»Hanumath Jayanti Celebrations In Tirumala From May 14
Tirumala : మే14 నుంచి తిరుమలలో హనుమత్ జయంతి ఉత్సవాలు
తిరుమల(Tirumala)లో హనుమత్ జయంతి(Hanuman Jayanth) ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మే 14వ తేది నుంచి 18వ తేది వరకూ ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ(TTD) ఈవో ఏవీ.ధర్మారెడ్డి తెలిపారు.
తిరుమల(Tirumala)లో హనుమత్ జయంతి(Hanuman Jayanth) ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు. మే 14వ తేది నుంచి 18వ తేది వరకూ ఈ ఉత్సవాలను నిర్వహించనున్నట్లు టీటీడీ(TTD) ఈవో ఏవీ.ధర్మారెడ్డి తెలిపారు. హనుమత్ జయంతి ఉత్సవాలకు సంబంధించి నేడు అన్ని విభాగాల అధికారులతో సమావేశం అయ్యారు. పలు విషయాలపై చర్చించారు. తిరుమలలోని ఆకాశగంగ(Akaashaganga) వద్ద ఐదు రోజుల పాటు హనుమత్ జయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఐదు రోజుల పాటు హనుమంతు(Hanuman)ని జన్మవిశేషాలు, ఆధ్యాత్మికపరంగానే కాకుండా వైజ్ఞానిక కోణంలో కూడా పండితులతో ప్రసంగాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తిరుమల(Tirumala) వేద విజ్ఞాన పీఠంలో అఖండ పారాయణం చేయనున్నట్లు తెలిపారు. అలాగే యాగం చేయడానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు.
మే 16వ తేది ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకూ 18 గంటల పాటు నిరంతరాయంగా అఖండ పారాయణం(Akhanda parayanam) చేయనున్నట్లు తెలిపారు. సుందరకాండలోని మొత్తం 2872 శ్లోకాలను వేదపండితులు పఠిస్తారని తెలిపారు. తిరుమల(Tirumala)లోని అంజనాద్రి ఆకాశగంగ, నాద నీరాజనం వేదికలపై కళాకారులతో ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు టీటీడీ(TTD) ఏవీ.ధర్మారెడ్డి వెల్లడించారు.