»Masooda Fame Thiruveer Hero Ravikumar Panasa Producer First Film Is Started
Ravikumar Panasa: మసూద హీరో..రవికుమార్ పనస నిర్మాతగా తొలి చిత్రం షూరూ
ఏషియన్ ఫిలిమ్స్(asian films) నారాయణ దాస్ నారంగ్ సమర్పణలో ఒక సరికొత్త పిరియాడిక్ ఫిల్మ్ రూపొందుతోంది. ఇంకా టైటిల్ ఖరారు కానీ ఈ ప్రొడక్షన్ నెంబర్:1 చిత్రాన్ని ప్రముఖ వ్యాపారవేత్త రవి కుమార్ పనస(Ravikumar Panasa) నిర్మిస్తున్నారు. మసూద ఫేమ్ తిరువీర్(thiruveer) ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. నూతన దర్శకుడు జి.జి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ఇటీవల ప్రారంభమయ్యాయి.
టాలీవుడ్, రాజకీయ వర్గాలకు సన్నిహిత సంబంధాలు ఉన్న ప్రముఖ వ్యాపారవేత్త రవి కుమార్ పనస(Ravikumar Panasa) తన తొలి నిర్మాణాన్ని తన బ్యానర్ రవి పనస ఫిల్మ్ కార్పొరేషన్లో ప్రారంభించబోతున్నారు. ఈ చిత్రం టైటిల్ ఇంకా వెల్లడి కానప్పటికీ, దీనిని తాత్కాలికంగా “ప్రొడక్షన్ #1” అని పిలుస్తున్నారు. పీరియాడికల్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రాన్ని నారాయణ దాస్ నారంగ్ పేరుతో ఏషియన్ ఫిల్మ్స్ సమర్పిస్తోంది. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభమయ్యాయి. ఇంకా టైటిల్ నిర్ణయించని ఈ చిత్రాన్ని ప్రస్తుతానికి “ప్రొడక్షన్ నెంబర్ 1″(Production number 1)గా పరిగణిస్తున్నారు.
సూపర్ హిట్ చిత్రం “మసూదా”లో తన ఆకట్టుకునే నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న తిరువీర్(thiruveer) ఈ పీరియాడికల్ డ్రామాలో కథానాయకుడిగా యాక్ట్ చేశారు. పీరియాడికల్ డ్రామా జానర్‌కి సరికొత్త దృక్పథాన్ని తెస్తున్న ప్రతిభావంతులైన, వినూత్నమైన నూతన దర్శకుడు జీజీ(GG) ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో నిర్మాణ బృందం ఇప్పటికే కథాంశాన్ని సిద్ధంగా ఉంచింది. అయితే ఈ చిత్రం ఒక ప్రత్యేకమైన గ్రిప్పింగ్ సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుందని మేకర్స్(makers) భావిస్తున్నారు.
రవి కుమార్ పనస(Ravikumar Panasa) ఈ చిత్రానికి జీవం పోయడంలో ఏషియన్ ఫిల్మ్స్(asian films)తో అనుబంధం ఉన్నందుకు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. దీంతోపాటు ఆకట్టుకునే నటీనటులు, ప్రతిభావంతులైన దర్శకుడు, అత్యున్నత నిర్మాణ విలువలతో ఈ సినిమా తెరకెక్కించబోతున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రం తెలుగు సినీ ప్రేమికులకు తప్పకుండా నచ్చుతుందనే నమ్మకంతో రవి కుమార్ ఉన్నారు. అయిుతే ఈ సినిమా టైటిల్ సహా మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. కాబట్టి ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన మరిన్ని అప్డేట్లు కావాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.