యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశంలోని 20 యూనివర్సిటీలను నకిలీవని తేల్చింది. ఈ ఫేక్ యూనివర్సిటీలు ఇచ్చే డిగ్రీలు చెల్లవని స్పష్టం చేస్తూ ప్రకటన చేసింది. ఆ యూనివర్సిటీలో చదివిన వారి డిగ్రీలు ఉన్నత విద్యాభ్యాసానికి గానీ, ఉద్యోగాలు పొందేందుకు గానీ ఉపయోగపడవని యూజీసీ వెల్లడించింది. యూజీసీ కార్యదర్శి మనీశ్ జోషి ఓ ప్రకటన మాట్లాడుతూ.. దేశంలోని 20 ఫేక్ వర్సిటీల్లో అత్యధిక శాతం ఢిల్లీలో ఉండగా, ఆ తర్వాత స్థానంలో యూపీ ఉందని వెల్లడించారు. ఏపీకి చెందిన రెండు విశ్వవిద్యాలయాలు కూడా నకిలీవేనని యూజీసీ స్పష్టం చేసింది.
యూజీసీ ప్రకటించిన ఫేక్ యూనివర్సిటీల జాబితా:
1. క్రైస్ట్ న్యూ టెస్టమెంట్ డీమ్డ్ యూనివర్సిటీ- ఆంధ్రప్రదేశ్ 2. బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా- ఆంధ్రప్రదేశ్ 3. ఆలిండియా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫిజికల్ హెల్త్ సైన్సెస్ (ఏఐఐపీహెచ్ఎస్) స్టేట్ గవర్నమెంట్ యూనివర్సిటీ- ఢిల్లీ 4. కమర్షియల్ యూనివర్సిటీ లిమిటెడ్- దరియాగంజ్ (ఢిల్లీ) 5. యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ- ఢిల్లీ 6. వొకేషనల్ యూనివర్సిటీ- ఢిల్లీ 7. ఏడీఆర్-సెంట్రిక్ జురిడిషియల్ యూనివర్సిటీ- ఢిల్లీ 8. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్- న్యూ ఢిల్లీ 9. విశ్వకర్మ ఓపెనర్ యూనివర్సిటీ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిమెంట్- ఢిల్లీ 10. ఆధ్యాత్మిక్ విశ్వవిద్యాలయ (స్పిరిచ్యువల్ యూనివర్సిటీ)- ఢిల్లీ 11. బడాగన్వీ సర్కార్ వరల్డ్ ఓపెన్ యూనివర్సిటీ ఎడ్యుకేషన్ సొసైటీ- గోకక్ (బెల్గాం), కర్ణాటక 12. సెయింట్ జాన్స్ యూనివర్సిటీ- కిషనాట్టం (కేరళ) 13. రాజా అరబిక్ యూనివర్సిటీ- నాగపూర్ (మహారాష్ట్ర) 14. శ్రీ బోధి అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్-పుదుచ్చేరి 15. గాంధీ హిందీ విద్యాపీఠ్- ప్రయాగ్ (అలహాబాద్), ఉత్తరప్రదేశ్ 16. నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ ఎలక్ట్రో కాంప్లెక్స్ హోమియోపతి- కాన్పూర్ (ఉత్తరప్రదేశ్) 17. నేతాజీ సుభాష్ చంద్రబోస్ యూనివర్సిటీ (ఓపెన్ యూనివర్సిటీ)- అచల్తల్ (అలీగఢ్), ఉత్తరప్రదేశ్ 18. భారతీయ శిక్షా పరిషత్- ఉత్తరప్రదేశ్ 19. ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ అల్టర్నేటివ్ మెడిసిన్- కోల్ కతా 20. ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అండ్ రీసెర్చ్- కోల్ కతా