»Narayana Swamy Selfi Challege To Chandrababu Naidu
Chandrababuకు నారాయణ స్వామి సెల్ఫీ ఛాలెంజ్
ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి విపక్ష నేత చంద్రబాబు నాయుడుకు సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు. 14 ఏళ్లు సీఎంగా పనిచేసి.. సొంత జిల్లాలో ఒక్క కంపెనీ అయినా నిర్మించారా అని అడిగారు.
Narayana swamy selfi challege to chandrababu naidu
Narayana swamy:ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం నారాయణ స్వామి (Narayana swamy) విపక్ష నేత చంద్రబాబు నాయుడుకు (chandrababu naidu) సెల్ఫీ ఛాలెంజ్ (selfi) విసిరారు. గంగాధర నెల్లూరు మండలంలో నిర్మిస్తోన్న స్మార్ట్ డీవీ స్టాఫ్ వేర్ కంపెనీ నిర్మాణం వద్ద ఆయన సెల్ఫీ (selfi) దిగారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన సొంత జిల్లాలో ఒక్క కంపెనీ అయినా నిర్మించారా అని అడిగారు. గ్రామీణ ప్రాంతాల్లో 5 వేల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని నారాయణ స్వామి (Narayana swamy) తెలిపారు.
సెల్పీ ఛాలెంజ్‌ను చంద్రబాబు నాయుడు (chandrababu) స్టార్ట్ చేశారు. నెల్లూరు (nellore) పర్యటనలో ఉన్నప్పుడు టిడ్కో (tidco) వద్ద నిలబడి సెల్ఫీ (selfi) దిగారు. ఆ ఇళ్లు తమ ప్రభుత్వ హయాంలో కట్టినవి అని చెప్పారు. జగన్ (jagan) ముఖ్యమంత్రి అయ్యాక ఎంతమందికి ఇళ్లు కట్టించారో చెప్పగలరా అని అడిగారు. అప్పుడు సీఎం జగన్‌కు (jagan) సెల్ఫీ ఛాలెంజ్ విసిరారు.
చంద్రబాబు (chandrababu) సెల్ఫీ ఛాలెంజ్‌కు సీఎం జగన్ (jagan) స్పందించారు. ప్రకాశం జిల్లా మార్కాపురం ఈబీసీ నేస్తం నిధుల విడుదల సభలో కౌంటర్ ఇచ్చారు. ఎవరి హయాంలో ప్రజలకు మంచి జరిగిందనే విషయంలో ఛాలెంజ్ స్వీకరించే సత్తా చంద్రబాబు నాయుడుకు (chandrababu)ఉందా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని తీసుకున్నా.. ఏ గ్రామానికి వెళ్లినా, ఏ జిల్లాలో చూసినా.. గత ప్రభుత్వ హయాంలో ఇంటింటికీ జరిగిన మంచి ఎంత.. తమ ప్రభుత్వ హయాంలో జరిగిన మంచి ఎంత అని బేరిజు వేసుకునే సత్తా చంద్రబాబుకు (chandrababu) ఉందా అని అడిగారు.
చంద్రబాబు (chandrababu) హయాంలో ఒక్కరికీ కూడా ఇంటి స్థలం ఎందుకు ఇవ్వలేకపోయారని జగన్ మండిపడ్డారు. తమ ప్రభుత్వం మాత్రం 30 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చిందని పేర్కొన్నారు.