»Anakapalle District Elamanchili Ysrcp Mla Uv Ramana Murthy Raju Attacked On Who Questioned Student
‘పళ్లు పీకేస్తా’నంటూ వైసీపీ ఎమ్మెల్యే దౌర్జన్యం.. ఎవడివి పీకేస్తావ్ అంటూ విద్యార్థి నిలదీత
‘చెబితే సమాధానం చెప్పాలి లేకుంటే వెళ్లిపోవాలి. అంతే కానీ దాడులకు పాల్పడడమేమిటి?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేను ధైర్యంగా ప్రశ్నించిన విద్యార్థి శివాజీని నెటిజన్లు అభినందిస్తున్నారు.
ప్రశ్నిస్తే దాడులు చేయడం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో సర్వసాధారణంగా మారింది. సీఎం జగన్ (YS Jagan) చేసిన తప్పులు, అతడి అవినీతి పరిపాలనపై ప్రజలు నిలదీస్తుంటే మంత్రులు, వైఎస్సార్ సీపీ (YSRCP) ఎమ్మెల్యేలు, నాయకులు దాడులకు పాల్పడుతున్నారు. నొక్కుడు తప్పా అభివృద్ధి ఎక్కడ అని ప్రజలు ప్రశ్నిస్తుంటే తట్టుకోలేకపోతున్నారు. ప్రశ్నించిన వారిపై కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు. లేదంటే యలమంచిలి ఎమ్మెల్యే మాదిరి దాడులకు దిగుతున్నారు. తమకు ఏమీ రాలేదని ప్రశ్నించిన విద్యార్థిపై ఎమ్మెల్యే సహనం కోల్పోయి దాడికి పాల్పడిన సంఘటన అనకాపల్లి జిల్లాలో (Anakapalle District) చోటుచేసుకుంది.
‘గడప గడపకు’ అనే కార్యక్రమాన్ని సీఎం జగన్ ఎమ్మెల్యేల నెత్తి మీద బలవంతంగా రుద్దాడు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని ఎమ్మెల్యేలు వాపోయినా లేదు కచ్చితంగా చేయాల్సిందేనని సీఎం జగన్ చెప్పాడు. దీంతో విధిలేక ఎమ్మెల్యేలు రోడ్లపైకి వస్తున్నారు. అలా మునగపాక మండలం నాగులపల్లి గ్రామంలో యలమంచిలి (Elamanchili) వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే యూవీ రమణమూర్తి రాజు (కన్నబాబు) (UV Ramana Murthy Raju- Kannababu) పర్యటించాడు. ఈ సమయంలో విద్యార్థి మళ్ల శంకర్ ఇంటికి వెళ్లాడు. ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా? అని ఎమ్మెల్యే ప్రశ్నించాడు. శంకర్ కుమారుడు శివాజీ తమకు పథకాలు అందలేదని చెప్పాడు.
ఎమ్మెల్యే: విద్యా దీవెన పథకం వచ్చింది విద్యార్థి: నాకు రాలేదు. ఎమ్మెల్యే: నీకు ఇవ్వరు. స్కూల్ కు ఇస్తారు. విద్యార్థి: మరి స్కూల్ ఇచ్చామంటే మరి నాకు ఇచ్చారని చెబుతారు ఏమిటి? ఎమ్మెల్యే: ఏయ్ ఉండోయ్. విద్యార్థి: స్కూల్ కు ఇచ్చారు కదా.. అయితే స్కూల్ లో ఓ సమస్య ఉంది. దాన్ని పరిష్కరిస్తారా? ఎమ్మెల్యే: వెళ్లు వెళ్లు. విద్యార్థి: వెళ్లండి హనా? పోన్లేండి. ఎన్నికలకు వస్తారు కదా? అప్పుడు చెబుదాం మేం వెళ్లండి అని. ఎమ్మెల్యే: పళ్లు పీకేస్తా పట్టుకెళ్లి. విద్యార్థి: అందరివి పీకేయండి. ఎవరివి పీకేస్తారు?
అని విద్యార్థి చెప్పగానే ఎమ్మెల్యే రమణమూర్తి రాజు విద్యార్థిపై దూసుకెళ్లాడు. వైసీపీ కార్యకర్తలు, అనుచరులు ఆ విద్యార్థిపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడికి పాల్పడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ప్రశ్నిస్తే వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు తట్టుకోలేక దాడులకు పాల్పడుతున్నారని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘చెబితే సమాధానం చెప్పాలి లేకుంటే వెళ్లిపోవాలి. అంతే కానీ దాడులకు పాల్పడడమేమిటి?’ అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేను ధైర్యంగా ప్రశ్నించిన విద్యార్థి శివాజీని నెటిజన్లు అభినందిస్తున్నారు. కాగా ఎమ్మెల్యేను ప్రశ్నించిన విద్యార్థి కుటుంబంపై వైసీపీ కక్షపూరిత చర్యలకు పాల్పడే అవకాశం ఉంటుంది. ఆ కుటుంబానికి ప్రతిపక్షాలు అండగా నిలిచేందుకు సిద్ధమయ్యాయి.
మీసాలు ఇప్పుడే మొలుస్తున్న కుర్రోడు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పటం చేతకాక భౌతిక దాడి చేస్తున్నారంటే ఎంత దిగజారిపోయారో అర్థమవుతుంది. కుర్రోడు గట్స్‌కి మెచ్చుకోవాలి మొహమాటం భయం లేకుండా దులిపేసాడు👏👏 మీరు కేసులు పెడితే భయపడే రోజులు పోయాయి 💪🏼 https://t.co/1Q7q1e5Gsj