»Andhra Pradesh Leaders Angry Over Sharmilas Comments
Andhra Pradesh: షర్మిల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన నాయకులు
ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈక్రమంలో ఆమె వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడంతో మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, మంత్రి ఉషాశ్రీ చరణ్ షర్మిల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
Andhra Pradesh: ఏపీ కాంగ్రెస్ చీఫ్‌గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈక్రమంలో ఆమె వైఎస్ జగన్‌పై ఆరోపణలు చేయడంతో కొందరు నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్, మంత్రి ఉషాశ్రీ చరణ్ షర్మిల వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్‌ను 16 నెలల పాటు జైల్లో పెట్టినా కాంగ్రెస్ గురించేనా మాట్లాడేది అంటూ ప్రశ్నించారు. ఏపీ ప్రయోజనాలు కాపాడుకోవడానికి, రాజధాని అభివృద్ధి కోసం, పోర్టులకు నిధుల తెచ్చుకోవడానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నామని వెల్లడించారు.
షర్మిల పేర్కొన్న విధంగా రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టడం లేదని వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదాను కాంగ్రెస్ ఎందుకు విభజన చట్టంలో పెట్టలేదని మంత్రి ఉషశ్రీ ప్రశ్నించారు. రాష్ట్రం విడిపోవడానికి కాంగ్రెస్, సోనియానే కారణమని ఆరోపించారు. ఏపీలో వైఎస్ జగన్‌ను, వైసీపీ పార్టీని ఇబ్బందులపాలు చేసేందుకే షర్మిల తప్పుడు ఆరోపణలు చేస్తుందనని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డికి చిరకాల ప్రత్యర్థి, శత్రువైన చంద్రబాబుకు మేలు చేకూరే విధంగా షర్మిల వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు.