ప్రపంచంలో ప్రస్థిది చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఒకటి. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు.తెలంగాణ రాష్ట్రం (Telangana State)హైదరాబాద్‌కు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఏవీకే ప్రసాద్, ఆంజనేయ ప్రసాద్ కోటిరూపాయలు శ్రీవారికి విరాళంగా ఇచ్చారు.
ప్రపంచంలో ప్రస్థిది చెందిన పుణ్యక్షేత్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) ఒకటి. ఇక్కడ కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు దేశ విదేశాల నుంచి నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలానే తమ సామర్థ్యం మేరకు భక్తులు స్వామి వారికి విరాళం సమర్పిస్తుంటారు. తాజాగా ఓ భక్తుడు శ్రీవారికి భారీ విరాళం అందించారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వస్తుంటారు. అలానే స్వామి వారి దర్శనంకు వచ్చిన భక్తులు విరాళాలు సమర్పిస్తుంటారు. తాజాగా తిరుమల శ్రీవారికి ఇద్దరు భక్తులు భారీ విరాళాన్ని అందించారు.
తెలంగాణ రాష్ట్రం (Telangana State)హైదరాబాద్‌కు చెందిన ఎస్ఆర్సీ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన ఏవీకే ప్రసాద్, ఆంజనేయ ప్రసాద్ కోటిరూపాయలు శ్రీవారికి విరాళంగా ఇచ్చారు. విరాళంకి సంబంధించిన డీడీని టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) కి అందజేశారు. శ్రీవారికి సమర్పించిన ఈ విరాళం శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు అందజేశారు. అలానే అనంతపురంకు చెందిన శ్రీధర్ దంపతులు టీటీడీ వేద పరిరక్షణ ట్రస్ట్ కు రూ. 10 లక్షలు విరాళం అందజేశారు తిరుమల(Tirumala)లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోగా భక్తులు (Devotees)ఎన్జీఆర్హెచ్ షెడ్ల వరకు క్యూలైన్లలో నిలబడి ఉన్నారు. టోకెన్లు లేని భక్తులకు 36 గంటల్లో సర్వదర్శనం కలుగుతుందని టీటీడీ అధికారులు(TTD Officials) వెల్లడించారు. నిన్న స్వామివారిని 66,310 మంది భక్తులు దర్శించుకోగా 31,980 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం(Income) రూ . 3.16 కోట్లు వచ్చిందని తెలిపారు.
చదవండి :SRH : హ్యారీ బ్రూక్‌కు రసగుల్లాలతో ట్రీట్.. ఇదిగో వీడియో!