»Alert To Devotees Coming To Tirumala Keep This In Mind
Tirumala : తిరుమలకు వచ్చే భక్తులకు అలర్ట్..ఇది గమనించండి
తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు తిరుపతి(Tirupati)లోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లను జారీ చేస్తున్నట్లు టీటీడీ(TTD) వెల్లడించింది.
తిరుమల(Tirumala) శ్రీవారి(Srivaaru)ని దర్శించుకోవాలని చాలా మందికి ఉంటుంది. రోజుకు లక్షలాది మంది తిరుమల దేవస్థానాన్ని దర్శించుకుంటూ ఉంటారు. శ్రీవారికి తమ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు. కరోనా తర్వాత ఈ మధ్యనే నడక దారిలో వెళ్లే భక్తులకు టోకెట్లు జారీ చేయడాన్ని టీటీడీ(TTD) ప్రారంభించింది. ఈ నేపథ్యంలో తిరుమలకు భారీ సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు. తాజాగా భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం(Tirumala Tirupati Devasthanam) ఓ సూచన చేసింది.
తిరుమల(Tirumala) శ్రీవారి దర్శనం కోసం అలిపిరి నడక మార్గంలో నడిచి వెళ్లే భక్తులకు తిరుపతి(Tirupati)లోని భూదేవి కాంప్లెక్స్ వద్ద దివ్య దర్శనం టోకెన్లను జారీ చేస్తున్నట్లు టీటీడీ(TTD) వెల్లడించింది. టోకెన్లు తీసుకున్న భక్తులు అలిపిరి మార్గంలో గాలిగోపురం 2083వ మెట్టు వద్ద ఆ టోకెన్లను తప్పనిసరిగా స్కాన్ చేయించుకోవాలని టీటీడీ తెలిపింది. అలా స్కాన్ చేయించుకోని పక్షంలో స్లాటెడ్ దర్శనానికి అనుమతించమని టీటీడీ(TTD) అధికారులు స్పష్టం చేశారు.
భూదేవి కాంప్లెక్సులో దివ్య దర్శనం టోకెన్లు(Divya darsan tokens) తీసుకున్న భక్తులు కచ్చితంగా అలిపిరి నడకమార్గంలోనే తిరుమలకు వెళ్లాలని, వేరే మార్గంలో వెళ్తే టైమ్ స్లాట్ దర్శనం పొందలేరని వెల్లడించారు. శ్రీవారి మెట్టు మార్గంలో వెళ్లే భక్తులకు దివ్యదర్శనం టోకెన్లు 1240వ మెట్టు వద్ద ఇవ్వనున్నట్లు టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.
తిరుమల(Tirumala)కు వాహనాల్లో వెళ్లాలనుకునేవారికి తిరుపతి(Tirumala) ఆర్టీసీ బస్టాండు ఎదురుగా ఉండే శ్రీనివాసం, రైల్వే స్టేషన్ ఎదురుగా ఉండే విష్ణునివాసం, గోవిందరాజ స్వామి సత్రాల్లో సర్వదర్శనం టైమ్ స్లాట్ టోకెన్లు ఇస్తున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) అధికారులు తెలిపారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి తిరుమల శ్రీవారిని దర్శించుకోవాలని అధికారులు కోరారు.