శ్రీశైలం ఆలయంపై చక్కర్లు కొట్టిన డ్రోన్ కెమెరాలు. భక్తులు ఆందోళన చెందారు. అధికారుల నిఘా వైఫల్యం బయటపడింది.
ప్రైవేట్ కాలేజీలో బీటెక్ సెకెండియర్ చదువుతున్న ఓ విద్యార్థినికి కాలేజీ గదిలోనే అబార్షన్ అయ్యింది. అబార్షన్ తర్వాత ఆ విద్యార్థిని మృతి చెందింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
‘చెబితే సమాధానం చెప్పాలి లేకుంటే వెళ్లిపోవాలి. అంతే కానీ దాడులకు పాల్పడడమేమిటి?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేను ధైర్యంగా ప్రశ్నించిన విద్యార్థి శివాజీని నెటిజన్లు అభినందిస్తున్నారు.
సంస్థకు అవసరమైన మూలధన సమీకరణ, అత్యాధునిక సాంకేతిక పరిజ్ణానం, అత్యుత్తమ యాజమాన్య విధానాలను అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం చాలా సార్లు చెప్పింది. ఇప్పుడు అదే చేస్తోంది.
యూజీసీ గుర్తింపు ఉన్న శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సేవలు ఉత్తర భారతదేశంలోనూ విస్తరించాలని నిర్ణయించినట్లు టీటీడీ (TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 28వ తేదీ వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం(graduation ceremony) నిర్వహించాలని నిర్ణయించామన్నారు
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాలపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (MP Raghuramakrishna Raju) స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
నీతి, నిజాయితీగా బతికే కుటుంబం మాది. ఏనాడూ ఎవరినీ అవమానించని కుటుంబం మాది. మా తాత విశ్వ విఖ్యాత నటసార్వ భౌమ నందమూరి తారకరామారావు నుంచి నా తండ్రి చంద్రబాబు వరకు ఈ లోకేశ్ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడలేదు. అందుకే ఈ రోజు ఆ పేపర్ డైరెక్టర్ గా ఉన్న భారతీ రెడ్డికి సవాల్ విసిరారు
ఏపీ(Ap)లో ఎండలు దంచికొడుతున్నాయి. మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాలంటేనే చాలా మంది భయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మండలాల్లో ఎండలు తీవ్రంగా ఉన్నట్లు ఏపీ వాతావరణ శాఖ(Weather Department) తెలిపింది. తాజాగా భారత వాతావరణ కేంద్రం ఏపీ ప్రజలకు అలర్ట్(Alert) జారీ చేసింది.
తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు తిరుపతి(Tirupati)లోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లను జారీ చేస్తున్నట్లు టీటీడీ(TTD) వెల్లడించింది.
గత ఎన్నికలకు ముందు జగన్ పై ఎయిర్ పోర్టులో ఓ యువకుడు కోడి కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ సంఘటన ఆ సమయంలో తీవ్ర వుమారం రేపింది. ఇప్పటికీ ఈ కేసును ఎన్ఐఏ దర్యాప్తు చేస్తోంది. ఈ ఘటనలో ఎలాంటి కుట్రలేదని ఇటీవల ఎన్ఐఏ పేర్కొంది.
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(cm jagan mohan reddy) కోడికత్తి కేసులో నాటకాలు ఆడుతున్నారని టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(somireddy chandramohan reddy) ఆరోపించారు. ఈ క్రమంలో ఏపీ పోలీస్ వ్యవస్థపై నమ్మకం లేదన్న జగన్..ప్రస్తుతం జాతీయ దర్యాప్తు సంస్థల తీరుపై వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి.. సొంత జిల్లాలో ఒక్క కంపెనీ అయినా నిర్మించారా అని అడిగారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతున్న వేళ.. కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే కీలక వ్యాఖ్యలు చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ప్రస్తుతానికి ముందుకు వెళ్లడం లేదని అన్నారు
ఈరోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏపీలోని గుడివాడ(gudivada)లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయడు(chandrababu naidu) పర్యటించారు. ఈ క్రమంలో ఏపీలో వైసీపీ ప్రభుత్వం హాయంలో ఎస్సీలపై గతంలో కంటే దాడులు పెరిగాయని విమర్శించారు. అనేక రకాలు మాఫీయాలు చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.
వైఎస్ విజయమ్మ, వైఎస్ షర్మిల ప్రాణాలకు ముప్పు ఉందని మాజీ మంత్రి, వైసీపీ నేత డీఎల్ రవీంద్రా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇద్దరూ జాగ్రత్తగా ఉండాలని ఆయన సూచించారు.