Kodali nani makes hot comments on babu and balayya
Kodali nani:ఏపీలో రాజకీయాలు హీటెక్కాయి. వచ్చే ఎన్నికల్లో సీట్లపైనే అధికార వైసీపీ, విపక్ష టీడీపీ నేతలు మాటల యుద్దానికి దిగారు. ఇటీవల సీఎం జగన్ (cm jagan) లక్ష్యంగా సినీ నటుడు బాలకృష్ణ (balakrishna) హాట్ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. తన బావ, చంద్రబాబు (chandrbabu) అన్నట్టు వై నాట్ పులివెందుల (y not pulivendula) అని కామెంట్ చేశారు. దీనిపై మాజీమంత్రి కొడాలి నాని (kodali nani) స్పందించారు.
వచ్చే ఎన్నికల్లో సీఎం జగన్ (cm jagan) అంటే ఏమిటో చూపిస్తామని కొడాలి నాని (kodali nani) స్పష్టం చేశారు. బాలయ్యతోపాటు (balakrishna) చంద్రబాబును (chandrababu) కూడా ఇంటికి పంపుతాం అని తెలిపారు. ప్రజల్లో నమ్మకం కోల్పోయి.. కార్యకర్తల మద్దతు లేనివారికి జగన్ (jagan) టికెట్లు ఇవ్వరని తేల్చిచెప్పారు. తాము టికెట్లు ఇవ్వని నేతలు చంద్రబాబుతో (chandrababu) టచ్లో ఉంటే తమ పార్టీకేం కాదు అని తేల్చిచెప్పారు.
తమకు ప్రజలు టచ్లో ఉండటం ముఖ్యం అని కొడాలి నాని (kodali nani) స్పష్టంచేశారు. ప్రజాదరణ లేని ఎమ్మెల్యేలు కాదని అన్నారు. లోకేశ్ (lokesh) యువగళం పాదయాత్రతో ఒరిగేదేమీ లేదని చెప్పారు. రాష్ట్రంలో టీడీపీ పని అయిపోయిందని పేర్కొన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ జరగడంతో టీడీపీ ఒక సీటు, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 3 సీట్లను గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత తమతో 50 మంది ఎమ్మెల్యేలు (50 mla) టచ్లో ఉన్నారని టీడీపీ నేతలు కామెంట్ చేశారు. వారంతా ఫేడ్ అవుట్ అని.. గెలవరని తెలిసాకే.. టికెట్ ఇవ్వనని సీఎం జగన్ చెప్పారని కొడాలి నాని (kodali nani) అంటున్నారు.