YS Avinash reddy files inteim petition in telangana High court
YS Avinash reddy:వైఎస్ వివేకానంద హత్య కేసులో వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి (YS Avinash reddy) మరోసారి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు మధ్యంతర పిటిషన్ దాఖలు చేశారు. వివేకానంద రెడ్డి (viveka) హత్య కేసులో అవినాశ్ రెడ్డిని సీబీఐ ఇప్పటికే పలుమార్లు విచారించిన సంగతి తెలిసిందే. వివేకా (viveka) హత్య కేసు విచారణకు సంబంధించిన వివరాలు ఇచ్చేలా సీబీఐని ఆదేశించాలని పిటిషన్లో అవినాశ్ కోరారు.
వైఎస్ వివేకా (ys viveka) హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి (avinash reddy) తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డి (YS Bhaskar reddy) మరో పిటిషన్ హైకోర్టులో ఫైల్ వేశారు. వివేకాందరెడ్డి (viveka) హత్య కేసులో ఏ-4గా ఉన్న దస్తగిరిని అఫ్రూవర్‌గా ప్రకటించడాన్ని ఆయన సవాల్ చేశారు. దస్తగిరి అఫ్రూవర్‌గా మారడంతోనే భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిని సీబీఐ విచారిస్తోంది.
పులివెందులకు చెందిన పీబీసీ ఉద్యోగి సుధాకర్‌ను (sudhakar) సీబీఐ అధికారులు విచారించారు. ఎంపీ అవినాష్‌రెడ్డితో (avinash reddy) ఫోటో దిగిన విషయంపై ప్రశ్నించినట్లు తెలుస్తోంది. హత్య జరిగిన రోజు వివేకానందరెడ్డి ఇంటికి వచ్చిన వారిలో కొందరిని సీబీఐ విచారణకు పిలిచింది. వివేకా (viveka murder case) హత్య కేసులో సీఎం జగన్ ఓఎస్డీ కృష్ణ మోహన్ రెడ్డి (krishna mohan reddy), జగన్ భార్య భారతి (bharathi) పీఏ నవీన్ (naveen)ను విచారించారు. భాస్కర్ రెడ్డి, అవినాశ్ రెడ్డిను వరసగా విచారిస్తు వస్తున్నారు.