»Alia Bhatt As The Richest Heroine India Only One Movie Rs 20 Crores
Alia Bhatt: అత్యంత ధనిక హీరోయిన్ గా అలియా భట్..ఒక్క మూవీకే ఏకంగా
బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్(Alia Bhatt) చూస్తే చిన్న పిల్లలాగా అనిపిస్తుంది. కానీ ఈ అమ్మడు ప్రస్తుతం దేశంలో అత్యధికంగా పారితోషకం తీసుకునే హీరోయిన్ల జాబితాలో టాప్ లో నిలిచినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె ఒక్కో చిత్రానికి రూ.20 కోట్లు తీసుకుంటున్నట్లు తెలిసింది. అంతేకాదు ఆమెకు ఆస్తులు కూడా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.
ప్రముఖ బాలీవుడ్ నటి అలియా భట్(Alia Bhatt) ప్రస్తుతం తన జనరేషన్లో ఉన్న హీరోయిన్లలో అత్యంత ధనిక నటిగా ఉన్నట్లు తెలుస్తోంది. వామ్మో నిజమా అంటే అవుననే చెప్పవచ్చు. ఎందుకంటే 30 ఏళ్ల వయసులో ఉన్న ఈ అమ్మడు ప్రస్తుతం ఒక్కో చిత్రానికి 20 కోట్ల రూపాయల పారితోషకం తీసుకుంటుంది. మార్చి 15, 1993న భారతీయ సంతతికి చెందిన బ్రిటీష్ చిత్రనిర్మాత మహేష్ భట్, నటి సోనీ రజ్దాన్ లకు జన్మించింది.
1999 థ్రిల్లర్ సంఘర్ష్లో చిన్నతనంలో ఆమె నటనా రంగ ప్రవేశం చేసిన తర్వాత, కరణ్ జోహార్ టీనేజ్ చిత్రం స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ (2012)లో ఆమె తన మొదటి ప్రధాన పాత్రను పోషించింది. ఆ తర్వాత రోడ్ డ్రామా హైవే (2014)లో కిడ్నాప్ బాధితురాలిగా నటించినందుకు ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ క్రిటిక్స్ అవార్డ్‌ను గెలుచుకుంది. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. దీంతో ప్రస్తుతం అలియా భట్ బాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా కొనసాగుతుంది. ఆమె అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పుడు భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్ గా నిలిచింది.
బాలీవుడ్లో ఇటీవల వచ్చిన హిట్ సినిమాలన్నింటిలో అలియా భట్(Alia Bhatt) హీరోయిన్ గా ఉండటం విశేషం. ఆమె నటించిన ఏడు సినిమాలు 100 కోట్ల క్లబ్లో చేరాయి. బ్రహ్మాస్త్ర, గంగూబాయి, గల్లీ బాయ్, రాజీ వంటి సినిమాలు వాటిలో ఉన్నాయి. ఇది కాకుండా అలియా మొదటి హాలీవుడ్ చిత్రం హార్ట్ ఆఫ్ స్టోన్స్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలకు సిద్ధంగా ఉంది.
మరోవైపు అలియా భట్ వ్యాపారంలోకి కూడా ప్రవేశించింది. ఎడ్ మామా అనే పిల్లల దుస్తుల బ్రాండ్‌ను కలిగి ఉంది. అలియాకు అనేక ఇతర పెట్టుబడులు కూడా ఉన్నాయి. ఎడ్ మామా ఆస్తులు 150 కోట్లు. దీంతోపాటు అలియా మహిళల ప్రసూతి దుస్తుల సేకరణను కూడా ప్రారంభించింది. అలియా IIT కాన్పూర్‌తో కలిసి D2C వెల్నెస్ కంపెనీ అయిన Phool.Co బ్రాండ్‌లో పెట్టుబడిని కూడా కలిగి ఉంది. ఈ క్రమంలో అలియా సినిమాల్లో నటించడమే కాకుండా సినిమా నిర్మాణంలోనూ దూసుకుపోతోంది. అలియా నిర్మాణ సంస్థ పేరు ఎటర్నల్ సన్‌షైన్ ప్రొడక్షన్. ఫోర్బ్స్ నివేదిక ప్రకారం అలియా నికర విలువ 229 కోట్లు అని తెలుస్తోంది. మరోవైపు తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసియాలోనే అత్యధిక ఫాలోవర్స్(76 మిలియన్లు) ఉన్న నటిగా కూడా కొనసాగుతుంది.