TTD : నార్త్ ఇండియాలోనూ వేద విశ్వవిద్యాలయం సేవలు : టీటీడీ
యూజీసీ గుర్తింపు ఉన్న శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సేవలు ఉత్తర భారతదేశంలోనూ విస్తరించాలని నిర్ణయించినట్లు టీటీడీ (TTD) చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ఏప్రిల్ 28వ తేదీ వేద విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం(graduation ceremony) నిర్వహించాలని నిర్ణయించామన్నారు
భారతదేశంలో యూజీసీ (UGC) గుర్తింపు ఉన్న ఏకైక శ్రీ వేంకటేశ్వర వేద యూనివర్సిటీ (Vedic University) నార్త్ ఇండియాలో విస్తరించాలని టీటీడీ(TTD) నిర్ణయించింది. తిరుపతి శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి(YV Subbareddy) అధ్యక్షతన ఎగ్జిక్యూటివ్ కమిటీ మీటింగ్(Executive Committee Meeting) నిర్వహించారు. ఇప్పటికే ఉన్న వేద పాఠశాల(Vedic school)లో విద్యార్థుల సంఖ్య పెంచడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించామన్నారు. రుషికేష్(Rushikesh) లో వేద విశ్వవిద్యాలయం సేవలు ప్రారంభించాలని నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. వేద వర్సిటీల్లో పురాణ ప్రవచనం, యోగ (Yoga), ధ్యానం అంశాల్లో ప్రత్యేకంగా సర్టిఫికెట్ కోర్సులు ప్రారంభించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
కరోనా కారణంగా వర్సిటీలో నిలిపివేసిన ఆదర్శ వేద గురుకుల విద్యను తిరిగి ప్రారంభించనున్నామన్నారు. టీటీడీ (TTD) ఉద్యోగుల తరహాలో వేదిక్ వర్సిటీ రెగ్యులర్ ఉద్యోగులకు హెల్త్ స్కీమ్ అమలు చేస్తామన్నారు. ఈ విద్యా సంవత్సరంలో 40 మంది విద్యార్థులకు పీహెచ్డీ (PHD) ప్రవేశాలు కల్పించడానికి అనుమతించినట్లు తెలిపారు. ప్రతి పౌర్ణమి రోజు (Paurṇami roju) తెలుగు రాష్ట్రలోని 59 ముఖ్య ఆలయాల్లో సత్యనారాయణస్వామి వ్రతం(Satyanarayana Swamy Vrat) చేయాలని నిర్ణయించామన్నారు.ఈ సమావేశంలో ఈవో ధర్మారెడ్డి, జేఈవో సదాభార్గవి, బోర్డు సభ్యులు రాములు, మల్లేశ్వరి, వర్సిటీ ఉపకులపతి రాణి సదాశివమూర్తి, సీవీఎస్వో నరసింహకిషోర్, ధార్మిక ప్రాజెక్టుల ప్రోగ్రామింగ్ ఆఫీసర్ రాజగోపాల్, డీఈవో భాస్కర్‌రెడ్డి, డీపీపీ కార్యదర్శి శ్రీనివాసులు, ఈసీ సభ్యులు పాల్గొన్నారు.