»Jupally Krishna Rao Suspend Im Happy With Brs Suspension Says Jupally Krishna Rao
BRS Party పంజరం నుంచి బయట పడ్డా: Suspendపై జూపల్లి వ్యాఖ్యలు
పార్టీలోని అసంతృప్తి నాయకులు తలనొప్పిగా మారారు. అయితే వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. వింటే పార్టీలో కొనసాగింపు చేస్తున్నారు. లేదంటే నిర్మోహమాటంగా సస్పెండ్ లు చేస్తున్నారు.
తెలంగాణలో (Telangana) రాజకీయంగా సోమవారం ఒక్కసారిగా పరిణామాలు మారిపోయాయి. పార్టీ నుంచి అసంతృప్తి వ్యక్తం చేస్తూ సొంత కార్యక్రమాలు నిర్వహిస్తున్న మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుపై (Jupally Krishna Rao) బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. సీఎం కేసీఆర్ (K Chandrashekar Rao), రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేయడం సహించని గులాబీ పార్టీ వేటు (Suspend) వేసింది. అయితే పార్టీ నుంచి సస్పెండ్ చేయడంపై జూపల్లి కృష్ణారావు స్వాగతించారు.
‘బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేసినందుకు సంతోషంగా ఉంది. నాకు పంజరంలో నుంచి బయటపడినట్లు ఉంది’ ఉంది అని జూపల్లి పేర్కొన్నాడు. పార్టీ సస్పెండ్ చేయడంపై ఎమ్మెల్యే క్వార్టర్స్ (MLA Quarters) లో విలేకరుల సమావేశం నిర్వహించేందుకు జూపల్లి ప్రయత్నించారు. అయితే పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ప్రస్తుతం శాసనసభ్యుడు కాకపోవడంతో జూపల్లి సమావేశానికి అనుమతి నిరాకరించారు. దీంతో కొంత అక్కడ గందరగోళం ఏర్పడింది. పోలీసుల సూచనతో జూపల్లి వెనక్కి తగ్గారు. ఈ సందర్భంగా అక్కడ కనిపించిన మీడియాతో పై వ్యాఖ్యలు చేశాడు. తన నివాసంలో ప్రెస్ మీట్ (Press Meet) పెట్టే అవకాశం ఉంది.
కాగా తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికలకు రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. ఈ క్రమంలో పార్టీలోని అసంతృప్తి నాయకులు తలనొప్పిగా మారారు. అయితే వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయి. వింటే పార్టీలో కొనసాగింపు చేస్తున్నారు. లేదంటే నిర్మోహమాటంగా సస్పెండ్ లు చేస్తున్నారు. మొన్న వైఎస్సార్ సీపీ (YSRCP) తన నలుగురు ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయగా.. తాజాగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఇద్దరు కీలక నాయకులను సస్పెండ్ చేసింది.