»Director Venu Sriram Said There Will Also Be Vakeel Saab 2 Soon
Venu Sriram: త్వరలోనే వకీల్ సాబ్ 2 కూడా..!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Power Star Pawan Kalyan) యాక్ట్ చేసిన వకీల్ సాబ్(Vakeel Saab) చిత్రం నిన్నటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్(venu sriram) అభిమానులతో చిట్ చాట్ నిర్వహించారు. ఆ క్రమంలో వకీల్ సాబ్ 2 కూడా పక్కాగా ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు.
పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్(Power Star Pawan Kalyan) నటించిన వకీల్ సాబ్ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అయ్యిందో అందరికీ తెలిసిన విషయమే. ఈ చిత్రం విడుదలై నిన్నటితో రెండు సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ నేపథ్యంలో వకీల్ సాబ్ 2(Vakeel Saab 2) కూడా వచ్చే అవకాశం ఉందని సమాచారం తెలిసింది. ఇది తెలిసిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులందరు తెగ ఖుషీ అవుతున్నారు. పవన్ కళ్యాణ్ యాక్ట్ చేసిన వకీల్ సాబ్ మూవీ అమితాబ్ బచ్చన్ నటించిన రీమేక్ చిత్రంగా వచ్చింది. ఈ చిత్రానికి వేణు శ్రీరామ్ దర్శకత్వం(director venu sriram) వహించారు. ఈ క్రమంలో అభిమానులతో ఇంటరాక్ట్ అయిన వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ 2 త్వరలో ఉంటుందని అందరనీ ఆశ్చర్యపరుస్తు వెల్లడించారు. సీక్వెల్ కోసం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోందని ఆయన తెలిపారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన సూపర్ హిట్ చిత్రం వకీల్ సాబ్(Vakeel Saab) నిన్నటితో రెండేళ్లు పూర్తి చేసుకుంది. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ట్విట్టర్లో చాటింగ్ నిర్వహించారు. ఆ చర్చలో వేణు శ్రీరామ్ కూడా చేరారు. సంభాషణలో భాగంగా వకీల్ సాబ్ ఖచ్చితంగా తిరిగి విడుదల చేయబడుతుందని అన్నారు. దీంతోపాటు వకీల్ సాబ్ 2 కూడా ఖచ్చితంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఉస్తాద్ భగత్ సింగ్, ఓజీ, హరి హర వీర మల్లు, వినోదాయ సీతమ్ రీమేక్ వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాలు పూర్తైన తర్వాత వకీల్ సాబ్ 2ను తెరెకెక్కించనున్నట్లు తెలుస్తోంది. అయితే అది ఎప్పుడనేది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. అయితే ఎన్నికలు పూర్తైన తర్వాత చిత్రీకరిస్తారా లేదా ఎన్నికలకు ముందే ఈ చిత్రం నిర్మిస్తారా అనేది తెలియాల్సి ఉంది.