»Temperatures Increase In Telangana Red And Yellow Alerts In Ts
Telangana : రెడ్ అలర్ట్.. తెలంగాణలోని పలు జిల్లాల్లో 45 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు!
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. గతేడాది ఈ సమయంలో నమోదైన ఎండలతో పోలిస్తే ఈ ఏడు సరాసరిన ఐదారు డిగ్రీల వరకు ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో కొన్ని ప్రాంతాలకు వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
Temperatures Rise In Telangana : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు ఎనిమిది జిల్లాల్లో ఉష్ణోగ్రతలు ఏకంగా 45 డిగ్రీలు దాటి నమోదు అవుతున్నాయి. దీంతో వాతావరణ శాఖ(weather department) ప్రజల్ని అప్రమత్తంగా ఉండాల్సిందిగా హెచ్చరిస్తూ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉదయం పదకొండు గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఇంటి నుంచి బయటకు రాకపోవడమే మేలని సూచించింది.
వాతావరణ శాఖ కొన్ని ప్రాంతాలకు రెడ్ అలర్ట్ జారీ చేయగా మరి కొన్ని ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే ఐదు రోజులు ఎండలు మరింత పెరిగి వడగాల్పులు వీచే ప్రమాదం ఉంటుందని తెలియజేసింది. గురువారం దేశంలోనే అత్యధిక ఉష్ణోగ్రత(TEMPERATURE) కొత్తగూడెంలో 44 డిగ్రీలు నమోదు అయినట్లు తెలిపింది. అయితే శుక్రవారం నుంచి ఏకంగా ఎనిమిది జిల్లాల్లో 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నట్లు వెల్లడించింది.
తెలంగాణ(TELANGANA)లోని వరంగల్, వనపర్తి, జగిత్యాల, యాదాద్రి, నల్గొండ, పెద్దపల్లి, కరీంనగర్ తదితర జిల్లాల్లో 45 డిగ్రీలను మించి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో ఇక్కడ రెడ్ అలర్ట్(RED ALERT) జారీ అయ్యింది. మరో 25 జిల్లాలలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదు అవుతున్నట్లు వెల్లడించింది. ఉదాహరణకు హైదరాబాద్లోని చందా నగర్లో గత ఏడాది ఇదే సమయానికి 35.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు అయింది. అదే ఇప్పుడు 43.5 డిగ్రీలు నమోదు అయింది. దీన్ని బట్టి ఎండల తీవ్రత ఇప్పుడు ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు.