Ayodhya Ram Mandir: కోట్లాది మంది భక్తుల కల నెరవేరింది. అయోధ్యలో బాలరాముడు కొలువుదీరాడు. 84 సెకన్ల దివ్వ ముహుర్తంలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రధానిమంత్రి నరేంద్రమోదీ శ్రీరాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అభిజిత్ లగ్నంలో ఈ వేడుకను నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ ప్రాణప్రతిష్ఠ జరిగింది. ప్రధాని మోదీ స్వామివారికి పట్టువస్త్రాలు, వెండి ఛత్రం సమర్పించి.. రామ్‌లల్లా విగ్రహం వద్ద పూజలు చేశారు. మద్యాహ్నం 12:29 నిమిషాలకు అభిజిత్ లగ్నంలో బాలరాముడి ప్రాణప్రతిష్ఠ మహోత్సవం జరిగింది. ప్రాణ ప్రతిష్ఠ సమయంలో అయోధ్య రామమందిరంపై హెలికాప్టర్లతో పూలవర్షం కురిపించారు. 25 రాష్ట్రాలకు చెందిన వాయిద్యకారులు 2 గంటలపాటు ఏకధాటిగా మంగళ వాయిద్యాలు మోగించారు. వివిధ రాష్ట్రాలకు చెందిన 14 జంటలు కర్తలుగా వ్యవహరించారు.