Temperatures : ఏపీలో వడగాల్పులు ..వాతావరణ శాఖ అలెర్ట్
వేసవి కాలం (summer season) తీవ్రరూపం దాలుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు (Temperatures) భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు తోడుకానున్నాయి. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ(Department of Meteorology)హెచ్చరించింది. ఏపీలో ఎండలు మండిపోతున్నాయి.. వేడిగాలులు ఠారెత్తిస్తున్నాయి. దీంతో వాతావరణశాఖ ప్రజల్ని అప్రమత్తం చేసింది.
వేసవి కాలం (summer season) తీవ్రరూపం దాలుస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు (Temperatures) భారీగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు తోడుకానున్నాయి. ఏపీ రాష్ట్రవ్యాప్తంగా వేసవి ఎండలకు వడగాల్పులు వీస్తాయని వాతావరణ శాఖ(Department of Meteorology)హెచ్చరించింది. ఎండలు మండిపోతున్నాయి.. వేడిగాలులు ఠారెత్తిస్తున్నాయి. దీంతో వాతావరణశాఖ ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఉదంయ 9 గంటలు దాటితే చాలు బయట కాలు పెట్టలేని పరిస్థితి కనిపిస్తోంది. సోమవారం 27, మంగళవారం 32 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitaramaraju District) లో 7, మన్యంలో 6, కాకినాడలో 6, అనకాపల్లి 5, తూర్పుగోదావరి 2, ఏలూరు జిల్లాలో ఒక మండలంలో వడగాలులు వీస్తాయని తెలిపింది.
ఎండ, వడగాలుల నేపథ్యంలో ప్రజలు (people) అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ అంబేద్కర్ (Director Ambedkar) సూచించారు. ప్రజలు బయటకు వెళ్ళేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతవరణ శాఖ తెలిపింది. ముఖ్యంగా ఉత్తరాంధ్ర (Uttarandhra) జిల్లాల్లో వడగాలుల తీవ్రత పెరుగుతుందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ ప్రజల్ని అప్రమత్తం చేసింది. ఎండ, వడగాలుల హెచ్చరికలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటున్నారు.ఇక ఆదివారం 8 మండలాల్లో వాటి ప్రభావం కనిపించింది. ఆదివారం రాష్ట్రంలోనే గరిష్ఠంగా విజయనగరం జిల్లా(Vizianagaram District) రాజాం, ఏలూరు జిల్లా పూళ్ల, ప్రకాశం జిల్లా తర్లుపాడుల్లో 41.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తూర్పుగోదావరి జిల్లా కొమరిపాలెం, అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి, ఏలూరు జిల్లా దెందులూరు(Dendulur) లో ఉష్ణోగ్రతలు 41.4 డిగ్రీలు నమోదైంది.