Atal Setu: దేశంలో అతిపొడవైన సముద్ర వంతెన అయిన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్‌పై కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. నూతనంగా నిర్మించిన అటల్ సేతుపై జరిగిన తొలి ప్రమాదం ఇదే. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలు, ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. నిన్న మధ్యాహ్నం ముంబాయి నుంచి చిర్లేకు వెళ్తున్న కారు అటల్ సేతుపై నుంచి వెళ్తుంది. ముందు వెళ్తున్న మరో వాహనాన్ని దాటేందుకు ప్రయత్నించగా అదుపు తప్పి రెయిలింగ్‌ను ఢీకొని పల్టీలు కొట్టింది. ప్రమాద తీవ్రత తక్కువగా ఉండటం వల్ల ప్రయాణికులు గాయాలతో బయటపడ్డారు. లేదంటే వాహనం సముద్రంలో పడేదని అక్కడి వాళ్లు తెలిపారు.
See the visuals Recorded in Camera.. Accident Occurred on Atal Sethu Fly over… Speed Limit To be maintained by Roads and Transportation Department.. The car Which was Going With Over speed in a Deadliest way… Luckily They were out of Danger.. #AtalSetu#Mumbaipic.twitter.com/NsHxYzSDCy
ఈ ఘటన వంతెనపై వెళ్తున్న మరో కారు డ్యాష్‌కామ్‌లో రికార్డు కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ముంబాయిలోని సేవ్రీ నుంచి రాయ్‌గఢ్ జిల్లాలోని నవశేవాను కలుపుతూ నిర్మించిన ఈ వంతెనను జనవరి 12న ప్రధాని మోదీ ప్రారంభించారు. ఈ వంతెనపై గరిష్ఠ వేగం 100 కి.మీ.లు కాగా.. కనిష్ఠ వేగం 40 కి.మీలుగా నిర్దేశించారు. ద్విచక్ర వాహనాలకు, ఆటోలకు అనుమతి లేదు. ఈ వంతెన మొత్తం పొడవు 21.8 కి.మీ కాగా.. అందులో 16 కి.మీలకు పైగా అరేబియా సముద్రంపైనే ఉండటం విశేషం.
ఇది కూడా చూడండి: Weight Loss: అవిసె గింజలు, చియా.. రెండింటిలో ఏది బరువు తగ్గిస్తుంది..?