»All Party Has Decided Agitation At Indira Park On 17th Of April
One day past:17న ఇందిరాపార్క్ వద్ద దీక్ష: అఖిలపక్షం
సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ నెల 17వ తేదీన ఇందిరాపార్క్ వద్ద నిరహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.
All party has decided agitation at indira park on 17th of april
One day past:కేసీఆర్ ప్రభుత్వంపై విపక్షాలు కదం తొక్కాయి. వరసగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నాయి. ఈ రోజు సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ నెల 17వ తేదీన ఇందిరాపార్క్ (indira park) వద్ద నిరహార దీక్ష చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అఖిలపక్ష సమావేశానికి ప్రతిపక్ష, వామపక్ష, విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు.
రాజకీయాలు, సిద్ధాంతాలు పక్కన పెట్టి కలిసి పోరాటం చేస్తున్నామని వైఎస్ షర్మిల (YS Sharmila) అన్నారు. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కోసం పోరాటం తమ నైతిక బాధ్యత అని చెప్పారు. అందుకే T – SAVE ఫోరం ఏర్పాటు చేశామని వివరించారు. దీని ద్వారా ఉద్యోగాలు, విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్, హాస్టళ్లలో వసతులు తదితర అంశాల మీద పోరాటం చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త మండలాలు ఏర్పడి 3.85 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంటుందని చెప్పారు. బిస్వాల్ కమిటీ రాష్ట్రంలో 1.91లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పిందని గుర్తుచేశారు. మండలానికి స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగికి వెంటనే నిరుద్యోగ భృతి చెల్లించాలని కోరారు. 10 లక్షల మంది యువతకి కార్పొరేషన్ తరపున లోన్లు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
విద్యార్థుల కోసం రాజకీయాలు పక్కన పెట్టాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ (addanki dayakar) అభిప్రాయపడ్డారు. అందరం కలిసి నిరుద్యోగుల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని.. 2 కోట్ల మంది యువత ఉందన్నారు. ఉద్యోగాలు లేవు.. ఒక్కొ గ్రామంలో 6 బెల్ట్ షాపులు ఉన్నాయని చెప్పారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా లిక్కర్ వ్యాపారం జరుగుతుందన్నారు. YSR హయాంలో ఎన్నో ఉద్యోగాలు వచ్చాయని గుర్తుచేశారు. భూదాన్ కింద లక్ష ఎకరాలు కబ్జా చేశారని గుర్తుచేశారు. కాళేశ్వరం, మిషన్ కాకతీయ అన్ని ప్రాజెక్ట్‌ల్లో కుంభకోణాలు జరుగుతున్నాయని చెప్పారు. తమ్మినేని వీరభద్రంకు విద్యార్థుల రోదన కనిపించడం లేదా..? అని అడిగారు. T-SAVE ఉద్యమానికి మద్దతు తెలిపారు.
రాష్ట్రంలో ఐక్య కార్యాచరణ అవసరం ఉందని ప్రజా ఉద్యమ నాయకుడు గద్దర్ (gaddar) అన్నారు. YSRతో తనకు ఆనాడు చాలా అనుభవం ఉందని గుర్తుచేశారు. భావ సారూప్యత, ఐక్య సారూప్యత కూడ అవసరం ఉందన్నారు. కట్టింది కూలగొట్టు… మళ్ళీ కొట్టు.. కమీషన్ పట్టు అనేలా ఉంది పాలన ఉందన్నారు. ఆనాడు ప్రజల అవసరంగా ఉండేది YSR పాలన అన్నారు. తెలంగాణలో 2 కోట్ల యువత ఏకం కావాలని కోరారు. యువత ఏకం అయితే కేసీఅర్ పేక మేడ కూలిపోతుందన్నారు. అఖిలపక్ష సమావేశంలో ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు బలమూరి వెంకట్, సీపీఎం న్యూడెమెక్రసీ వేములపల్లి వెంకట్ రామయ్య, సీపీఐ నేత వలి, బీసీ యునైటెడ్ ఫ్రంట్ నేత రామకృష్ణయ్య, గిరిజన శక్తికి చెందిన శరత్ నాయక్ మాట్లాడారు. 17వ తేదీన నిరహార దీక్ష చేపట్టాలని నిర్ణయం తీసుకున్నారు.