»Dissolution Of Ap Assembly In September Mp Raghuramarajs Prediction
Pre-election : సెప్టెంబరులో ఏపీ అసెంబ్లీ రద్దు : ఎంపీ రఘురామరాజు జోస్యం
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) రాష్ట్ర రాజకీయాలపై వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు (MP Raghuramakrishna Raju) స్పందించారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల తథ్యమని ఆయన జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
సీఎం జగన్ (CM Jagan) ఆగస్టు, సెప్టెంబర్ (September) నెలల్లో అసెంబ్లీ రద్దు చేసి ముందుస్తు ఎన్నికలకు వెళ్లే ఆలోచనలో ఉన్నరని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు (MP Raghuramakrishna Raju) జోస్యం చెప్పారు. అదే జరిగితే, తెలంగాణతోపాటే ఏపీకి కూడా ఒకేసారి ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. ప్రతిపక్షాలు ఏకం కాకముందే ఎన్నికలకు వెళ్లాలని సీఎం తలపోస్తున్నారని ఆయన వెల్లడించారు. గత ఎన్నికల్లో కోడి కత్తి (Kodi katti) ,వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులు వైసీపీ (YCP)విజయానికి కారణమయ్యాయని, ఇప్పుడీ రెండూ నాటకాలేనని తేలితే పరిస్థితి ఏంటనేది అర్థం కావడం లేదని రఘురామరాజు విమర్శించారు. కోడి కత్తి దాడి తర్వాత జగన్ ఎలాంటి ప్రాథమిక చికిత్స చేయించుకోకుండానే హైదరాబాద్ (Hyderabad) వెళ్లి సిటీ న్యూరో సెంటర్లో చికిత్స చేయించుకున్నట్టు నటించారని ఆయన ఆరోపించారు. అక్కడ గాయం అయినట్టు కట్టుకట్టారని అన్నారు. నిజానికి గాయమైతే ఎవరైనా ట్రామా సెంటర్కు వెళ్తారని, జగన్ మాత్రం న్యూరో సెంటర్(Neuro Center)కు వెళ్లారని ఎద్దేవా చేశారు. ఇటీవల గన్నవరం సీఐకి దెబ్బ తగలకపోయినా తగిలినట్టు కట్టు కట్టినట్టుగానే అప్పుడు జగన్కు కట్టు కట్టారని అన్నారు. జగన్ సీఎం అయిన తర్వాత ఆయనకు కట్టు కట్టిన డాక్టర్ సాంబశివారెడ్డికి ఆరోగ్యశ్రీ వైస్ చైర్మన్(Arogyasree Vice Chairman), మెడికల్ కౌన్సిల్ చైర్మన్ పదవి ఇచ్చారని రఘురామ రాజు గుర్తు చేశారు.