»Lokeshs Challenge To Ys Bharti Reddy Show That Video
Yuvagalam : వైఎస్ భారతీ రెడ్డికి లోకేశ్ సవాల్… ఆ వీడియో బయటపెట్టండి
నీతి, నిజాయితీగా బతికే కుటుంబం మాది. ఏనాడూ ఎవరినీ అవమానించని కుటుంబం మాది. మా తాత విశ్వ విఖ్యాత నటసార్వ భౌమ నందమూరి తారకరామారావు నుంచి నా తండ్రి చంద్రబాబు వరకు ఈ లోకేశ్ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా మాట్లాడలేదు. అందుకే ఈ రోజు ఆ పేపర్ డైరెక్టర్ గా ఉన్న భారతీ రెడ్డికి సవాల్ విసిరారు
యువగళం (Yuvagalam) పాదయాత్రలో టీడీపీ నేత నారా లోకేశ్ (Nara Lokesh) సీఎం జగన్, వైసీపీ ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు గుప్పించారు. సీఎం జగన్ టార్గెట్ గా మాటల తూటాలు పేలుస్తున్నారు. తాజాగా సీఎం జగన్ (CM Jagan) సతీమణి భారతీ రెడ్డి టార్గెట్ గా లోకేశ్ ఫైర్ అయ్యారు. యువగళం పాదయాత్రలో భారతీ రెడ్డి (Bharti Reddy)పేరుని లోకేశ్ ప్రస్తావించారు . దమ్ము ధైర్యం ఉంటే ఆ వీడియోని మీరు బయటపెట్టండి అంటూ భారతీ రెడ్డికి లోకేశ్ సవాల్ విసిరారు. సీఎం జగన్ భార్య భారతీ రెడ్డి నడిపించే పత్రికలోని ఆర్టికల్ అది. నేను దళితుల(Dalits)ను అవమానించాను అని అందులో రాశారు. నేను దళితులపై అసభ్యంగా మాట్లాడినట్లు రాశారు. పది సంవత్సరాల నుంచి మీరు ఎన్ని అబద్దాలు రాస్తున్నారు ఈ లోకేశ్ మీద. పదేళ్ల నుంచి నన్ను కించపరిచే విధంగా మీరు రాస్తున్నారు.ఈ సభా ముఖంగా భారతీ రెడ్డికి నేనొక చాలెంజ్ విసురుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ వీడియో మీరు బయటపెట్టండి. లేదంటే తేదీ మారే లోపల దళితులకు క్షమాపణ (apology) చెప్పండి అని ఈ సభా ముఖంగా భారతీ రెడ్డికి నేను సవాల్ విసురుతున్నాని ఆయన తెలిపారు.నిజంగానే బాధ కలుగుతుంది. దళితులను చంపేది మీరు. సంక్షేమ కార్యక్రమాలు కట్ చేసేది మీరు. మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్లిన ఎమ్మెల్సీ అనంత్ బాబు (MLC Anant Babu) ని ఇప్పటివరకు పదవి నుంచి తొలగించని మీరు అని లోకేశ్ ఆరోపించారు. నా గురించి మాట్లాడతారా? దమ్ము ధైర్యముంటే ఛాలెంజ్ (challenge) ని స్వీకరించండి. లేదంటే క్షమాపణ చెప్పండి” అని సభా ముఖంగా సవాల్ విసిరారు నారా లోకేశ్.