిశ్రీ తెలిపారు. ఎంపీపీ నాగమణి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుందని, సభ్యులంతా హాజరుకావాలని ఆమె కోరారు. సమావేశపు అజెండా నోటీసులను మండలస్థాయి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ముందస్తుగా తెలియజేసినట్లు వెల్లడించారు.

March 23, 2026 / 06:30 AM IST

అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్న కూటమి ప్రభుత్వం

AKP: అభివృద్ధే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పని చేస్తున్నట్లు సివిల్ సప్లై కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ బోడపాటి శివదత్ అన్నారు. ఆదివారం పాయకరావుపేటలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం హయాంలో రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తున్నాయన్నారు.

March 23, 2026 / 06:28 AM IST

యాగంటి ఆలయంలో ప్రత్యేక పూజలు..!

NDL: బనగానపల్లె మండలం యాగంటి ఉమామహేశ్వర స్వామి ఆలయంలో సోమవారం భక్తులు ప్రత్యేక పూజలను నిర్వహించారు. తెల్లవారుజామునుండే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారికి అభిషేకాలు, కుంకుమార్చన పూజలను చేశారు. అనంతరం ఆలయానికి వచ్చిన భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను అందజేశారు.

March 23, 2026 / 06:28 AM IST

కాళంగి నదిలో దూకి వ్యక్తి మృతి

TPT: సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయం ఎదురుగా ఉన్న కాళంగి నదిలో ఆదివారం సాయంత్రం ఓ వ్యక్తి బ్రిడ్జిపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించాగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది.

March 23, 2026 / 06:24 AM IST

ప్రశాంతి నిలయం కార్యక్రమ సమయాల్లో మార్పులు

సత్యసాయి: పుట్టపర్తిలోని ప్రశాంతి నిలయంలో సత్యసాయి సన్నిధిలో జరిగే కార్యక్రమాల వేళలను ట్రస్టు వర్గాలు మార్చాయి. సోమవారం నుంచి కొత్త సమయాలు అమలులోకి రానున్నాయి. ఉదయం 8 గంటలకు వేద పఠనం, 9 నుంచి 9:30 వరకు భజనలు నిర్వహిస్తారు. సాయంత్రం 5 గంటలకు వేద పఠనం, 5:45 నుంచి 6:30 వరకు భజనలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

March 23, 2026 / 06:24 AM IST

‘పరిశ్రమలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలి’

AKP: పాయకరావుపేట నియోజకవర్గంలో గల పరిశ్రమలలో స్థానిక యువతకు ఉద్యోగాలు కల్పించాలని పీసీసీ ప్రధాన కార్యదర్శి జగత శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. నక్కపల్లిలో ఏర్పాటు చేయబోయే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటును స్వాగతిస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం రాయితీలు కల్పిస్తున్న పరిశ్రమలు స్థానికులకు ఉపాధి కల్పించాలన్నారు.

March 23, 2026 / 06:22 AM IST

పేకాట శిబిరంపై దాడి.. 12 మంది అరెస్ట్

కాకినాడ టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సామర్లకోట రోడ్డులో పేకాట స్థావరంపై సీఐ మజ్జి అప్పలనాయుడు బృందం ఆదివారం రాత్రి మెరుపు దాడి చేసింది. ఈ దాడిలో 12 మంది జూదరులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.51 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెల్లడించారు.

March 23, 2026 / 06:20 AM IST

ఈనెల 25న ఉచిత నేత్ర వైద్య శిబిరం

CTR: బైరెడ్డిపల్లెలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ నెల 25న కోలారు జాలప్ప ఆస్పత్రి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర శిబిరం నిర్వహించనున్నట్లు స్థానిక వైద్యాధికారి విజయ్ చందర్ ఓ ప్రకటనలో తెలిపారు. నేత్ర వైద్య నిపుణుల సలహాతో లెన్స్ అమర్చడం, అవసరమైన వారికి నేత్ర శస్త్రచికిత్సలు చేస్తారు. మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

March 23, 2026 / 06:19 AM IST

నిడుముక్కలలో నేటి నుంచి ఉరుసు మహోత్సవాలు

GNTR: నిడుముక్కలలో ఉన్న హజరత్ సయ్యద్ బాజీ షాహీద్ సర్కార్ అవులియా బాబా 74వ ఉరుసు మహోత్సవాలను ఈ నెల 23 నుంచి ఘనంగా నిర్వహించనున్నట్లు ముజాఫర్ హజరత్ షేక్ షబ్బీర్ తాజ్ ఉల్ ఖాద్రీ చెప్పారు. ఈ నెల 23న గుసూల్, 24న చందనం, 25న అన్న సంతర్పణ ఏర్పాటు చేశామని, ఉరుసు సందర్భంగా మూడు రోజులు ప్రత్యేక ప్రార్థనలు, సాంస్కృతిక వేడుకలు నిర్వహిస్తున్నామన్నారు.

March 23, 2026 / 06:17 AM IST

ఘర్షణలో గాయపడిన టీడీపీ కార్యకర్తలు..!

KRNL: కౌతాళం మండలం కామవరం గ్రామంలో ఇటీవల జరిగిన ఘర్షణలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ కార్యకర్తలను ఆదివారం మండల అధ్యక్షులు చూడి సురేష్ నాయుడు పరామర్శించారు. కోసిగి రమేష్, అయ్యన్నల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. టీడీపీ ఇంఛార్జ్ ఎన్. రాఘవేంద్ర రెడ్డి కూడా ఫోన్‌లో బాధితులను పరామర్శించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కోరారు.

March 23, 2026 / 06:16 AM IST