Sticker War : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో స్టిక్కర్ వార్..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వినూత్నంగా ప్రత్యేక కార్యక్రమానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) శ్రీకారం చుట్టింది. మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని శాసన సభ్యులు, ఇంచార్జ్లు, నాయకులు జోష్తో నిర్వహిస్తున్నారు. జగనన్నే మా భవిష్యత్తు'(Jagananne ma bhaviṣyattu) కార్యక్రమంలో భాగంగా 'మెగా పీపుల్స్ సర్వే'కు అపూర్వ స్పందన లభించటంతో ఆ పార్టీకి చెందిన నాయకుల్లో ఉత్సాహం కనపడుతోంది
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వినూత్నంగా ప్రత్యేక కార్యక్రమానికి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party) శ్రీకారం చుట్టింది. మా నమ్మకం నువ్వే జగన్ పేరుతో చేపట్టిన కార్యక్రమాన్ని శాసన సభ్యులు, ఇంచార్జ్లు, నాయకులు జోష్తో నిర్వహిస్తున్నారు. జగనన్నే మా భవిష్యత్తు'(Jagananne ma bhaviṣyattu) కార్యక్రమంలో భాగంగా ‘మెగా పీపుల్స్ సర్వే’కు అపూర్వ స్పందన లభించటంతో ఆ పార్టీకి చెందిన నాయకుల్లో ఉత్సాహం కనపడుతోంది. ఈ కార్యక్రమంపై ప్రతిపక్షాలు తమదైన విమర్శతో జనాన్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అసలు నిన్ను ఎందుకు నమ్మాలంటూ ప్రతిపక్షాలు సీఎం జగన్ (CM JAGAN) ని ప్రశ్నిస్తున్నాయి. కానీ వీటిని జగన్ పట్టించుకోవడం లేదు. అయితే గతంలో టీడీపీ (TDP) ఎన్నికల సమయంలో స్టిక్కర్లను అతికించడాన్ని వైసీపీ (YCP) తెరపైకి తెచ్చింది. తామిప్పుడు స్టిక్కర్లు అతికిస్తుంటే విమర్శిస్తున్న టీడీపీ, నాడు చేసిందేంటంటూ వైసీపీ నిలదీస్తోంది. మీరు చేస్తే ఒప్పు…మేము చేస్తే తప్పా? అంటూ వైసీపీ ఎదురు దాడికి దిగింది.
అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల ముంగిట డ్వాక్రా మహిళల(Dwakra is for women) కు పసుపు-కుంకుమ (Pasupu-kunkuma) కింద రూ.10 వేలు చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. ఆ విషయాన్ని గుర్తు చేస్తూ సోషల్ మీడియా(Social media) లో వైసీపీ గట్టిగా కౌంటర్ ఇస్తోంది. అధికార పార్టీకి చెందిన నాయకులు స్టిక్కర్ల పంపిణికి ప్రతిపక్షాలు కూడా కౌంటర్ కార్యక్రమాన్ని తలపెట్టాయి. మా ఖర్మ నువ్వే జగన్…మా కొద్దు జగన్ అంటూ పోటీ స్టిక్కర్లను కూడా పంపిణి చేస్తున్నాయి. జగన్ కు సంబంధించిన స్టిక్కర్ ఎక్కడ ఉన్నా.. దానికి పక్కనే ప్రతిపక్ష పార్టీకి చెందిన స్టిక్కర్ను వేసేస్తున్నారు. దీంతో ఈ వ్యవహరం రాజకీయంగా చర్చనీయాశంగా మారింది. ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపుతూ కౌంటర్ స్టిక్కర్లు వేస్తున్నారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి విఫలమైన అంశాలు, గంజాయి వంటి మత్తు పదార్దాల రవాణా, శాంతి భద్రతల (Peace and security)వైఫల్యాలు, జీవో నెంబర్ వన్ ను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.