»Yv Subbareddy Said Some People Are Looking For The Collapse Of This Ap Government
YV Subbareddy: ఈ ప్రభుత్వం కూలిపోవాలని కొంత మంది చూస్తున్నారు
టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) పలు పార్టీ నేతలతోపాటు పలు పత్రికలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీరు చేస్తే దైవం, అదే మేము చేస్తే లాబీయింగ్ అవుతుందా అంటూ తోక పార్టీలను ప్రశ్నించారు.
ఏపీలో వైసీపీ ప్రభుత్వం కూలిపోవాలని కొంత మంది చూస్తున్నారు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి(YV Subbareddy) వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో ప్రభుత్వం, టీటీడీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని పత్రికలు అదే పనిగా తప్పుడు ప్రచారం చేస్తున్నాయని అన్నారు. దీంతోపాటు విజయ్ కుమార్ గురించి కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. అసలు విజయ్ కుమార్ ఎవరి ఫ్లైట్ లో విజయవాడ వచ్చారని ప్రశ్నించారు. రామోజీ బంధువుల ప్లైట్ లోనే వచ్చినట్లు చెప్పారు.
రామోజీకీ బంధువు అయిన కారణంగా స్పెషల్ ఫ్లైట్ లో వారి కార్యక్రమం కోసమే వచ్చారని వెల్లడించారు. విజయ్ కుమార్ స్వామిని తెచ్చుకుంది కూడా వారేనని తెలిపారు. మీరు చేస్తే దైవం, మేం చేస్తే లాబీయింగ్ కిందకు వస్తుందా ఉంటూ తోక పత్రికలను నిలదీశారు. మరోవైపు స్వామిజీ ఆధ్వర్యంలో రామోజీ బంధువుల ఇంట్లో గృహ ప్రవేశాలు సైతం జరిగినట్లు గుర్తు చేశారు. అయితే తనకు మాత్రం విజయ్ కుమార్ స్వామి 2007 నుంచి తెలుసని వెల్లడించారు. అవినాష్ రెడ్డి కేసులో స్వామిజీని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు సీబీఐ విచారణ పక్షపాతంగా జరుగుతుందని అన్నారు. ఈ నేపథ్యంలో చివరిగా న్యాయమే గెలుస్తుందని వైవీ సుబ్బారెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.