వైఎస్ వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు.
కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తుండగా ఏపీ సీఎం జగన్ మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్నాడు. ఫ్యాక్టరీని విక్రయించొద్దు అనే ఒక్క మాట జగన్ కానీ, వైఎస్సార్ సీపీ కానీ అనలేదు.
వేసవి కాలం (summer season) తీవ్రరూపం దాలుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు (Temperatures) భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు తోడుకానున్నాయి. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ(Department of Meteorology)హెచ్చరించింది. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి.. వేడిగాలులు ఠారెత్తిస్తున్నాయి. దీంతో వాతావరణశాఖ ప్రజల్ని అప్రమత్తం చేసింది.
పేదలకు అందించే సంక్షేమ పథకాలపై సమీక్ష సమావేశాలు ఉన్నాయి. కోర్టుకు సీఎం హాజరైతే భద్రత కోసం వచ్చే వాహనాలతో ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వినూత్నంగా ప్రత్యేక కార్యక్రమానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) శ్రీకారం చుట్టింది. మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని శాసన సభ్యులు, ఇంచార్జ్‌లు, నాయకులు జోష్‌తో నిర్వహిస్తున్నారు. జగనన్నే మా భవిష్యత్తు'(Jagananne ma bhaviṣyattu) కార్యక్రమంలో భాగంగా 'మెగా పీపుల్స్ సర్వే'కు అపూర్వ స్పందన లభించటంతో ఆ పార్టీకి చెందిన నాయ...
ఎన్నికల కోసం ఏడాదిన్నర ముందు నుంచే జగన్ ప్రణాళికలు వేస్తున్నాడు. ఇదే క్రమంలో పాలనను పక్కన పెట్టేసి రాజకీయం చేస్తున్నారు.
Minister Roja : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అసలు పార్టీ ఎందుకు పెట్టాడో ఆయనకే తెలీదు అంటూ.... మంత్రి రోజా షాకింగ్ కామెంట్స్ చేశారు. జనసేన పార్టీ పెట్టి 9 ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఆయన ఆ పార్టీ ఎందుకు పెట్టారో ఆయనకే అర్ధం కావడం లేదని ఎద్దేవా చేసారు.
Tirumala:తిరుపతి ఏడుకొండల వాడికి బెంగళూరుకు చెందిన భక్తుడు భారీ విరాళం ఇచ్చేందుకు సిద్ధపడ్డాడు. మురళీకృష్ణ అనే భక్తుడు శ్రీవారి దేవస్థానానికి దాదాపు 250 ఎకరాల భూమిని విరాళంగా ఇవ్వనున్నాడు. సైదాపురం మండలం పోతేగుంటలో ఉన్న భూములను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.జవహర్‌రెడ్డి, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఆదివారం పరిశీలించారు. బెంగళూరు వాసి మురళీకృష్ణకు తిరు...
ఒకవేళ ఈ బిడ్ ను తెలంగాణ ప్రభుత్వం పొందితే మాత్రం ఏపీలో సీఎం కేసీఆర్ కు ఊహించని అభిమానం పెరుగుతుంది. ఏపీలోకి ప్రవేశించేందుకు ఇది ఒక సింహద్వారంగా మారనుంది.
80 కిలో మీటర్ల దూరం ప్రయాణించేందుకు మూడున్నర గంటల సమయం పట్టింది. ఏపీలో మరీ అధ్వాన పరిస్థితులు ఉన్నాయి. ఏపీ రోడ్లు నరకాన్ని తలపిస్తున్నాయి.
వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ అంటే ఏమిటో చూపిస్తామని కొడాలి నాని స్పష్టం చేశారు. బాలయ్యతోపాటు చంద్రబాబును కూడా ఇంటికి పంపుతాం అని తెలిపారు.
ఏపీలో కరోనా(Corona)తో ఒకరు మృతి చెందారు. కుక్కునూరు మండలం కొండపల్లికి చెందిన 62 ఏళ్ల వృద్ధుడు కరోనాతో మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. అనారోగ్యంతో ఉన్న వృద్ధుడిని చికిత్స కోసం మార్చి 30వ తేదిన భద్రాచలం ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ఖమ్మం ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. అయితే కరోనా సోకి ఆ వ్యక్తి 8న మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీకి చెందిన 175 చోట్ల అభ్యర్థులు బరిలో ఉంటారని ఏపీ బీఆర్ఎస్ చీఫ్ తోట చంద్రశేఖర్ స్పష్టంచేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించడంలో వైసీపీ, టీడీపీ విఫలం అయ్యాయని ఆరోపించారు.
ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu) సెల్ఫీ విత్ టిడ్కో ఇళ్ల అంశంపై వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ వరుదు(MLC Varudu Kalyani) కళ్యాణి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ధైర్యముంటే తాము నిర్మించిన 17 వేల కాలనీల వద్దకు రావాలని కోరారు. అక్కడకు వచ్చి లబ్దిదారులతో సెల్ఫీలు దిగాలని సవాల్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ(TDP) హాయంలోనే టిడ్కో ఇళ్లలో భారీగా అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు.
MLA Kethireddy: ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ మధ్య వివాదంతో మీడియాలో ఇటీవల హాట్ టాపిక్ గా మారారు. అంతకుముందు నుంచే ‘గుడ్ మార్నింగ్’ అంటూ కేతిరెడ్డి నిత్యం జనం మధ్య తిరుగుతుంటారు. దీనికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తుంటాయి. ధర్మవరం పట్టణం శివానగర్ లో ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ‘మా నమ్మకం నువ్వే జగన్’ కార్యక్రమాన్ని ప్రారంభించా...